4, అక్టోబర్ 2014, శనివారం

పద్యరచన - 696 (ఉత్సవములలో విషాదఘటనలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచన శీర్షికకు అంశము...
ఉత్సవములలో విషాదఘనటనలు.

7 కామెంట్‌లు:

  1. ప్రభల తీర్ధము కొఱకునై బంధు గణము
    తోడ పోవంగ నచ్చట తోపు లాట
    జరిగి యిద్దరు మగవారు చనగ యముని
    పురికి ,భయపడి యింటికి మరలి తిమఱి

    రిప్లయితొలగించండి
  2. ఉత్సవముల లోన నుఱ్ఱూతలూగుచు
    మూడ భక్తి తోడ ముసరు కొనిన
    ప్రాణ హాని జరుగు వత్తిడి తోడను
    తగిన మార్గ మందు తరల మేలు(వలయు)

    రిప్లయితొలగించండి
  3. స్వామి బ్రహ్మోత్స వమ్ముల సంబరంబు
    వినుటె గాని వీక్షించని పెద్ద యొకరు
    మిగుల నుద్వేగ భరితుడై మేళ మూద
    హృదయ స్పందన మాగె నా ముదము లోన
    హరిని జేరెననిరి తోడ తిరుగు వారు!
    తిరిగి రాడని వారింట దిగులు పొగలె!

    రిప్లయితొలగించండి
  4. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఎక్కడ జూసిన లెక్కకు
    మిక్కిలియై భక్తితోడ మెలగెడు ప్రజకే
    త్రొక్కిసలాట లు జరిగిన
    దిక్కే లేదుత్సవాలు, తిరుణాలలలో

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    నేను నిరీక్షిస్తున్న భావంతో మీరు చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి