29, జూన్ 2014, ఆదివారం

పద్యరచన - 605

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. శవము కాల్చిన బూడిద శివున కంట
    భస్మ మభిషేక మొనరించ విస్మ యంబు
    ప్రజలు పూజింతు రెపుడు నవంతి యందు
    మహిమ గలకాళే స్వరుని మదిని గొలువ

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    పద్యం బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం. ‘మహిమ గలుగు కాళేశ్వరు మదిని గొలువ’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. హరహర శంకరా యనుచు నార్తిని వేడిన సర్వ సంపదల్
    వరముగ నిత్తువంచు విని పర్వదినమ్ముల నీదు పూజలన్
    కరమొనరించు భక్తులకు కన్నులపండువు నీ విభూతులౌ
    మరియొక జన్మ లేదుగద మాలిమి నీవు బిరాన నేలుటన్.

    లింగము చెంత జేరి గన లేదిక పాపము దాని భక్తితో
    గంగను జేయ షేచనము కానిది జన్మ మరొక్క మారు నా
    బెంగ యిదే కదా భవపు భీతిని బాపెడు దేవ కాశి మా
    ముంగిట నున్న గాని నిను మోదముతో దరిశింప నైతినే.

    రిప్లయితొలగించండి
  4. జనన మరణంబు జీవ ప
    రిణామ మనుచు లయకార లీలా మూర్తై
    నిరతము భస్మార్చనలన్
    పురోహితులొనర్చ మెచ్చు భూతేశ నమో!

    రిప్లయితొలగించండి
  5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

    పూజ చేయుచుండ్రి ముదముతో భక్తులు
    శివుని లింగమునకు చింత తొలగ
    కలుగజేయు శివుడు కరమగు శాంతిని
    నిత్యపూజఁ జేయ నిష్ఠతోడ.

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    మీ రెండు వృత్తాలు ధారాశుద్ధితో శోభిస్తూ అలరించాయి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మూర్తి + ఐ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    జనన మరణంబు జీవ ప
    రిణామ మనుచు లయకార లీలా విభుడై
    నిరతము భస్మార్చనలన్
    పురోహితులొనర్చ మెచ్చు భూతేశ నమో!

    రిప్లయితొలగించండి
  8. లింగమునభిషే కించగ
    మంగళకరమగువిభూది,మంత్రము తోడన్
    జంగమ దేవరను గొలిచి
    హంగుగ పూజలను జేయు నర్చకు లచటన్

    రిప్లయితొలగించండి
  9. నినిన్నటి పద్య రచన:
    పిల్లి పిల్ల చిన్ని పిల్లతో వెరవక
    కలిసి మెలసి యాడ కనుల విందు!
    చిన్న నాట కలుగు జీవ కారుణ్యంబు
    మీద వంట పడని చేదు మందు!




    రిప్లయితొలగించండి
  10. సహదేవుడు గారూ,
    మీ సవరణ బాగుంది. సంతోషం.
    నిన్నటి శీర్షికకు వ్రాసిన పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వంట పడని...’?
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పూజలను జేతు రర్చకు లచటన్’ అంటే అన్వయం ఇంకా బాగా కుదురుతుందేమో!

    రిప్లయితొలగించండి
  11. చేయుచుండెను బూజను శ్రీ జ నిరతి
    వరల కా ళే శ్వరున కట వాణి !చూడు
    పూజ జేయుట మనవంతు భూరి వరము
    లిచ్చుట మఱి యా భగవంతు డిష్ట ముగద

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘భగవంతు నిష్టముగద’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. శవ దహనపు బూడిదతో
    శివలింగమున కభిషవము జేసి సపర్యల్
    భువి వెలసిన కాలేశ్వర
    భవునికి గావించు చుంద్రు భక్తులు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మహేశ! భస్మమున్ ధరించి మాదు మోహమంతటిన్
    దహింపవే! సురేశ! నీవు తండ్రి వంచు నమ్మితిన్!
    మహా మహాత్ములెందరున్న, మమ్ము కూడ చూడుమా!
    సహాయమందకున్న నాదు శక్తి చాలునా, శివా!

    రిప్లయితొలగించండి
  16. గురువుగారికి ధన్యవాదములు,
    వంట పడని చేదు మందు అంటే శరీరానికి పడని చేదు మాత్ర అనే భావంతో వ్రాశానండి. తప్పైతే సవరించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  17. ఈరోజు జగత్ప్రసిద్ధమైన శ్రీజగన్నాథ రథయాత్ర సందర్భంగా...
    జనులనుఁ జూడగా కదలి చల్లగ వచ్చితివా జగత్ప్రభూ!
    మనమున నింత కింత కృప మాపయి చూపగ లోకనాథుడా!
    దినదినమిట్టి లోకమున దీనత నొందితిమయ్యదేవుడా!
    కనులను విప్పి నీదరిని గైకొనవయ్య జగత్పతీ! హరీ!

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీదేవి గారూ,
    శివకేశవుల పరంగా మీరు చెప్పిన రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    నేను అడిగింది... ఒంట పడని... అన్నదాన్ని మీరు వంట పడని అని గ్రామ్యాన్ని ప్రయోగించారు అని..

    రిప్లయితొలగించండి
  19. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    పిల్లి పిల్ల చిన్ని పిల్లతో వెరవక
    కలిసి మెలసి యాడ కనుల విందు!
    చిన్న నాట కలుగు జీవ కారుణ్యంబు
    మీద నొంట పడని చేదు మందు!


    రిప్లయితొలగించండి