జిలేబీ గారూ, మంచి భావాన్ని అందించారు. అభినందనలు. మిత్రు లెవరైనా ఈ భావానికి పద్యరూపం ఇస్తారేమో చూద్దాం. లేకుంటే సాయంత్రం వరకూ నేనే ఛందోబద్ధం చేస్తాను. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘చూచుచునుండెఁ దా నింతలోన’ అనండి. ప్రమదమునకు ప్రమాదము వచ్చింది!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు. ‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘ఊహలో నూరించు, గుండెలో ముల్లుగా’ అనండి. * గండూరి లక్ష్మినారాయణ గారూ, కరుణశ్రీ పద్యాన్ని అనుకరించినా మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండితన కనులనే వెలుతురు గా మార్చి
మావ కి వెలుగు దిక్సూచి అయి
ఇంట వేచి ఉన్న ఆల్చిప్పల అలివేణి
తహ తహ ఇంతని చెప్పుట వీలగునా ??
శుభోదయం
జిలేబి
మాపటి వేళన బెట్టిన
రిప్లయితొలగించండిదీపము తా జెప్పె ' పడకు దిగులును కాంతా !
తాపముజెందకు మామయె
దాపులనే నుండె పొలము దారిని గనుమా '!
మాపటి వేళన బెట్టిన
రిప్లయితొలగించండిదీపము తా జెప్పె ' పడకు దిగులును కాంతా !
తాపముజెందకు కాంతుడు
దాపులనే నుండె పొలము దారిని గనుమా !
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిమంచి భావాన్ని అందించారు. అభినందనలు.
మిత్రు లెవరైనా ఈ భావానికి పద్యరూపం ఇస్తారేమో చూద్దాం. లేకుంటే సాయంత్రం వరకూ నేనే ఛందోబద్ధం చేస్తాను.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘చూచుచునుండెఁ దా నింతలోన’ అనండి. ప్రమదమునకు ప్రమాదము వచ్చింది!
భర్త రాకకై నిలబడి భామ యచట
రిప్లయితొలగించండియెదురు చూచుచు నుండె దా నింతలోన
భర్త రాకను గమనించి ప్రమద మలర
సిగ్గు తోడన ముఖమది యగ్గ లించె
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గోవుల్ని తోలుక గోపన్న రాలేదు
రిప్లయితొలగించండిగోపెమ్మ వేచెను గూటియందు
ఊహల్లొ ఊరించు మోహనాంగుని చూపు
గుండెల్లొముల్లుగా గుచ్చుకొనుచు
మాటి మాటికి యద్దమందున తనయొక్క
చూడచక్కనిమోముచూచు కొనుచు
ఎంత వేచినగాని యెక్కడఁ గనరాడు
కాయలే కాచెను కాంత గనుల
చిన్న యలికిడి యైనను చెలునికొరకు
ఉలికిపడి చూచు గోపెమ్మ యొక్క క్షణము
గుమ్మమందున యాముద్దుగుమ్మ నిలిచె
స్వాగతించగ పతిననురాగ మగ్న
రిప్లయితొలగించండిచూచెదవేలనో సుగుణ సుందరి నీ మదిలోననున్న యా
లోచన లేమిటో కమల లోచని నీ హృదయాంతరంగమున్
దోచిన వాని కోసమయి తొయ్యలి మూగెడి సందె ప్రోద్దులో
వేచి నిరీక్షణంబు నతి ప్రీతిని జేయుచు నుంటివా సఖీ !
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...
రిప్లయితొలగించండిసంధ్యవేళలోన సన్నదీపము బెట్టి
కలలు కనుచునుండె కమలనయన
యింటిద్వారముకడ నిమ్ముగా గూర్చుండె
విభుని రాక కొఱకు వరహ మడర.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘ఊహలో నూరించు, గుండెలో ముల్లుగా’ అనండి.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
కరుణశ్రీ పద్యాన్ని అనుకరించినా మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
వెన్నెల వెలుగుల సౌరులు
రిప్లయితొలగించండికన్నులు మిరిమిట్లు గొలుపు కాంతా మణియౌ
సన్నని నగవుల పలుకులు
చెన్నుని కొఱకంచు వేచె చెలువము మీరన్
కన్నుల వెన్నెల కాచెను
రిప్లయితొలగించండిసన్నని చిరునవ్వు వేచె స్వాగత మీయన్
మన్నన కలిగే రీతిగ
చిన్నది నిలుచుండె చెలుని చింతన తోడన్
కన్నులు కాయలు కాయగ
రిప్లయితొలగించండిచిన్నది వేచెనొ యటంచు చెలికాడదుగో
దున్నల తోలుకు వచ్చుట
కన్నులకింపుగ లిఖించు కళలకు జేజే!
కట్టె భుజమున మెడలోన కండువ నిడి
రిప్లయితొలగించండిపైకి గట్టిన పంచతో వాట మెరిగి
నడచి గోధూళి వేళలో నన్ను జేరు
మావ నా కంటి దీపమై మరులు గొల్పు