6, అక్టోబర్ 2014, సోమవారం

పద్యరచన - 698

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. బట్టల దుకాణమందున
    గుట్టలుగా చీరలుండ గూర్చొని యచటన్
    కట్టిన చీరలను మరల
    కట్టని మగువలు ఖరీదు గలవే ఎంచున్

    రిప్లయితొలగించండి
  2. బట్టల దుకాణ మయ్యది
    బట్టల బేహారి యచట పట్టువి చూపన్
    బట్టలు నచ్చక యాయవి
    యిట్టట్టుగ జూచు చుండె నింతులు నచట న్

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఖరీదు గలదే యెంచన్’ అంటే బాగుంటుందేమో?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. కందం
    రంగుల చీరలు నమ్మగ
    భంగిమ లెన్నోపెడుదురు పాపంమగవా
    రంగనలేమోనలుగక
    చింగులుబేరములనెననొ చేతురదేమో

    రిప్లయితొలగించండి
  5. చీరెలను గొన నింతులు చేర షాపు
    చలన చిత్రము గాంచగఁ జనిరి ధవులు
    వేచి యుండెడు కాలముఁగాచు కొరకు
    తన్వయత్వము తోడను తరుణు లుండ
    నెపుడు ముగియునో కొనుగోలు యెవరి కెరుక?
    వేచి యుండక తప్పునె పిదపనైన?
    కాచు: సహించు

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కోపుదారునితో కొనువాడు :

    01)
    _______________________________

    శ్రేష్ఠి చూపుమో మిక్కిలి - శ్రేష్ఠమయిన
    రమణి పెండ్లికి వలయును - రమ్యమైన
    రంగు రంగుల చీరలు - హంగు గలుగు
    చెంగు లున్నట్టి బంగారు - పొంగులెత్తు
    పోగులెన్నియొ గలిగిన - పొంకమైన
    పట్టు చీరల నెంచగా - పడతులకును !
    _______________________________

    రిప్లయితొలగించండి
  7. పండుగ వేళల రమణులు
    నిండగు రంగులతొ మెరయు నీలపుచీరల్
    దండిగ కొనుటకు చూడగ
    దండగ యనుకొనగ రాదు తక్కినవారల్

    రిప్లయితొలగించండి
  8. బేరముఁ జేయుట కొరకై
    చేరిన వనితలకు చీర చెలువముఁ జూపన్
    వారల యూహల దానిని
    దీరిచి గట్టిన దలంపు తెల్లము గాదే?

    రిప్లయితొలగించండి
  9. పట్టు చీ రను పట్టినా రటు పచ్చ రంగును మెచ్చగన్
    కట్టు వారలు బెట్టు జేయుచు గాంచు చుండిరి పైకమున్
    పట్టు వీడక కొట్టు వారలు పట్టి కొంగును జూప గన్
    ఎట్ట కేలకు బేర మాడగ ఇంతు లందరు గూడుచున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. వ్యావహారిక పదాలను సులభంగా గ్రాంధికంలోకి మార్చవచ్చు. మీ పద్యరచనను కొనసాగించండి. మీ పద్యానికి నా సవరణ చూడండి....
    రంగుల చీరల నమ్మగ
    భంగిమ లెన్నియొ పెడుదురు పాపము మగవా
    రంగనలేమో యలుగక (యలయక)
    చింగులబేరముల నెన్నొ చేతురదేమో
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందలు.
    *
    గుండా వేంకట సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శారీలను చూడుడు ప్రతి
    సారీ కొంగ్రొత్త సరుకు సందడి చేయున్
    సారించుడు చూపుల వే
    సారీ విసుగింత మాకు చచ్చిన రాదే.

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కొన్ని వ్యావహారిక పదాలున్నాయి. కానీ మీరు చెప్పిన పద్ధతికి దోషం లేదు.

    రిప్లయితొలగించండి