9, అక్టోబర్ 2014, గురువారం

సమస్యా పూరణం – 1530 (గడ్డములఁ బెంచి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల.
(ఈ సమస్యను సూచించిన ‘పరాక్రి’ గారికి ధన్యవాదాలు)

26 కామెంట్‌లు:

  1. మురియు చుండిరి భర్తలు ముదము తోడ
    గడ్డ ములబెంచి, మురిసిరి కాంత లెల్ల
    భర్త లయవతా ర ముల కు బాగుబాగు
    ననుచు ,వారల సంస్కార మదియ సుమ్ము

    రిప్లయితొలగించండి
  2. పాప కార్యంబు జెయక బ్రతుకు సాగ
    పతుల నదుపులోపెట్టగా పథకములను
    వనిత సభలందు చర్చించి వర్తిల వర-
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల.

    వరగడ్డము=ఒక ప్రక్క ఎత్తు-ఇంకొక ప్రక్క తగ్గుగా ఉండు త్రోవ.

    రిప్లయితొలగించండి
  3. తమక సాధ్యంబు లేదంచు ధరణిలోన
    వాలు జడలూనుచు ప్రయోగ శాలలోన
    చేరి యందుప్రయోగముల్ చేసి యపుడు
    గడ్డములబెంచి మురిసిరి కాంతలెల్ల.


    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి

  4. గడ్డము పెంచి మోడీ డమరుకము వాయించి పేరు పొందే
    తమ 'సిరివార'ల పేరు బజాయింప
    సిరుమంతనములు ఆడి,పెనిమిటి
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల !!


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. కడుపు పండెను చూడ నాకాంతలకును
    సంతసంబును గూర్పుచు నింతులకును
    వారి భర్తలు తిరిగి రాచారమనుచు
    గడ్డములఁ బెంచి - మురిసిరి కాంత లెల్ల.

    రిప్లయితొలగించండి
  6. సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బాగు + అనుచు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. నుగాగమం రాదు. అక్కడ ‘బాగ/టంచు...’ అనండి.
    *
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    ‘గడ్డము’ను ‘వరగడ్డము’గా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    బహుకాల దర్శనం! సంతోషం!
    మీ ప్రయోగశాలా పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పేరు బొందిన మనుజుల తీరుజూసి
    రాతమారు నని దలచి లక్షణమగు
    తైలములు బూసి సొగసుగ తనదు పతుల
    గడ్డము లబెంచి మురిసిరి కాంత లెల్ల!

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తీరుజూచి’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. పూల మొక్కల పశువులు బొక్కు చుండ
    ముండ్ల మొక్కల నడ్డుగా మొలవ జేయ
    గావ గలమని కాపులుగ నిలువ గలు
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల.

    రిప్లయితొలగించండి
  10. మల్లెలవారిపూరణలు
    1.శబరిమల కేగు దీక్షని సలుపు చుండ
    నల్లవస్త్రాల దాల్చెడి నయము నొప్పె
    గడ్డముల బె౦చి మురిసిరి. కాంతలెల్ల
    మగల సాగంగ న౦పిరి మహితరీతి
    2.కాంత లందరు గోర్కెతో కలసి యొకట
    నాటకము లాడు సంఘమ్మునైరి యపుడు
    మునుల వేషాలు సొగసుగ మోము నతికి
    గడ్డముల బె౦చి మురిసిరి కాంతలెల్ల
    3. చలన చిత్రాన నొక యెడ సాదు వేష
    మమర నుండిరి కొందరు మానినులును
    గడ్డముల బె౦చి మురిసిరి కాంతలెల్ల
    వారి వేషాలు సొగసుగ వరలుచుండ
    4.వేషమేసిరి దసరాన వివిధములుగ
    నందు మునులుగా నింతులు యమరి యుండ
    గడ్డముల బె౦చి మురిసిరి కాంతలెల్ల
    వేషమేసిన ముగుదల విధము గనియు
    5.భార్యలే గర్భమందంగ భర్త లెపుడు
    గడ్డముల బె౦చి మురిసిరి. కాంతలెల్ల
    గాజు లిత్తురు గర్భిణీ కాంతలకును
    నిదియె సీమ౦త సంబర మింపు నగును

    రిప్లయితొలగించండి
  11. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    పడతులందరు కలిసి మా పల్లె లోన
    నాటకమ్మును వేసిరార్భాట మెసగ
    అందరును మునులే నొక్క యంకమందు
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల

    రిప్లయితొలగించండి
  12. మాదు కేశము లూడక నాదు కొన్న
    మగని తలనీలములనిడ మగువ లెల్ల
    తిరుమలేశుని మ్రొక్కుచుఁ దీర్చి పతుల
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల!

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    గడ్డమందున శక్తులు గలవటంచు
    తెలిపె పాతాళ భైరవి చలనచిత్ర
    మంత భార్యలు,భర్తల యాస్యమందు
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల
    2.భీమ బలుడైన గడ్డమ్ము లేమి కతన
    గడ్డ మున్నట్టి వాని జగడమున౦దు
    మార్కొన జాల నైతినన్ మగని కపుడు
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల.
    3.మగసిరికి గుర్తులైన యా సొగసు లివియె పురుషునకు మీసగడ్డముల్ నరయ ననుచు
    భర్తలకు నచ్చజెప్పి వైభవము యొప్ప
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల

    రిప్లయితొలగించండి
  14. స్వామి అయ్యప్ప కడకేగు భక్తులంత
    గడ్డముల బెంచి మురిసిరి, కాంత లెల్ల
    తమ పతుల్ ధూమ పానమును మరియు సుర
    గ్రోలుటను వీడ కరమగు మేలుగనిరి

    రిప్లయితొలగించండి
  15. సార్ నేను మీకు ఒక ఈమెయిలు పంపాను. దయచేసి సమాధానం పంప మనవి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    చిత్రపటమున చూపిన చిత్రములకు
    రంగు లద్దుచు హాస్యము లాడనెంచి
    పొడుగు గీతలు గీయుచు పురుషులకును
    గడ్డములఁ బెంచి, మురిసిరి కాంత లెల్ల.

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులకు నమస్కారములు!

    (ఒక యింటి కోడండ్రు తమ యింట జరుగు తతంగమునుం బరులు కనకుండుటకుం జేసిన యుపాయము)

    ఇంటి ముంగిలి హద్దుగా నెనుఁగు లేక
    బయటివారలు తమయింటఁ బరఁగు కతలఁ
    గనుచు నుండంగఁ, గనకుండు కారణమ్మ
    గడ్డములఁ బెంచి, మురిసిరి కాంత లెల్ల!

    {(కనకుండు కారణమ్ము + అగు) + అడ్డములన్ + పెంచి మురిసిరి = అడ్డముగనుంటకై మొక్కలం బెంచి, చాటగుటచే మురిసిపోయిరని భావము}

    రిప్లయితొలగించండి
  18. మిత్రులారా,
    నా పూరణమున..."కారణమ్ము+అగు+అడ్డములన్+పెంచి"...యనుచో..."...అగు నడ్డముల" యనియే యనవలసియున్నను...నిది సమస్యాపూరణము కావున చమత్కారమునకై యట్లు..."కారణమ్మగడ్డములన్"...అని పూరణముం జేసితిని. అసాధువైనను నిరంకుశముగఁ బ్రయోగింపవలసివచ్చినది. మన్నింపఁగలరు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....

    అందరికీ అభివందనములు !
    ===============*==================
    కంటి నీ దినమున కల యొకటి,కవులు
    పద్య రాశులెల్ల పండ్లు జేసి
    ముదమలర గను గడ్డ ములబెంచి మురిసిరి,
    కాంత లెల్ల జూచి కరగి పోయె!

    రిప్లయితొలగించండి
  20. గురువుగారు,
    సమస్యను పూరించుటకు బహు కష్టము నొంది, కలత జెంది వృత్తము మార్చి పిచ్చి ప్రయత్నము జేసితిని మన్నించ గలరు.

    రిప్లయితొలగించండి
  21. మిస్సన్న గారూ,
    గడ్డాన్ని అడ్డంగా మార్చిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవపూరణ మూడవ పాదంలో గణదోషం. ‘మార్కొనగ జాల...’ అంటే సరి!
    మూడవ పూరణలో ‘వైభవము + ఒప్ప’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘వైభవము తనర’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గొట్టిముక్కల వారూ,
    మీ మెయిల్‍కు సమాధానం పంపాను. బ్లాగును వీక్షించినందుకు ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీరూ మిస్సన్న గారిలాగా అడ్డం ఏర్పాటు చేశారు. కాకుంటే కారణాలు వేరు. చక్కని పూరణ అభినందనలు.
    ‘నిరంకుశాః కవయః’ అంటూ వివరణ ఇచ్చాక ఏమంటాను? సరే నంటాను. ☺

    రిప్లయితొలగించండి
  22. కె ఈశ్వరప్ప గారి పూరణ
    నేటి కాలపు యువకులు నేర్పుమీర
    గడ్డముల బెంచి మురిసిరి.కాంతలెల్ల
    వగల జూపక సంసార బాధ్యతలను
    తగినరీతిని వహియింత్రు మగని తోడ

    రిప్లయితొలగించండి
  23. కలను జంబలకడి పంబగంటి నేను
    కాలమహిమను మగవారు గరిటె బట్టె
    పేక నాడుచు త్రాగుచు బీరు, దమ్ము
    గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల
    ( జంబలకడి పంబ సినిమాలో ఆడవారు మగవారుగా మగవారు ఆడవారుగా మారుతారు )

    రిప్లయితొలగించండి
  24. కందుల వరప్రసాద్ గారూ,
    చాలాకాలం తర్వాత మీ పద్యాన్ని చూసే అవకాశం కల్పించారు. సంతోషం.
    ఆటవెలదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘ముద మలరగను’ అంటే గణదోషం. ‘ముద మలరగ’ అంటే సరి. టైపాటు కావచ్చు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ‘జంబలకిడిపంబ’తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    స్త్రీవాదము(feminism) :

    01)
    ________________________________

    ఆడువారికి గడ్డము - లడరు దెంచ
    శక్తిగల మందు గనిపెట్ట - శాస్త్రవిదుడు;
    మేము మగవారి కన్నను - మిన్న యనుచు
    గడ్డములఁ బెంచి మురిసిరి - కాంత లెల్ల !
    ________________________________

    రిప్లయితొలగించండి
  26. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి