2, జూన్ 2014, సోమవారం

పద్య రచన – 578

కవిమిత్రులారా,

 పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27 కామెంట్‌లు:

  1. ఆదిలాబాదు, హైదరాబాదు, ఓరు
    గల్లు, మెహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ,
    ఖమ్మము, నిజామబాదు, కరీమునగరు,
    రంగరెడ్డి తెలంగాణ రాష్ట్ర మయ్యె

    రిప్లయితొలగించండి
  2. కోటి రతనాల వీణలే కోరి మ్రోగ
    బ్రతుకు దిద్దంగ బతుకమ్మ పట్టు జాణ
    జానపదులెల్ల కీర్తించు గాన మలర
    ఓతెలంగాణ ! సాగుమా ఉజ్వలముగ .

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    పదిజిల్లాల తెలంగాణను చిన్న పద్యంలో దర్శింపజేశారు. బాగుంది. అభినందనలు.
    ‘కరీమునగరు’ అన్నప్పుడు యతిదోషం... కరీంనగర్‍ను కరినగరం అనికూడా పేర్కొంటారు (ముఖ్యంగా గ్రామీణులు, ఆరెస్సెస్, బీజెపి వాళ్ళు) కనుక ఆ పాదాన్ని ఇలా మారుద్ధాం...“ఖమ్మమును నిజామాబాదు కరినగరము”
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. నూతన రాష్ట్రము నిచ్చెను
    మాతయ మన సోనియమ్మ మనకు న్నిపుడున్
    జేతోమోదము తోడన
    నేతలు మరి యెన్నుకొనిరి నేతగ జంద్రున్

    రిప్లయితొలగించండి
  5. అరువదేళ్లుగ నిండిన యార్తి తీర
    నవ తెలంగాణ పాలనమవతరించె
    దశమ జిల్లాల నేలెడు దశరథుండు
    రామ రాజ్యము గూర్చునో ప్రాణులలర?

    రిప్లయితొలగించండి
  6. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దశమ’అంటే పదవ అని అర్థం వస్తుంది. ‘దశకమయిన జిల్లా లేలు దశరథుండు’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. ‘అరువది తొమ్మిది’న్ మరియు నా పయి రేగిన ఉద్యమాలలో
    ఒరిగిన కంఠ మాలల మహోన్నత త్యాగ ఫలంబునౌచు, నే
    డరుగుచు నుండె గాదె ’తెలగాణము’ పూర్ణ స్వతంత్ర మొందుచున్!
    అరువది యేండ్ల స్వప్న మిది, ఆకృతి దాలిచి ముందు నిల్చెడిన్!!

    రిప్లయితొలగించండి
  8. కోటి గొంతుక లేకమై కూడబలికి
    మేటి గానము జేయుచు మూటిగాను
    పోరు జేసి తెలంగాణ కోరుకొనుచు
    క్రొత్త రాష్ట్రమ్ము సాధించుకొనిరి నిజము!

    కాకతీయుల శౌర్యము కలుపుకొనుచు
    నుద్యమములోన ప్రాణములొడ్డిపోరి
    తల్లి దండ్రుల బాసిన తనయులార
    అందుకొనుడు తెలంగాణ వదనములు!

    నల్ల బంగారు గనులతో వెల్లి విరిసి
    కృష్ణ, గోదారి జలముతో తృష్ణదీర్చి
    పాడి పంటల నందించి బడుగు ప్రజల
    కష్టములదీర్చు మా తెలంగాణతల్లి!

    రిప్లయితొలగించండి
  9. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    చక్కని ఖండికను వ్రాాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కలసి యుండ మాకు కాదిక న్యాయము
    వేరు పడిన సుఖము వేగ కలుగు
    నంచు నుద్యమించి రా పది జిల్లాల
    ప్రజలు స్వంత రాష్ట్ర ప్రభల కొరకు.

    విరిగిన మనసుల కాపుర
    మరయగ సాధ్యమ్ము గాని దది యెట్లన్నన్
    సరిగమ లెట్లిక మ్రోగును
    వరవీణా తంత్రు లూడ వైణిక మణికిన్?

    కోటికి మించు నాశలను గుండెను దాచుక నుద్యమించ మా
    పాటికి మాకు రాష్ట్ర మిడి పంపిన మేలని వత్సరాలుగా
    ధాటిగ, పండె మీకలలు తమ్ములు నన్నలు నమ్మ లయ్యలూ
    నేటికి, శాంతి ధామముగ నీనుత మీ తెలగాణ వన్నెలన్.

    రిప్లయితొలగించండి
  11. కాకతీయుల శౌర్యము, కలిపి యుంచు
    భారతీయత, జతగూడి పరమతంపు
    సహనమును చాటు రీతిగా చక్కనైన
    తేజమును చాటు తెలగాణ రాజముద్ర.

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    “శాంతి ధామముగ నీనుత మీ తెలగాణ వన్నెలన్” అని ఆకాంక్షిస్తూ మీరు చెప్పిన పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు. ‘నందో రాజా భవిష్యతి!’ చూద్దాం... భవిష్యత్తు ఎలా ఉంటుందో?

    రిప్లయితొలగించండి
  13. చిన్న రాష్ట్రము కనుపించె చెన్ను గాను
    రైతు రాజులు రాష్ట్రాన్ని రయము గాను
    ప్రగతి పథమున నడి పింత్రు ప్రతిభ తోడ
    భరత దేశపు మకుటమౌ భవిత లోన

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులకు శుభాశీస్సులు.
    అస్వస్థతతో నేను పూర్వమువలె పాల్గొన లేకున్నాను.

    కలకాలమ్ము సమస్త సంపదల కాగారమ్ము కేదారమై
    యలరుం గాక! వినూత్న రాష్ట్రము తెలంగాణా మహాదర్శ కాం
    తులు దిగ్వీధులలో ప్రశంసితములై ద్యోతింప రమ్యమ్ములై
    యిలకున్ భూషణమై సుధీనిలయమై హృద్యప్రదీపంబునై

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదాలు మాష్టారు ... మీ సూచనల మేరకు పద్యమును సవరించితిని
    ఆదిలాబాదు, హైదరాబాదు, ఓరు
    గల్లు, మెహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ,
    ఖమ్మమును నిజామాబాదు కరినగరము,
    రంగరెడ్డి తెలంగాణ రాష్ట్ర మయ్యె

    రిప్లయితొలగించండి
  17. Pandita Nemani గారూ మీ పద్యం చాలా బాగుంది. మీ అస్వస్థతల నుండి త్వరలో కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
    -----------------------------
    కలకాలమ్ము సమస్త సంపదల కాగారమ్ము కేదారమై
    యలరుం గాక! వినూత్న రాష్ట్రము తెలంగాణా మహాదర్శ కాం

    రిప్లయితొలగించండి
  18. శ్రీ లక్కరాజు వారు! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు మా సంతోషము. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  19. కోటి గొంతుక లేకమై కూడబలికి
    మేటి గానము జేయుచు మూటిగాను
    పోరు జేసి తెలంగాణ కోరుకొనుచు
    క్రొత్త రాష్ట్రమ్ము సాధించుకొనిరి నిజము

    కాకతీయుల శౌర్యము కలుపుకొనుచు
    నుద్యమములోన ప్రాణములొడ్డిపోరి
    తల్లి దండ్రుల బాసిన తనయులార
    అందుకొనుడు తెలంగాణ వందనములు

    నల్ల బంగారు గనులతో వెల్లి విరిసి
    కృష్ణ, గోదారి జలముతో తృష్ణదీర్చి
    పాడి పంటల నందించి బడుగు ప్రజల
    కష్టములదీర్చు మా తెలంగాణతల్లి

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని వారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. జయ తెలంగాణ!

    ఆనంద హేలయై యావిర్భవించిన
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    జనగణాకాంక్షల సాకార రూపమౌ
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    చెన్నొదవెడు పది జిల్లాల భాగ్యమౌ
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    ప్రగతి పథమ్ములో పరవళ్ళు త్రొక్కెడు
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    జయము భూదేవి రత్న భూషణ వరమ్మ!
    జయము సంక్షేమ పర్వమా! జయము జయము
    జయము సౌజన్య నిలయమా! జయము జయము
    జయ తెలంగాణ రాష్ట్రమ! జయము జయము

    రిప్లయితొలగించండి
  22. నేమాని పండితార్యా! మీ పద్యములు హృద్యముగా నున్నవి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
    మీ ప్రశంసకు మా సంతోషము. మీ పద్యములును
    కడుంగడు రమ్యముగా నున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. పండిత నేమాని వారూ,
    తెలంగాణ ప్రజలంతా నిత్యపారాయణం చేసికొనతగిన హృద్యమైన పద్యాన్ని అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. పల్లెలు పట్నాలు ప్రగతి పథముపైన
    పరుగెత్తిఫలముల బంచు నాడు

    బీడు వారిన నేల మోడువారిన చేలు
    పులకించి చిగురించి పొంగు వేళ

    పొట్ట పోసుకొనంగ పొరుగు దేశముకేగు
    బిడ్డల వలసలు బెరగ నపుడు

    నిలువెత్తు కొడుకులు విలువైన కొలువులో
    చెలరేగి నభివృద్ధి చేయు నపుడు

    గడప గడపన గంగమ్మ కాలు మోప
    కొమ్మ కొమ్మన కోయిలల్ కూయు చుండ
    కోటి తంత్రుల వీణలు మీటు చుండ
    గంతు లేయును మా తెలంగాణ సీమ !!!

    రిప్లయితొలగించండి