3, అక్టోబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1527 (నరకసంహారము దసరా)

కవిమిత్రులకు బ్లాగు వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నరకసంహారము దసరా నాఁడె జరిగె.

22 కామెంట్‌లు:

  1. విజయ దశమి శుభా కాంక్షలు

    విజయ దశమి నాడు వేకువ ఝామున
    నిదుర లేచి శుచిగ నియమ నిరతి
    బూ జ సేయ నిచ్చు భువనేశ్వరి మాత
    సకల సంప ద లను సంతసమున

    రిప్లయితొలగించండి
  2. రామ రావణ సంగ్రామ రంగమందు
    పోల్చ లేని భీకరమైన పోరున, రఘు
    వరుని బాణము వెడలి రావణు శిరమును
    నరక, సంహారము దసరా నాఁడె జరిగె!!

    రిప్లయితొలగించండి
  3. ఆశ్వ యుజమున జరిగెగ దార్య !భువిని
    నరక సంహార ము,దసరా నాడె జరిగె
    రాజ రాజేశ్వ రీ మాత రంజి లంగ
    కుంకు మార్చన మాయూర గోటి మార్లు .

    రిప్లయితొలగించండి
  4. ఇలను మహిషాసురుని పాప మెక్కువయ్యె
    దేవలోకమ్మునఱుమగా దేవి దుర్గ
    సింహ వాహనాసీనయై జేరి శిరము
    నరక, సంహారము దసరా నాఁడె జరిగె

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    విజయ దశమి :

    01)
    _____________________________

    నరక సంహారము,దసరా - నాడె జరిగె
    ననుట తప్పది నిజముగా - నరసి జూడ
    నాశ్వయుజ చతుర్దశి కృష్ణ - నాడు జరిగె !
    మహిష సంహారమె దసరా - మహిని జూడ !
    _____________________________

    రిప్లయితొలగించండి
  6. ప్రజల మేలుకు ఏమది భామజేసే?
    అమ్మ పూజకు నవరాత్రి యంతమేది?
    రావణాంతము ఏనాడు రహిన జరిగె ?
    నరక సంహారము , దసరా ,నాడె జరిగె.
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    గురువుగారికి,కవిమిత్రులకు,బ్లాగువీక్షకులకు అందరకు విజయదశమి పర్వణ
    శుభాకాంక్షలు.

    విజయీభవ మన భాషకు,
    విజయీభవ తెలుగుకవికి విశ్వమునందున్,
    విజయీభవ విద్యార్థికి,
    విజయీభవ భరతజాతి వీరులకెల్లన్.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యగురుదేవులకు, కవి మిత్రులకు, శ్రేయోభిలాషులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు
    సత్య భామయె గావించె సంగరమున
    నరక సంహారము, దసరా నాడె జరిగె
    మహిష సంహార మొనర్చె మాత దుర్గ
    సన్నతించెద భక్తితో శంభు ప్రియను!

    రిప్లయితొలగించండి
  9. అధిక ధరలిటు పెరుగుట నడ్డగించి
    నరక, సంహారము దసరా నాడె జరిగె
    పేద ప్రజలకు బాధలు వెతలు దీరు
    ధరల రక్కసి కోరలన్ విరిచి వేయ

    రిప్లయితొలగించండి
  10. మాత శాంభవి కోపాగ్ని చేత దైత్యు
    నరక, సంహారము దసరానాడు జరిగె
    కుసుమ వర్షము నమరులుఁ గురియ జేయ
    మూడు లొకాల ప్రజలకు ముదము గల్గె

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి, కవి మిత్రులకు విజయ దశమీ శుభాకాంక్షలు.


    మహిషు కేశముల్ చేబట్టి మాత యపుడు
    ఖడ్గమును తీసి యొక వేటు గట్టిగాను
    మస్తకము పైన వేసెను మహిషు నట్లు
    నరకసంహారము దసరా నాఁడె జరిగె.

    రిప్లయితొలగించండి
  12. మహిషు చేతను నమరులు మానవాళి
    నరకయాతన పడుచుండి యమ్మవేడ
    దుర్గ యిరువదిచేతుల దుర్గమ యయి
    నరక, సంహారము దసరా నాడుజరిగె!

    సీత మిషతోడ రాముడు చేసి,యుద్ధ
    మసుర సంహార ,మా లంక మానితముగ
    దుష్ట రావణు తలలట్లు తూలగాను
    నరక, సంహారము దసరానాడు జరిగె!

    కౌరవాళియె దుష్టులై కష్టపెట్ట
    పాండవాళికి రక్షయై పార్ధుచేత
    యుద్ధ మాకృష్ణు డొనరించి యోధుల నల
    నరక, సంహారము దసరానాడు జరిగె!

    తిమిర మెంతయు గప్పెడి దేశమందు
    వాణియై తాను విజ్ఞాన భాగ్య మిచ్చి
    యంధకారంబు పోద్రోలి యజ్ఞ తపుడు
    నరక, సంహారము దసరా నాడుజరిగె!

    అంబ భూమాత భూభారమధిక మవగ
    నరకుడా విధి మౌనుల నాతుల నిల
    బాధపెట్టంగ సత్యయై పరుగు తీయ
    నరక సంహారము దసరానాడు జరిగె!

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురుదేవులు శ౦కరయ్యగారికి వందనములు
    1.వరములను బొంది రావణాసురుడు భువిని
    మునుల సురలను వేధించి ముదిత సీత
    జెరను బెట్ట రాము డతని శిరము లన్ని
    నరక,సంహారము దసరా నాడు జరిగె
    2.లోకభీకరులగు దైత్య లోకమంత
    శాంతి భగ్నము జేయుచు సంచరింప
    మహిష చండ ముండాదుల మస్తకములు
    నరక, సంహారము దసరా నాఁడె జరిగె!!

    రిప్లయితొలగించండి
  14. మహిషు నాగడమ్ములు మీఱ మాన్య ధనులు
    విన్న వించగన్ దుర్గకు వేడు కొనుచు
    నోర్మి జూపక గూల్చగ నుల్లమున ద
    నరక, సంహారము దసరా నాఁడె జరిగె

    రిప్లయితొలగించండి
  15. మునిజనవ్రాతమున్ గొనకొని కష్టాల
    ..........కడలిలోముంచెడు కఱకువాడు
    యజ్ఞవాటికలదివ్యప్రభావామృతం
    ..........బెల్లవిషముగాగ నెంచువాడు
    తాపసులకునెల్ల దానవఖడ్గధా
    ........రను జూపి శిరములన్ దునుమువాడు
    తన్నువీడుచునన్య ధర్మంబు సైప నొ
    ..........ప్పనిమహాదుష్టలంపటము వాడు

    సకలసజ్జనగణముల సంహరించి
    ధర్మకార్యానువర్తనాధారులైన
    దేవమానవులను ద్రుంచు రావణాఖ్య
    నరక సంహారముదశరా నాడు జరిగె.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు,కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  17. కె.ఈశ్వరప్ప గారి పూరణలు
    1.రక్త బీజుని మహిషుని రాక్షసత్వ
    మెక్కువవగను లోకాల జక్కపరచ
    కాళికాంబిక వారిని కదనమందు
    నరక, సంహారము దసరా నాఁడె జరిగె
    2.సత్యఆశ్వయుజ మాసాన సమరమందు
    నరక సంహారము,దసరా నాడు జరిగె
    రావణాసుర మహిషుల జీవ ముడుగ
    సంతసమ్మున పండగ సాగి పోయె

    రిప్లయితొలగించండి
  18. శ్రీగురుభ్యోనమ:

    సత్యభామయె గావించె సమరమందు
    నరకసంహారము, దసరా నాడె
    ముగ్గురమ్మల శక్తికి మూలమైన
    కాళికాంబ నుపాశింప గలిగె బలము.

    రిప్లయితొలగించండి
  19. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
    దుర్గ శూలాయుధమ్మున త్రుంచి వైచె
    మహిషుడు చరి౦చుండ సన్మార్గమున త
    నరక,సంహారము దసరానాడు జరిగె
    సంబర మొనగూడు ప్రతి వత్సరమున

    రిప్లయితొలగించండి
  20. విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    రోజంతా బంధువులతో పండుగ సంబరాల్లో మునిగి ఉండి పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలను రచించిన కవిమిత్రులు.....
    జిగురు సత్యనారాయణ గారికి,
    సుబ్బారావు గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    వసంత కిశోర్ గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    మిస్సన్న గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    బహుకాలానికి పలుకరించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి