18, అక్టోబర్ 2014, శనివారం

దత్తపది - 49 (కోపము-చాపము-తాపము-పాపము)

కవిమిత్రులారా!
కోపము - చాపము - తాపము - పాపము
పైపదాలను ఉపయోగిస్తూ ఉతరుని ప్రగల్భములను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

29 కామెంట్‌లు:

  1. ఉత్తరుడు అంతః పుర స్త్రీలతో
    కోపముతో నే వేసిన
    చాపములే తగిలె నేని శత్రుదళములా
    తాపము తాళగ జాలరు
    పాపమనుచు జాలిజూపి వదలను సుమ్మా !

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    కోపము గల్గజేసిరిటు గోవులనెల్ల హరించి వైచుచున్
    చాపము నెక్కుపెట్టెదను జంపెద కౌరవయోధులెల్లెరిన్
    తాపము దీరునట్టులుగ ధర్మము గెల్వగ నేనొకండనే
    పాపము జేయువారలకు బాధలు గూర్చెద నంచు పల్కెదాన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఉత్తరకుమార ప్రఙ్ఞలు :

    01)
    ______________________________________

    కోపము తాళలే నికను - కుఱ్ఱుల రక్షణ సేయ బోయెదన్ !
    చాపము కత్తి డాలుయును - సారథి నైపుణి యున్న, వైరులన్
    తాపము నొందజేతును వి - దారము నందున, కౌరవాధముల్
    పాపము రక్ష సేయుమని - ప్రార్థన జేసిన వీడ నెయ్యెడన్ !
    ______________________________________
    కుఱ్ఱి = ఆవు
    తాపము = బాధ
    విదారము = యుద్ధము

    రిప్లయితొలగించండి
  4. కోపము నాకు రాదు మరి కోటకు రక్షగనుంటిగాని! నే
    చాపముబట్టి పోరిన దిశాధిపతుల్ నిలువంగలేరు! సం
    తాపము జెందు! కౌరవులఁ దాకిన నూరక చచ్చునంచు నే
    పాపము లోదలంచి రణ పాఠవమంతయు చూపబోనటన్!!

    రిప్లయితొలగించండి
  5. కోపము గల్గెనేని రిపుకోటిని దుర్దశపాలుజేయునీ
    చాపము దీసి సర్వబలసైన్యసమేతుఁడు కౌరవేంద్రుకున్
    తాపముఁగల్గజేసి సతతంబు జయప్రతిభా ప్రభాసుఁడై
    పాపము జేయువారలకవాంతరమై నిలుతున్ బృహన్నలా!

    రిప్లయితొలగించండి
  6. కోపము గల్గెనేని రిపుకోటిని దుర్దశపాలుజేయునీ
    చాపము దీసి సర్వబలసైన్యసమేతుఁడు కౌరవేంద్రుకున్
    తాపముఁగల్గజేసి సతతంబు జయప్రతిభా ప్రభాసుఁడై
    పాపము జేయువారలకవాంతరమై నిలుతున్ బృహన్నలా!

    రిప్లయితొలగించండి
  7. కోపముతో కాలుని వలె
    చాపము నేనెక్కుపెట్టి జంపెద వారిన్!
    తాపమును తాళలేనిక
    పాపము పండును రిపులకు భండన మందున్!!

    రిప్లయితొలగించండి
  8. కోపమున్ పెంచె వైరుల గోగ్రహణము
    వడిగ నాచాపము విడుచు భాణతతిన
    తాపమును పొందుదురు వారు తధ్యముగను
    పాపము ఫలించె వారికి పరము కలుగు



    రిప్లయితొలగించండి
  9. కోపము గల్గ జేసిరహొ గోవుల మంద మరల్చి కౌరవుల్
    తాపము జెందియున్న నిక తాళను వారల యాగడమ్ములన్
    పాపము జేసినట్టి కురు వంశపు వీరుల నొక్కపెట్టునన్
    చాపము దీసి చంపెదను శస్త్రము లస్త్రము లన్ని వేయుచున్!

    రిప్లయితొలగించండి
  10. కోపముఁ గల్గ జేసితిరి గోగ్రహణంబును సల్పి శత్రువుల్
    పాపము పండె వారలకు, వాడిశరంబులు నేను విడ్చ నా
    చాపమునుండి, కౌరవులు చచ్చుట ఖాయము యుద్ధమందునన్
    తాపము వచ్చునిక్కముగ దైత్యమనస్కులు వైరిమూకకున్

    రిప్లయితొలగించండి
  11. ఉత్తరుడు శత్రువులను ఎలాగైనా చంపుతానని పలికే సందర్భంలో...

    కోపము వచ్చును నాకిటు
    చాపము గొని తేకయున్న, చంపెద మూకన్
    పాపంబని వదలను సం
    తాపంబిక పెరిగి పోవు తప్పదు ధరణిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్తర కుమారుడు అంతఃపుర కాంతలతో...
      కోపముఁ జెందగ ననిలో
      చాపము లేకున్న తూపు సంధించ గలన్!
      తాపముఁ జెందితినా యే
      పాపముఁ బుణ్యముఁ దలవను బరులను గూల్చన్!

      తొలగించండి
  12. "చాపము తో కురుసేనకు
    తాపము నణగింప జేతు తరుణులు కనుడీ!
    కోపము నందితి" ననియును
    పాపము తా సేనజూచి వణకెనుగాదే!!

    కోపము నుత్తరుడందియు
    "చాపము వట్టియు కురువిభు సైన్యముగూల్తున్
    పాపము చేతురె? గోవుల
    తాపము నందకను తెత్తు తధ్యము కనుడీ!"

    కోపమున నుత్తరుడునను "గోవుల నిట
    తాపమును నందకయె తెత్తు తధ్య మిదియ
    పాపము బృహన్నల రధము,వడిగ తోల
    చాపమును నెత్తి కౌరవసైన్య మడతు"

    కోపమునందె నుత్తరుడు గోవుల నెత్తుకపోవ కౌరవుల్
    "చాపము పట్టి కౌరవుల సైన్యము నుగ్గునుచేతు చూడుడీ!
    తాపముదీర్తు తండ్రికిని తా రధసారధి లేక జంకితిన్
    పాపము వారి పాగలను పట్టియు తెచ్చెద బొమ్మలాటకై"

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్సులతో...

    (నర్తనశాలలో బృహన్నల యెదుట, నంతఃపురకాంతల యెదుట నుత్తరకుమారుఁడు ప్రగల్భమ్ములు పలుకు సందర్భము)

    కోపము నాకుఁ గల్గెడిని గోగ్రహణోద్ధతమూర్ఖకౌరవుల్
    పాపముఁ జేసి, సంగరము భావ్యమటంచును నెంచి, నీచులై
    తాపములేక నిక్కఁగను, ధైర్యము శౌర్యముఁ బూని నేను నా
    చాపముఁ జేతఁ బట్టితిని! సారథిలేఁ డిఁక నేమి సేయుదున్?

    రిప్లయితొలగించండి
  14. ఉత్తరుని ప్రగల్భములు....

    కోపమునన్ దూర్వాసుని
    చాపము పట్టంగ నేను జగదభిరామున్
    తాపముపెంచగ నగ్నిని
    పాపము దలపను రిపులను భండనమందున్.

    రిప్లయితొలగించండి
  15. (కొద్ది మార్పుతో)
    ఉత్తర కుమారుడు అంతఃపుర కాంతలతో
    కోపము నన్ నా చూపులె
    చాపములై తూపుల నెన్నొ సంధించు ననిన్!
    తాపముఁ జెందితినా యే
    పాపముఁ బుణ్యముఁ దలవను పరులను గూల్చన్!

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

    కోపము రేగ నుత్తరుడు గోటు ప్రగల్భములాడె
    “పాపము పండి కౌరవులు వచ్చిరి గోగణమున్ హరింప,
    నా తాపము తీర కోరగా రథమ్ముకు సారధి లేకనే కదా
    చాపము నెత్తి అర్జునుని జాడ జయమ్మును గూర్చ కుండునో“

    కేంబాయి వెంకట తిమ్మాజి రావు

    రిప్లయితొలగించండి
  17. నా రెండవ, మూఁడవ పద్యము(లు):

    వ.
    కౌరవు లుత్తర గోగ్రహణముం జేసిన విషయము వినిన యుత్తరకుమారకుండు

    కం.
    ఈషత్కోప ముఖాంచ
    ద్రోషిత హృచ్చాపముక్త రూక్షాంబక వా
    క్ఛోషిత తాప ముఖర శ
    బ్దోషఃకాల క్షపాపముద్రితఘోషన్!

    వ.
    అంతఃపురకాంతలయెదుట బృహన్నల చూచుచుండఁగా నిట్లు పలికెను...

    కం.
    "కోపము నాకును వచ్చిన
    చాపముతోఁ గౌరవులనుఁ జావఁగఁజేతున్!
    తాపముతోడుత వారలు
    పాపము! శోకార్తులునయి పరువెత్తవలెన్!"

    (మొదటి పద్యమున దీర్ఘసమాసమును, నుత్తరుండు మాటలాడునపు డలఁతి యలఁతి మాటలను హాస్యమునకై వాడితినని గమనించ మనవి)

    రిప్లయితొలగించండి
  18. ఈరోజు కూడా పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయినందుకు కవిమిత్రులు నన్ను మన్నించాలి. చనిపోయిన మా తమ్ముని (పిన్న కొడుకు) దశదినకర్మకాండకు వెళ్ళి సాయంత్రం వచ్చాను. అప్పటినుండి నెట్ కనెక్ట్ కాలేదు. ఇప్పుడే కనెక్ట్ అయింది.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చాపము డాలు కత్తి గొని సారథి నా కొక డున్న...’ అంటే ఇంకా బాగుంటుంది.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పాటవము’ టైపాటు వల్ల ‘పాఠవము’ అయినట్టుంది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బాణతతిని’ అనండి.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పాపమనుచు వదలను సం
    తాపమికన్ పెరిగి పోవు....’ అనండి. (ఇచ్చిన దత్తపదులు ముకారాంతాలు కదా)
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణమున ‘కోపమున నుత్తరు డనెను...’ అనండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉండి పండిత పామర జనరంజకంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండవ పూరణలోని శబ్దప్రయోగవైచిత్రి అలరింప జేసింది. దత్తపదుల ముకారాన్ని ప్రత్యయంగా వాడని మీ ప్రతిభ బహుధా ప్రశంసనీయం. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దూర్వాసుని, రామున్’ అని ద్వితీయలో చెప్పారు. అగ్నిని అనడం బాగానే ఉంది. మూడవ పాదాన్ని ‘తాపమున నగ్నిఁ బోలెద’ అంటే ఎలా ఉంటుంది?
    *
    కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘... ప్రగల్భము లాడే నిట్టులన్’ అనండి. ‘కోరగ’ టైపాటు వల్ల ‘కోరగా’ అయింది. ‘రథమ్ముకు’ అనరాదు. ‘రథమ్మునకున్’ అనాలి. అక్కడ ‘రథమ్మున సారథి...’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికి నమస్కారములు.

    మొట్టమొదటిసారిగా నూతన వృత్తమును వ్రాయప్రయత్నించినాను. దయచేసి తప్పొప్పుల విచారించవలసినదిగా ప్రార్థన.

    లయగ్రాహి :

    కోపమిదె గల్గెనిట భూపతుల సైన్యచొఱ లాపగల వీరుడిదె నేపగిది లేడా ?
    చాపదిమె చేకొని ప్రతాపబలసంపదను చూపఁ రిపురాజులిట సైపగలవారే ?
    తాపముకలుంగనిడు నా పవిసమానమగు తూపులపరంపరలఁ నోపగలవారే ?
    పాపమని లోఁదలఁచి యీ పనిని చేయుటకు దాపరిక మేపగిది చూపనిక రమ్మా!


    రిప్లయితొలగించండి
  20. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ లయగ్రాహి సలక్షణంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    ‘సైన్యచొఱలు’ అనేది సమాసం దుష్టం. ‘సైన్యముల నాపగల...’ అనవచ్చు కదా!

    రిప్లయితొలగించండి
  21. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు. నా ఉత్పలమాలను కూడా పరిశీలించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  22. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీ సూచన, సవరణల తో...


    కోపమునన్ దూర్వాసుడ
    చాపము పట్టంగ నేను సరి రాముడనే
    తాపమున నగ్ని బోలెద
    పాపము దలపను రిపులను భండనమందున్.

    రిప్లయితొలగించండి