7, జూన్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1436 (మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను)

 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను మాద్రి కొడుకు. 

22 కామెంట్‌లు:


  1. మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను మాద్రి కొడుకు
    ద్రౌపది ని చెర బట్టెను గాంధారి కొడుకు
    గాంధారి కొడుకు ని గొట్టెను కుంతి కొడుకు
    కుంతి కొడుకును కొట్టెను ద్రుపద కొడుకు !!

    (కథ కంచి కి మన మింటికి!! )
    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. దాశరధి సూను రానుడు ధర్మ నిరతి
    మత్స్య యంత్రమ్ము గొట్టెను , మాద్రి కొడుకు
    ఖడ్గ విద్యను సహదేవు ఘనుడు గాదె ?
    అంద మందున నకులుడు మరుని మించె

    రిప్లయితొలగించండి
  3. పాల్గునుండు కుంతీ పుత్రు ప్రతిభ మీర
    మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను, మాద్రి కొడుకు
    నకులు డే కాదు సభలోని సకల నృపులు
    జెంది రబ్బుర మానంద మొందె కృష్ణ.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    1వ పాదమును ఇలాగ మార్చుదాము:
    ఫల్గుణుడు కుంతి పుత్రుడు ప్రతిభ మెరయ --
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. పదుగు రాశ్చర్య పడురీతి పార్థుడచట
    మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను; మాద్రి కొడుకు
    వైరి,యశ్వ,గోపాలకు లనగ నాడు,
    విరటు నింటను గడిపిరి వింతగాను

    రిప్లయితొలగించండి
  6. అమిత బలము తోడన నర్జు నుండు
    మత్స్య యంత్రము గొట్టెను ,మాద్రి కొడుకు
    లునకుల సహదే వులు బల ము నన తీసి
    పోరు పార్ధు మొదలుగాగ వీరులకును

    రిప్లయితొలగించండి
  7. ఫల్గుణుని లక్ష్యభేధన ప్రతిభ మెరయ
    మత్స్య యంత్రము గొట్టెను ,మాద్రి కొడుకు
    లిద్ద రనిలజుడు ధర్మజుని రెక్కలనగ
    పాండవులు మండితులు వేద పండితులుగ

    రిప్లయితొలగించండి
  8. భవ్యమైనట్టి సభసాక్షి సవ్య సాచి
    మత్స్య యంత్రము గొట్టెను ;మాద్రి కొడుకు
    గొట్టె శల్యుని రణమందు ,గొట్ట గాలి
    కొడుకు గదతోడ తొడలపై మడిసె రాజు !!!

    రిప్లయితొలగించండి
  9. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....

    మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను మాద్రి కొడుకు
    ద్రౌపదిని చెర బట్టె గాంధారి కొడుకు
    కుంతి కొడుకును ద్రుపదుని కొడుకు కొట్టె!!
    లేని మాటలే యివి జిలేబి వినుము.
    *
    అక్కయ్యా,
    మరీ తొందరపడి పూరణ చేసినట్టున్నారు.
    దాశరథి అంటేనే రాముడు. మరి దాశరధి కొడుకు రాము డన్నారేమిటి? అయినా రాముడు మత్స్యయంత్రాన్ని కొట్టలేదు కదా.. సవరించండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    పండిత నేమాని వారి సూచన గమనించండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘అమిత నైపుణ్యమును జూపి యర్జునుండు’ అందాం.
    *
    యం. ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.


    రిప్లయితొలగించండి
  10. ద్రౌపదీ స్వయంవర నిమిత్తమున క్రీడి
    మత్స్య యంత్రమ్ముఁ గొట్టెను; మాద్రి కొడుకు
    లిర్వురును భీమ ధర్మజు లెల్ల రపుడు
    తనివి తీర నాతనికి వందనములిడిరి!

    రిప్లయితొలగించండి
  11. అర్జునుండు స్వయంవరమందు నేమి
    చేసె? పాండురాజు కెవరు చిన్నభార్య?
    ఆమె కు నకులు డేమగు? నన క్రమముగ
    మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను- మాద్రి- కొడుకు

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాతవాసాన పాండవులలో...

    ధర్మజుడె కంకుభట్టుగ తాను మారె
    వాయునందను డచ్చట వలలుడాయె
    ఫల్గుణుండు బృహన్నలె భళిర! నాడు
    మత్స్యయంత్రము గొట్టెను, మాద్రి కొడుకు
    లిద్దరు హయ పాలకులుగ సిద్ధమైరి.

    రిప్లయితొలగించండి
  13. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. విజయు డతిప్రతిభాశాలి విక్రమించి
    మత్స్య యంత్రమ్ము గొట్టెను మాద్రి కొడుకు
    లును యుధిష్ఠిర భీములు ప్రోత్సహింప
    సభ్యుల ప్రశంసలొందె సౌజన్యమూర్తి

    రిప్లయితొలగించండి
  15. అర్జునుండు తా నగ్రజునాజ్ఞతోడ
    మచ్చ యంత్రము గొట్టెను, మద్రి కొడుకు
    లైన కవలలు, భీముడు నాత్మ నందు
    సంతసించిరి సోదరు శక్తి జూచి

    రిప్లయితొలగించండి
  16. స్వయం వరమందు గెలుపొంద సవ్య సాచి
    మత్స్య యంత్రమ్ము గొట్టెను , మాద్రి కొడుకు
    ఖడ్గ విద్యను సహదేవు ఘనుడు గాదె ?
    అంద మందున నకులుడు మరుని మించె


    అవునుకద అసలునాకు తెలిసిందే చాలా తక్కువ అందునా మతి మరపు ఇంకా తొందర ,కొంచం గుడ్డి , అన్నీకలిన పద్యం అదన్నమాట అసల్ సంగతి ఇదెల ఉం టుందో ఫ్ఛ్ !

    రిప్లయితొలగించండి
  17. జిలేబీ గారి భావానికి నేను వ్రాసిన పద్యంలో చివరి పాదాన్ని ఇలా చదువుకోండి.
    ‘లేని మాటలే యివ్వి జిలేబి వినుము’
    దోషాన్ని తెలియజేసిన చంద్రమౌళి గారికి ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఆత్మయందు, లేదా ఆత్మలోన’ అనండి.
    *
    అక్కయ్యా,
    ఈ పూరణలోనూ దోషాలు...
    ‘స్వయం’ అన్నప్పుడు గణదోషం.
    ‘సహదేవు’ అని పదాన్ని అసంపూర్ఝంగా వదిలారు.
    మూడవ పాదంలో యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  18. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    సవ్య సాచియు పాంచాలు సభను నట్లు
    మత్స్య యంత్రమ్ము గొట్టెను; మాద్రి కొడుకు
    లిద్ద రెలమిని భీముతో నింపు ధర్మ
    రాజు,పెండ్లియాడరె కృష్ణ రాజితముగ

    కుంతి కొడుకుల పిన్నయౌ కొడుకువేగ
    మత్స్యయంత్రమ్ము గొట్టెను మాద్రికొడుకు
    పిన్న సహదేవు డయ్యెడ పెద్దగాను
    విజయము నకును పొగడెను వీనులలర


    రిప్లయితొలగించండి
  19. అర్జునుడు గురునాశీస్సు నవధరించి
    మత్స్యయంత్రమ్ము గొట్టెను; మాద్రి కొడుకు
    లు నకులసహదేవు లరయ వెనుక ముందు
    స్వీయ విద్యల జూపుచు సేమ మందె

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నకుల సహదేవులు... ‘అందిరి’ అని బహువచన క్రియారూపాన్ని వ్రాయాలి కదా.. అందుకని అక్కడ ‘విద్యల జూపిరి సేమ మంద’ అనండి.

    రిప్లయితొలగించండి
  21. శంకరయ్య గారికి నమస్తే మీ సవరణ సబబే.

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి