1, నవంబర్ 2014, శనివారం

పద్యరచన - 722 (అన్యమత దూషణము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
అన్యమత దూషణము

7 కామెంట్‌లు:

  1. అన్యమతంబుల దూషణ
    యన్యాయంబౌనధర్మమౌను ఫలంబున్
    శూన్యము, గౌరవ మిడినన్
    ధన్యాత్ము లవుదురు పర మతంబులనెల్లన్

    రిప్లయితొలగించండి
  2. అన్య మతమును దూ షించ నవస రమ్ము
    నేమి వచ్చెను ? నీకిపు డేమి ఫలము ?
    పాప మయ్యది ,యెఱు గుము బాల !నీవు
    నన్ని మతముల సారము నౌను నొకటె

    రిప్లయితొలగించండి
  3. అన్యమత దూషణము చేయుహాని కచ్చితముగ
    పరమత సహనమ్ము గలిగి పరగు జాతి
    విశ్వ విఖ్యాతి గాంచును పేర్మి కూర్మి
    దేశ మాతకు మిక్కిలి తేజ మొదవు

    రిప్లయితొలగించండి
  4. దైవమ్మొకటే యనియెడు
    భావమ్మును మదిని లేక బ్రతుకుట కొరకై
    కేవల ధనార్జనార్థము
    తూ వరకులె మతము మార్చ దూషింతు రయా!
    (తూవరకుఁడు = నపుంసకుఁడు)

    రిప్లయితొలగించండి



  5. శంక రార్యుడ !మీకుగా శంకరుండు
    రుగ్మతను దరిమి యిక యా రోగ్యవంతు
    జేయు గావుత !మిమ్ముల , యీ య దనున
    వేడు కొం దును నేనును విశ్వవిభుని

    రిప్లయితొలగించండి
  6. మోసము చేయుచు మతమది
    మా సమమగునే యనియెడు మాటల తోడన్
    దోసములారోపించుట
    కే సరి కొందరి పలుకులు, కృత్యములకటా!

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి