1, అక్టోబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం – 1526 (పదవీవిరమణయె గొప్ప)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పదవీవిరమణయె గొప్ప వర మగును గదా!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. కదులుట మెదులుట కుదరక
    పదములకును బంధమౌను పదవి గలిగినన్
    సదనమె ముదమునొదివినన్
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా!!

    రిప్లయితొలగించండి
  2. పదవిని నుండగ దెలియును
    పదవీ విరమణము , గొప్ప వరమగును గదా
    పదవీ విరమణ జనులకు
    పదికిం బది మార్లు శివుని బ్రార్ధన జేయన్

    రిప్లయితొలగించండి
  3. పదవిని నుండగ జేయము
    సదయుండగు శివుని బూజ సాకారముగన్
    పదవులు దొలగిన జేతుము
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా .

    రిప్లయితొలగించండి
  4. పదవిని కుదరని పనులను
    ముదిమిని సమయమ్ము దొరుక ముచ్చట బడుచున్
    కుదురుగ జేసెడి వారికి
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా !

    రిప్లయితొలగించండి
  5. అదయుడగు బాసు తోడను
    వ్యదలు గల్గును సతతము పదవుల లోనన్
    ముదిమి వయస్సున శాంతికి
    పదవీవిరమణము గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  6. మాస్టారూ, ఇదివరలో ప్రస్తావించిన గుర్తు - విరమణము అన్న శబ్దము నిఘంటువులో కనిపించుట లేదు. విరమణ అన్న పదం కనిపిస్తోంది. కావున పదవీవిరమణ అనటం సమంజసము కదా? తెలియజేయగలరని మనవి.

    రిప్లయితొలగించండి
  7. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీరు రెండు పూరణలలో ఏం చెప్పదలచుకున్నారో అర్థం కావడం లేదు. దయచేసి వివరణ ఇవ్వండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. అంతేకాక ‘వ్యధ’ను వ్యద అన్నారు.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    నిజమే! అలా అనడం అలవాటయిపోయింది. సవరిస్తున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. అధికంబగు బాధ గలుగు
    పదవీ విరమణము, గొప్ప వరమగును గదా
    బుధులకు తగు శాంతి నొసగి
    మదికింపగు కార్యములను మహిలో జేయన్!

    రిప్లయితొలగించండి
  10. పూజ్యులు గురుదెవులు శ౦కరయ్య గారికి వందనములు
    పదుగురు మెచ్చిన నడవడి
    ముదముగ విధ్యుక్త ధర్మమును జేయుచు తా
    కుదురుగ ప్రరభుత్వ మందున
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా

    రిప్లయితొలగించండి
  11. ఎదపై వత్తిడి యుండదు
    ముదమౌ గద శాంతి దొరుక ముదిమిని మనకున్
    వదలిన బాధ్యత బరువులు
    పదవీవిరమణయె గొప్ప వర మగును గదా!

    రిప్లయితొలగించండి
  12. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. సవరించిన పద్యమును మళ్ళీ పంపుచున్నాను.
    అదయుడగు బాసు తోడను
    వ్యధలెన్నొ గలుగు సతతము పదవుల లోనన్
    ముదిమి వయస్సున శాంతికి
    పదవీవిరమణము గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మల్లెలవారి పూరణలు
    సదమలరీతిగ పదవిని
    ముదముగ బాధ్యతలెలమినిపూర్తిగ సలిపా
    ముదిమిని దైవపుచింతన
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా
    2.పదవిని నున్నపుడేగద
    వదలకని౦దలును యశము వచ్చును గాదా
    వడలును బాధ్యత లుడిగిన
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా!!
    3.పదవీవిరమణసేయగ
    ముదముగ సొమ్మదియుకలుగు ముచ్చటసుఖమే
    యోదవెడు దానను ముదిమిని
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా
    4 పదవిని యుండగ నీతిగ
    వదలక దుర్మార్గ గతిని ప్పలువిధనిదులే
    పదపడి పోవిడి వారల
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా


    రిప్లయితొలగించండి
  15. ఉదరంబును పోషించగ
    నదరక బెదరక వగవక నరువది ప్రాయం
    బు దనుక కొలువును జేయగ
    పదవీవిరమణయె గొప్ప వర మగును గదా

    రిప్లయితొలగించండి

  16. కె.ఈశ్వరప్ప గారి పూరణ సరస్వతీ పూజ కు
    చదువులసరస్వతి గుడికి
    పద;వీ.వి.రమణము గొప్ప వరమగును గదా
    యిది మూలా నక్షత్రము
    మదిలో గోర్కెలను దీర్చు మాతయు గనుకన్
    2.చదువును సంసారంమును
    వదలక సాగంగ వచ్చు వార్ధక్యము తో
    అదునుగ ఆస్తిక మందగ
    పదవీవిరమణము గొప్ప వర మగును గదా

    రిప్లయితొలగించండి
  17. ఉదయమ్మే లేచి నడక,
    హృదయమ్మున దైవమొదగ, నిమిడెడు సతితో
    విధిగా సమాజ సేవలఁ
    బదవీ విరమణయె గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  18. మిత్రులకు వందనములు.

    పదవీకాలమున ధనము
    ముదముగఁ గూర్చంగ నదియె ముదిమినిఁ దోడై
    హృదయమునఁ జింతఁ బాపఁగఁ
    బదవీ విరమణయె గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  19. నా ద్వితీయ పూరణము:

    మదయుతుఁడగు నధికారియె
    పదస్థుఁడయి యున్న తఱిని బాధల నిడి యా
    పదవి ముగిపి చనినంతన త
    త్పదవీ విరమణయె గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  20. మదీయ తృతీయ పూరణము:

    మదమునఁ గశిపుఁడు బలరిపుఁ
    బదవీచ్యుతుఁ జేసి గద్దెపై నెక్కఁగ శ్రీ
    హృదయేశుఁడుఁ జంప నతని
    పదవీ విరమణయె గొప్ప వరమగును గదా!

    (హిరణ్యకశిపుఁడు శ్రీహరిచే హతుఁడై యా హరినే పొందుట గొప్పవరమే గదా!)

    రిప్లయితొలగించండి
  21. గురువులు శంకరయ్య గారికి దసరా శుభా కాంక్షలతో .. నా పద్యములకు సవినయముగా
    వివరణ ,
    మొదటి పద్యము నకు :-మనము ఉద్యోగములో చేరిన రోజుననే పదవీ విరమణ ఎప్పుడో తెలియును .
    పదవి నుండి తప్పు కొనిన తరువాత శివుని పూజను ఎక్కు వ సార్లు చేయ వీలగును .

    రెండవ పద్యమునకు :- పదవిలో ఉండగా శివుని పూజ శాస్త్రో క్తముగా సరిగా చేయలేము . పదవి
    నుండి బయటకు వచ్చిన తరువాత మనసారా శివుని పూజ చేయగలము .
    అని నా అభిప్రాయము . మీ స్పందన తెలియ జేయగోర్తాను

    రిప్లయితొలగించండి
  22. శ్రీగురుభ్యోనమ:

    చదివిన చదువుకు ఫలముగ
    పదుగురకున్ సేవజేయు భాగ్యము కలుగున్
    ముదివయసున ముదమొందగ
    పదవీవిరమణయె గొప్ప వర మగును గదా.

    శ్రీ మిస్సన్నగారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.{షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు}

    రిప్లయితొలగించండి
  23. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒత్తిడి పెరిగి పోయిన ఉద్యోగులకు :

    01)
    ____________________________________

    సుధలను గ్రోలగ లేదే
    సదమదమగు జీవితమున - సమయము జూడన్ !
    హృదయము శాంతిని బొందన్
    పదవీవిరమణయె గొప్ప - వర మగును గదా !
    ____________________________________
    సుధ = జీవిత సుధ(సంతోషము)

    రిప్లయితొలగించండి
  24. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    కొన్ని టైపాట్లున్నాయి. ‘సలిపి + ఆ’ అన్నప్పుడు సంధి లేదు. ‘పూర్తిగ సలుపన్/ ముదిమిని...’ అనండి.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు (ముఖ్యంగా వైవిధ్యమైన విరుపుతో మొదటి పూరణ) బాగున్నవి. అభినందనలు.
    కొన్ని టైపాట్లున్నాయి.
    *
    గుండా వేంకట సత్య సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ మూడు పూరణలు (ముఖ్యంగా పురాణకథాప్రస్తావనతో వైవిధ్యంగా ఉన్న మూడవ పూరణ) బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    తొందరపాటుతో మీ పూరణల భావాలను అవగాహన చేసికొనలేకపోయాను. మన్నించండి. మీ వివరణ బాగుంది. ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. పదుగురు మనలను మెచ్చగ
    విధి నిర్వహణమున మెలగి విస్తృత రీతిన్
    ముదముగ సేవల జేసిన
    పదవీ విరమణయె గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  26. గురువుగారికి నమస్కారములు నిన్నటి పద్యం ఇవాళ పెడుతున్నాను
    ఆలస్యానికి మన్నించండి
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు
    పదవిన బాధ్యత లుండును
    పదవిన పై వారినుండి పడు నక్షంతల్,
    పదవిన చెడు మాట బడక
    పద వీ విరమణ యె గొప్ప వర మగును గదా!

    రిప్లయితొలగించండి
  27. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. చదువులిక చంక నాకగ
    పదుగురితో ముచ్చటించి పరుగులు తగ్గన్
    కుదురుగ కూర్చుండ గలుగు
    పదవీవిరమణయె గొప్ప వర మగును గదా!

    రిప్లయితొలగించండి
  29. చదువులిక చంక నాకగ
    పదుగురితో చెట్టు క్రింద పడుకొని కొట్టన్
    ముదమున వెనుకటి గ్యాసులు
    పదవీవిరమణయె గొప్ప వర మగును గదా!

    రిప్లయితొలగించండి