12, జూన్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1442 (నయవంచకులే కద)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
నయవంచకులే కద మన నాయకు లకటా!
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. రయమున పదవుల కెగబడి
  భయ మన్నదిలేక బ్రతుకు ప్రభువు లనంగా
  చయమున ప్రజలను దోచెడి
  నయ వంచకులే కద మననాయకు లకటా !

  రిప్లయితొలగించండి
 2. నియమంబులు వల్లింతురు
  జయ మెన్నిక సమయమందు సాధించుటకై
  జయమొంది మేలు మరతురు
  నయ వంచకులే కద మననాయకు లకటా !

  రిప్లయితొలగించండి
 3. మయసభ లోతన స్థానము
  నయముగ పొందంగ తగిన నాట్యము లాడన్
  రయమున పార్టీ మారెడి
  నయవంచకులే కద మన నాయకు లకటా!

  రిప్లయితొలగించండి


 4. ఇది, కలి సహజస్తితియే
  కద ! కఠిన సమస్యకాదు కవి పూరింపన్
  పదిలమె "నయ వంచకులే
  కద మననాయకు లకట !"వికారుడె మరుడౌ

  విలక్షణపూరణం చేయబోయి కొంత లక్షణం పోగొట్టినందుకు క్షంతవ్యుణ్ణి

  రిప్లయితొలగించండి
 5. అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘భయ మన్నదిలేక మేమె ప్రభువుల మని సం/ చయమున ప్రజలను దోచెడి’ అంటే బాగుంటుందని నా సలహా.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మీ ప్రయోగం ప్రశంసనీయం. పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. జయములు బొందుట కొరకై
  నయ వాక్యము లన్ని జెప్పి నాయకు లవగాన్
  రయమున మఱతురు నయములు
  నయ వంచకులే గద మన నాయకు లకటా !

  రిప్లయితొలగించండి
 7. జయము కొరకుపలు వరములు
  రయమున నిచ్చుచు తదుపరి, ప్రజలను కనరే!
  భయపెట్టి రైతు దోచే
  నయవంచకులే కద మన నాయకు లకటా!

  రిప్లయితొలగించండి
 8. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. భయమును లజ్జను విడచి అ
  నయము తమపదవి నిలుపుకొనంగన్ నిస్సం
  శయముగ కపటము సలుపెడి
  నయవంచకులే కద మన నాయకు లకటా!

  రిప్లయితొలగించండి
 11. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. జయమే ధ్యేయము, నీతికి
  నియమాలకు పాతరనిడి నేర్పెదరెన్నో
  దయ మరతురు హామిలలో
  నయవంచకులే కద మన నాయకులకటా!

  రిప్లయితొలగించండి
 13. నా పూరణలోని మొదటిపాదములో "సహజస్థితి" అని ఉండాలి. టైపాటును క్షమించాలి.

  రిప్లయితొలగించండి
 14. నయమగు పలుకులతోడ వి
  నయముగ వాగ్దానమిచ్చి నమ్మబలుకుచున్
  జయమొందిన మాట మరచు
  నయ వంచకులే గద మన నాయకు లకటా !

  దయనీయమైన బ్రతుకుల
  మయమగు పేదల బ్రతుకులు మార్చెద మనుచున్
  జయము వరించిన మరతురు
  నయ వంచకులే గద మన నాయకు లకటా !

  రిప్లయితొలగించండి
 15. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘హామీలను’ అంటే బాగుంటుందేమో?
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  ప్రియమగు మాటల మాయ,వి
  జయమును గొని తా జనముల చయ్యన విడు, గో
  మాయువులను పోలెడు ఘన
  నయవంచకులేగద మన నాయకు లకటా!

  నయమగు పలుకుల నోట్లను
  రయమున గొనియును,విడిచియు రచ్చల ప్రజలన్
  భయమును వెట్టుచునుండరె?
  నయవంచకులే గద మన నాయకు లకటా?

  రిప్లయితొలగించండి
 17. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. స్వయముగ "క్విడ్ ప్రో కో" తో
  భయమే లేకుండ దోచె పౌరుల సొత్తం
  తయని యనుచరుల్ వగచిరి
  నయవంచకులే కద మన నాయకు లకటా!

  రిప్లయితొలగించండి
 19. జయజయ ధ్వానపు కపట
  ప్రియమున జనులను వేడుచు ప్రీతిని జూపే
  పుయిలోడుచు మాయలలో
  నయవంచకులే గదమన నాయకులకటా!

  నయమును వీడుచు సాగెడు
  నయవంచకులే గదమన నాయకు; లకటా!
  కయిమోడ్పులు పొందుదురు స
  మయమున జనులకు నొసగిన మాటలు నిలుపన్


  రిప్లయితొలగించండి
 20. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మయిల ధనము దాచినచో
  నయవంచకులే కద. మన నాయకుల కటా
  రియవనిక జీల్చుచును ని
  శ్చయముగ నా ధనముదెచ్చు జనసేవలకై

  రిప్లయితొలగించండి
 21. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘జయధ్వానము’ అన్నప్పుడు య గురువై గణదోషం. ‘జయజయ రవముల’ అనండి.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  ‘కటారి’తో యవనికను చీల్చే మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. guruvugaariki dhanyavaadamulu savarincina padyaanii pariSeelinca praarthana :

  జయమే ధ్యేయము, నీతికి
  నియమాలకు పాతరనిడి నీచంబుగ ని
  ర్దయులై హామీల మఱచు
  నయవంచకులే కద మన నాయకులకటా!

  రిప్లయితొలగించండి
 23. సహదేవుడు గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. ప్రియమగు కోతలు కోయుచు
  నియమము నీతియును లేక నింగిని నేలన్
  రయముగ కలిపెడి వారౌ
  నయవంచకులే కద మన నాయకు లకటా!

  రిప్లయితొలగించండి
 25. నయనమ్ముల నీరొలుకగ
  భయపడుచును భాజపాకు భండనమందున్
  రయమొప్పుచు పరుగులిడెడి
  నయవంచకులే కద మన నాయకు లకటా!

  రిప్లయితొలగించండి