5, అక్టోబర్ 2014, ఆదివారం

పద్యరచన - 697

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. మర్షముతో పుస్తకమును
    వర్షములో చదువుచుండె బాలిక దీక్షన్
    హర్షుని నైషద మేమో
    హర్షాతి శయమున మోము కందముహెచ్చెన్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఇంటిలో నొంటిగా :

    01)
    ______________________________

    వర్ష మధిక మయ్యె - వనిత తా నొంటిగా
    నింట నుండి పూర్తి - వంట జేసి
    పొద్దు పోక దీసె - పుస్తకం బొక దాని
    బొమ్మలందు గనుచు - మురియు చుండె !
    ______________________________

    రిప్లయితొలగించండి
  3. వ ర్ష మక్కడ ధారగా బడుచు నుండ
    దాను నొక్కతే కూర్చుండి తన్మయతన
    చదువు చుండెను బాలిక శ్ర ద్ధగాను
    మంచి ఫలితము నిచ్చుత ! మాధ వుండు

    రిప్లయితొలగించండి
  4. వానల జల్లుల వేళల
    తానొక పొత్తము కరములఁ దాల్చిన రమణీ
    యానన ముగ్ధగఁ దోచె, స
    దా నలువ కరుణ పడతికి దక్కదె? దక్కున్.

    రిప్లయితొలగించండి
  5. చూరున వర్షపు ధారల
    హారములను గనుచు మురిసి నాహ్లాదముతో
    తీరికగా పుస్తకమును
    కూరిమి తో చదువు చుండె కోమలి నచటన్!

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మోమునకు’ అనడం సాధువు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘తన్మయతను/ లేదా/ తన్మయమున’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కోమలి యచటన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. జోరునను వర్ష ధారలు జాఱుచుండ
    కన్నె యొక్కటి కూర్చుండి తిన్నె పైన
    చల్ల దనమును కాంచుచు సంతసముగ
    చదువు చున్నది పొత్తము శ్రద్ధగాను

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కన్నె యొక్కతి..’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. చిత్రంలోని యిల్లు మండువా లోగిలి అని అనుకొంటూ...

    మండువ లోగిళుల్ కనగ మానసమున్ హరియించు చుండె నా-
    డండగ నుండి యుమ్మడిగ నాప్తుల రెల్లరు నొక్క గూటిలో
    మెండగు ప్రేమతో నొకరి మేలుళ నింకొక రెన్ను రీతిలో
    రండని పిల్చు చుండెడిని రమ్యముగా చనుదెంచు వారినిన్.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    సందేహం లేదు. అది మండువాలోగిలే. చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి