7, జూన్ 2014, శనివారం

పద్యరచన - 583

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి. 

16 కామెంట్‌లు:


 1. పుత్రికా సో యత్ర మాతా భవంతి
  కామెంటా సో తత్ర టపా భవంతి !!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. కన్నబిడ్డను తన కౌగిటందున జేర్చి
  పరవసించు చుండె పరమ సాధ్వి
  అవని పుట్టి నట్టి యమృతమే తన మది
  కన్న తల్లి హృదయ మున్న తంబు

  రిప్లయితొలగించండి
 3. కన్నప్రేమకు దార్కాణ మన్న ! జూడు
  చిత్ర మాయది యాతల్లి పుత్రుని నట
  ప్రేమ మీరగ నురమున బెట్టు కొనుచు
  ముద్దు లీయుచు నుండెను ముద్దరాలు

  రిప్లయితొలగించండి
 4. జిలేబీ గారూ,
  టపాకు కామెంటు ఉంటుందా? కామెంటుకు టపా ఉంటుందా?
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కౌగిటిలో జేర్చి..’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది.అభినందనలు.

  రిప్లయితొలగించండి

 5. నా పుణ్యంబుల ప్రోవ! భాగ్యముల కన్నా! చిట్టి బంగారమా!
  నా పాపా! తొలిజన్మనోము ఫలమా! నా తల్లి! నా ప్రాణమా!
  ఈ పాపిష్టి ప్రపంచ మందు కడగం డ్లెట్లోర్తువో కంటిలో
  పాపై కాపురముండి పొమ్ము నిను కాపాడంగ నేనుండనే.

  రిప్లయితొలగించండి
 6. ప్రేగు బంధమై దాల్చగ బిడ్డ రూపు
  కంట కన్నీరు కార్చెనా కదలి పోయి
  గుండెలకు హత్తు కొనుచును గోర్కె దీర్చి
  ముద్దు మురిపాలఁ బంచును మురిసి తల్లి!

  రిప్లయితొలగించండి
 7. మిస్సన్న గారూ,
  చాలా చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. బొమ్మ గీసెను చక్కని యమ్మ గాను
  తల్లి బిడ్డల ప్రేమలు వెల్లు వనుచు
  ఉల్ల మందున మమతల ఝల్లు కురియ
  మాతృ వాత్సల్య మునుమించు మాట కలదె ? ?

  రిప్లయితొలగించండి
 9. అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. పిల్లని గుండెకు హత్తుకు
  తల్లి హృదయము మయిమరచి తన్మయ మొందెన్
  కల్లా కపటము తెలియని
  పిల్లకు తల్లి యెదను గనిపించె స్వర్గంబే !

  రిప్లయితొలగించండి
 11. తల్లీ పిల్లల ప్రేమలు
  మల్లీ జాజులను పోలి మాధుర్యంబౌ!
  నెల్లెడల గానిపించుచు
  ముల్లోకములందు వెలుగు ముఖముల గనినన్


  రిప్లయితొలగించండి
 12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పిల్లని’ అనడం గ్రామ్యం.‘పిల్లను’ అనండి.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘తల్లీపిల్లలు, మల్లీజాజులు’ అనడం వ్యావహారికం. తల్లియు పిల్లలు, మల్లెలు జాజులు’ అనండి.

  రిప్లయితొలగించండి
 13. తీరుగ పాలభాగమున దిద్దిన కుంకుమ చీర కట్టుతో
  తారల వంటి నేత్రములు తళ్కులు చిందు ముఖారవిందయై
  నారి ధరించె నంకములు నవ్యత నొప్పగ నందమైన యా
  కారము గల్గినట్టి తన కన్న కుమార్తెను చంకనెత్తుచున్!

  రిప్లయితొలగించండి
 14. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి