26, అక్టోబర్ 2014, ఆదివారం

నిషిద్ధాక్షరి - 16

కవిమిత్రులారా,
రామపట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి వ్రాయండి.
మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘మ’ నిషిద్ధం.
రెండవపాదాన్ని ‘భ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘ర’ నిషిద్ధం.
మూడవపాదాన్ని ‘ల’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం.
నాలుగవపాదాన్ని ‘శ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం.
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చు.

36 కామెంట్‌లు:

 1. రాజ పుంగవు డగునట్టి రామ విభుడు
  భయము లేకుండ బ్రజలకు బాస నిచ్చి
  లహరి పట్టాభి షేకంబు లక్ష ణ ముగ
  శక్రు డాదిగ సాక్షిగ జరుపు కొనియె

  రిప్లయితొలగించండి
 2. రాచ బిడ్డ దాశరధికి రాఘవునకు
  భక్తి భావంబు జూపగ భాతృచయము
  లలన సీత వామాంకయై నిలిచి యుండ
  శరధి జలము జల్లగనయ్యె చక్రవర్తి!!

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  శ్రీరామ పట్టాభిషేకము :

  01)
  ______________________________

  రాజ్య పట్టాభిషేకమ్ము - రాము డొందె
  భక్తి భరతుడు ఛత్రంబు - పట్టి నిలువ
  లలిత లక్ష్మణు డత్యంత - లలిని గొలువ
  శక్తి శత్రుఘ్ను డదె వీవ - చామరమును

  సీకర జనిత సీతమ్మ - చెంత నుండ
  హజ్జ బట్టగ హనుమంతు - డాదరమున
  మంగళంబైన వాద్యముల్ - మ్రోగు చుండ
  మంత్రముల నెల్ల పఠియింప - మౌను లంత

  యక్ష , సిద్ధాది గణ, మంత - రిక్ష ముండ
  పుష్పవృష్టిని గురిపింప - బూజిలు లదె
  పలుకుచుండంగ జయమని - పౌరులెల్ల
  గాంచుచుండంగ భూత సం - ఘంబు లెల్ల !
  ______________________________
  లలితము = మనోహరము
  లలి = ప్రేమ
  సీకరము = నాగలి
  హజ్జ = పాదము
  యక్ష,సిద్ధాది = యక్ష,గరుడ, గంధర్వ ,కిన్నెర, కింపురుష, సిద్ధ, చారణాదులు
  అంతరిక్షము = ఆకాశము
  పూజిలులు = దేవతలు

  రిప్లయితొలగించండి
 4. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  రాజ సింహాసనము నెక్కెరాఘవుండు
  భద్రముగసీతతోగూడి వాసిగ శుభ
  లగ్నమున యెల్లి భరతుడు, లక్ష్మణు౦డు
  శస్త్రధారి, శత్రుఘ్నుడు చామరమిడ

  రిప్లయితొలగించండి
 5. రాగలవటంచు శుభములు, రంజిలె మది
  భవము దాటించువాడిక పట్టధారి
  లయము గాకేమి పాపము లంకపతినె
  శక్తి యుక్తులఁ గెల్చు ధీశాలి కడన.

  రిప్లయితొలగించండి
 6. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘లహరి’ అంటే కెరటం. అది ఇక్కడ అన్వయించడం లేదు. అక్కడ ‘లలిని’ అంటే సరి!
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ సుదీర్ఘపూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. రావణ వధ జేసి సీతతో రాగ పురికి
  భక్తి మీరగ గట్టెగా పట్టమును క
  లసియు భరతుడు శతృఘ్న లక్ష్మణుండు
  శరణమనగ మారుతి రామచంద్రునకును.

  రిప్లయితొలగించండి
 8. రాజరాజాధిపులు మహా తేజధనుల
  భవ్యతపములఁబ్రభవించు పరమఋషుల
  లలితసుమనస్కులైన భారవిగణముల
  శక్తులలరగ పట్టాభిషిక్తుఁడయ్యెఁ

  రిప్లయితొలగించండి
 9. రావణునిఁ జంపి రాముడు, లంక నుండి
  భవ్య సతితోన యోధ్యకున్ వచ్చి, మంచి
  లగ్నమున నభి షిక్తుడై రాజ్యమునకు
  శమముతో పాలనఁజరిపె సంతసముగ

  రిప్లయితొలగించండి
 10. రాజ్య పట్టాభిషేకంబు రాముడొందె
  భక్తి నిలువంగ నొకప్రక్క భరతుడంత
  లలిత భావమున సేవింప లక్ష్మణుండు
  శక్తి శతృఘ్నుడే గొల్వ సఖ్యముగను

  రిప్లయితొలగించండి
 11. రావణుని (జంప (నవతార రాము డనగ
  భద్ర గిరిపైన వెలిసెను భద్ర మూర్తి
  లగ్న మేటేట వైభవ లక్ష్య ణముల
  శమము గూర్చును జనులకు క్రమము గాను
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 12. రాజ్యమున కభిషిక్తుడై రామ విభుడు
  బంధు మిత్రులును, ప్ర్జజలు ప్రస్తుతించ
  లంచములు లేని రాజ్యమున్ రమ్యముగను
  శకము లెన్నియొ పాలించె చక్కగాను

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱకు నమస్కారములు!

  రాజసింహాసనమున శ్రీరామునపుడు
  భక్త భరతుండు పట్టాభిషిక్తుఁ జేసి,
  లలిత మర్యాదు లక్ష్మణు నలరఁ జేసి,
  శస్త్రి శత్రుఘ్ను నానంద సదనుఁ జేసె!

  రిప్లయితొలగించండి
 14. రావణు వధించు యటుపైన రాజునయెను
  భవ్య గుణ యుత సీతతో పట్టమందె
  లగ్నమే శుభ యుతముగా లలిత ఘుణుడు
  శమముఁ గూర్పడె లోకాన శాశ్వతముగ

  రాజితుండయి సీతతో రాముడవని
  భవుడు నౌచును కోసల పట్టమందె
  లలిత సుగుణాల సోదరులమరగాను
  శక్తి యుతులౌచు నిలుచుండ సంబరముగ

  రాఘవుండును సీతయు రమ్యగుణులు
  భవము కోసల గద్దెపై భాసిలిరిగ
  లలిత సేవల హనుమయ్య రహిని గనగ
  శక్తియుతుడౌచు రామయ్య సంఘమలర

  రాజితారణ్య వాసంబు రమణి తోడ
  భయము లందుచు గడిపియు భవ్యమౌ, సు
  లగ్న మందున రాజయ్యె లక్షణముగ
  శబరి మాతగ నెంచిన శాంతమూర్తి

  రాజ లక్షణ సీతయు రాజ్ఞిఁ గాగ
  భజన సేయుచు భరతుండు, పాదుకలను
  లలిత మౌరీతి నిడియు పాలనము నందు
  శక్త రాజ్యాని కయ్యెను చక్రవర్తి

  రిప్లయితొలగించండి
 15. కె.ఈశ్వరప్పగారి పూరణలు
  రాజ్యపట్టాభిషేకమ్మురామునికన
  భక్తి భావానజనులకాసక్తి పెరుగ
  లలితసుకుమారి సీతయే కలికిజేర
  శక్రశాలతో శోభిల్లె సంతసాన
  2.రాజ్య యోగనందున రాముడుండ
  భవుడు యాశీస్సు లందించు భాగ్యమందు
  లబ్ధనాముడు రాముడు లౌకికాన
  శక్తి యభిషిక్తునిగా మార్చ రక్తి గాదె

  రిప్లయితొలగించండి
 16. రాజ్య లక్ష్మిని వరియింప రాముడరుగ
  భక్తితోడుత భరతుడు వందన మిడె
  లలిత లావణ్య లక్ష్మణు రాము మ్రొక్కె
  శమము గోరెను శతృఘ్ను సమ్మతమున!

  రిప్లయితొలగించండి

 17. రాజ్య పట్టాభిషేకము రాఘవునకు
  బమ్మ శక్రాది దేవతల్ ప్రాలు జల్ల
  లక్ష్మి, భరత, శత్రుఘ్నలు రక్తి పొంద
  శక్తి పితృదేవు పనుపున జరిగె నచట
  శక్తిః వశిష్టుని పుత్ర్రుడు

  రిప్లయితొలగించండి
 18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘రావణ వధ జేసి’ అన్నచోట గణదోషం. ‘రావణుం జంపి...’ అంటే సరి.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘భావమున’ అంటే గణదోషం. ‘భావాన’ అనండి.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘చంప నవతార’ మధ్య అరసున్నా ఎందుకు?
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  బొడ్దు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. అవునండీ..పొరబాటు బడితిని..చక్కని సవరణకు ధన్యవాదములు.
  మీరు చూపిన సవరణతో...

  రావణుంజంపి సీతతో రాగ పురికి
  భక్తి మీరగ గట్టెగా పట్టమును క
  లసియు భరతుడు శతృఘ్న లక్ష్మణుండు
  శరణమనగ మారుతి రామచంద్రునకును.

  రిప్లయితొలగించండి
 20. రావణుడు జచ్చె ప్రజలెల్ల రామచంద్రు
  భవ్య పట్టాభిషేక సంబ్రమములోన
  లలన జానకితో రామ లక్ష్మణులను
  శక్తి మంతుల గని ప్రతోషమ్ము బడిరి.

  రిప్లయితొలగించండి
 21. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. రాఘవుడయోధ్య సామ్రాజ్య రాజ మకుట
  భవ్య రత్నదీధితి దీప్త పాదుడై య
  లరుచు పట్టాభిషిక్తుడై లలన గూడి
  శక్ర విభవమ్ము తలదన్ను సరణినేలె

  రిప్లయితొలగించండి
 23. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
  రాజిల నిరుగడ మసీజ లక్ష్మణులను
  భర్త,పావని నిజపాదపద్మమంత
  లభ్యమయె పట్టభద్రత రామునకు ప్ర
  శస్తముగ దివౌకసులు ప్రశంస చేయ

  రిప్లయితొలగించండి
 24. రాజ్య పట్టాభిషిక్తుడౌ రామునకును
  భక్తి మీరగ మారుతి పరిచరించ
  లక్షణంబుగ శత్రఘ్న లక్ష్మణుండు
  శక్తిశాలురు జనులంత జయములిడగ
  రమణి సీతమ్మతల్లితో రహిని గాంచె!!!

  రిప్లయితొలగించండి
 25. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని స్వకిరీటకాంతులతో ప్రకాశించే పాదాలు కలవాడు అనడం యుక్తంగా తోచడం లేదు. అన్యరాజుల కిరీట కాంతులతో అనడం సబబుగా ఉంటుంది. లేదా ‘దీప్త వదనుడై’ అంటే బాగుంటుందేమో?
  *
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని అన్వయలోపం ఉన్నట్టుంది. ‘మసీజ’...?
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. ధన్యవాదములు మాష్టారు .... సవరించిన పద్యము
  రాఘవుడయోధ్యపురి సర్వరాజ మకుట
  భవ్య రత్నదీధితి దీప్త పాదుడై య
  లరుచు పట్టాభిషిక్తుడై లలన గూడి
  శక్ర విభవమ్ము తలదన్ను సరణినేలె

  రిప్లయితొలగించండి
 27. మాష్టారు ! జడశతకావిష్కరణకు మీరు వచ్చుచున్నారా ! మీ దర్శన భాగ్యం కలుగుతుందా

  రిప్లయితొలగించండి
 28. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  రావాలనే అనుకుంటాను. అందుకే జ్యోతి గారిని సన్‍షైన్ హాస్పిటల్ ఎక్కడ అని అడిగి తెలుసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 29. జడశతకావిష్కరణ?
  దయచేసి వివరాలు తెలుపగలరా?

  రిప్లయితొలగించండి
 30. శ్యామలీయం గారూ,
  రేపు (29-10-2014) సాయంత్రం 5-30 గం.లకు సికింద్రాబాద్ పారడైజ్ సమీపంలోని డా. గురువారెడ్డి గారి సన్‍షైన్ హాస్పిటల్, శాంతా ఆడిటోరియంలో ‘జడ శతకం’ ఆవిష్కరణోత్సవం ఉంది. అందరూ ఆహ్వానితులే. ఇప్పుడే ఆ ఆహ్వాన పత్రికను బ్లాగులో పోస్ట్ చేశాను.

  రిప్లయితొలగించండి
 31. శంకరయ్యగారూ,

  ఇప్పుడే ఈ మూకుమ్మడి ఆహ్వనపత్రికను చూసాను. చాలా సంతోషం.

  ముఫై ఐదుగురు కవులు సంయుక్తంగా ఒక విషయం మీద నూఱుపద్యాలు వ్రాసి శతకసంపూర్తి కావించటం అనేది అనిదంపూర్వం కాబట్టి అవశ్యం అది "తెలుగుసాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగమే"

  ఏదో ఒక రోజున నూఱుగురు కవిశేఖరుల మహోన్నతప్రయోగప్రక్రియాఫలంగా మరొక శతకం కూడా వెలువడుతుందని భావిస్తున్నాను.

  గణితశాస్త్రంలో ఒక పధ్ధతి ఉన్నది. కనిష్ఠ, గరిష్ఠపరిమితులను సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్వచించటం అనేది ఒక తప్పనిసరి కార్యక్రమంగా. అ దిశలో ఆలోచిస్తే ఒక శతకాన్ని వ్రాయటానికి కావలసిన కవులసంఖ్య కనిష్ఠం ఒకటి అన్నిపద్యాలనూ ఒకరే వ్రాస్తే, గరిష్ఠం నాలుగువందలు ఒక్కోక్క పద్యపాదాన్ని ఒక కవి చొపున నూఱుపద్యాలకూ కలిపి నాలుగువందలు.

  నా హర్షాగ్రహాలతో ఈ ప్రపంచానికి ఏమీ పని లేదు కాబట్టి ఇంతకు మించి వ్యాఖ్యానించ దలచుకోలేదు. ఇప్పటికే అధికప్రసంగం అయ్యిందనుకుంటే క్షంతవ్యుడను.

  రిప్లయితొలగించండి
 32. రావణాసుర సంహార రభస ముగియ
  భక్త భరతుడు పాదుకల్ ప్రక్కఁ బెట్టి
  లచ్చి సీతమ్మ శత్రుఘ్న లక్ష్మణులట
  శమము నొందగ పట్టమ్ము ప్రమద మొసఁగె

  రిప్లయితొలగించండి