9, అక్టోబర్ 2014, గురువారం

పద్యరచన - 701

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. స్కందుడు శిఖి వాహనుడై
    సుందర నగరంబు పైన సొంపుగ తిరిగెన్
    చిందర వందర బ్రతుకుల
    నందముగా మారునటుల నాశీస్సులిడెన్

    రిప్లయితొలగించండి
  2. నెమలి వాహను డా స్కంధు డలరి మిగుల
    పరుగు లిడుచుండె గగనాన పణము దలచి
    యాధి పత్యము కొఱ కునై నాశ పడుచు
    నెవరు గెలుతురి రువురిలో ? యెఱు గు శివుడు

    రిప్లయితొలగించండి

  3. 'మయిల్ వాగనా', కుమరా మురుగా
    ఇది పంచ దశ లోకము ,వదులుము 'మయిల్'
    సంధించుము 'ఈ-మెయిల్,'నీ ప్రదక్షిణము
    గణేశుని కన్న మిన్న యై వర్ధిల్లు 'ఈ-కాలమున'!!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_

    రిప్లయితొలగించండి
  5. నెమిలిని యెక్కి సుందరుడు నింగిని నేడిట సంచరింపగా
    కొమరునిఁ గన్న భక్తులిట కొల్వగ పద్యములందు పాడ, మా
    లిమిఁ గొని శిష్యులందు నవ లీలగఁ బాండితి బెంచు సూచనల్
    సమమగు భావనమ్మునిడి చక్కగ మా గురువర్యులీయరే?

    రిప్లయితొలగించండి
  6. రివ్వున నేగుచున్ నెమిలి రెక్కలపై గగనాన, లోకముల్
    సవ్వడి లేక నేలగను, స్కంధు డదే కనుడయ్య, భక్తితో
    పువ్వుల పండ్ల తోయముల పూజలొనర్చి సమర్పణమ్ముగా
    నెవ్వరు జేతురా యనుచు నిమ్ముగ జూచెడి నయ్య మ్రొక్కరే.

    రిప్లయితొలగించండి
  7. నెమలి వాహ్య మెక్కి నీలకంఠ సుతుడు
    చదలఁ బోవుచుండె సమరమునకు
    కలియుగంబు నందు కల్మష హృదయుల
    పీచ మడగు జేయు వేడ్క తోడ

    రిప్లయితొలగించండి
  8. శ్రీకంఠుని భక్తాదులు
    ప్రాకటముగ నొక్కవాని భవ్యగుణాఢ్యున్
    చేకొని విఘ్నేశ్వరుగా
    మాకొసగు మనంగ భవుడు మానసమందున్. 1.

    ఘనుడెవ్వండీపదమున
    కనుగుణసత్త్వాఢ్యు డౌచు నర్హుం డగువా
    డని యోచించుచు నుండగ
    ననుమానము లేదు నేనె యధికుడననుచున్. 2.

    వరుసన్ షణ్ముఖు డాదట
    కరివదనుడు స్పర్థనూని ఘనతన్ దెలుపన్
    సురుచిర శబ్దంబులతో
    సరిసరి వినుడంచు బలికె శంకరు డపుడున్. ౩.

    సుతులారా! యిద్దరిలో
    నతులితతేజంబు గల్గి అఖిలాపగలన్
    క్షితిపాతాలదివంబుల
    నుతజలలగువానిలోన నుత్సాహముతోన్. 4.

    మునుముందుగ నెవ్వాడిక
    ఘనుడై స్నానంబు చేసి కన నగ్రగుడై
    వినయాన్వితుడై మరలునొ
    యనుమానములేదు వాడె యధిపతి యనినన్. 5.

    శిఖివాహనుడై యాష
    ణ్ముఖుడతి హర్షంబుతోడ ముందుగ గగనో
    న్ముఖుడై యీకార్యం బతి
    సుఖదం బగునంచు వెడలె సుందరఫణితిన్. 6.

    అల్లదిగో చిత్రంబున
    కల్లయొకింతయును గాదు కనుడా కొమరున్
    ఫుల్లారవిందవదనుని
    యుల్లంబున జయముగోరు నున్నతచరితున్. 7.

    అరుసం బబ్బెడు షణ్ముఖ!
    నిరతము యశమందు గాత నీకు కుమారా!
    హరుని శుభాశీర్వచనము
    లురుతర సౌఖ్యంబు కలుగు చుండెడు నెపుడున్.8.

    సేనానికి నీపనిలో
    మానితముగ విజయసిద్ధి మరియందునొ, తా
    స్వానుభవంబున నెరుగొనొ
    ధీనిధియౌ యగ్రజాతు దీప్తిని భావిన్. 9.

    రిప్లయితొలగించండి
  9. జన జీవితమెటు లోయని?
    వినువీధిని కార్తికేయ విహరించెదవా!
    కనరావా? మాదు వెతలు!
    వినలేవా? భక్తులార్తి వేదన నిండన్!

    రిప్లయితొలగించండి
  10. పురివాహనుడై నదివో
    శరవణభవుడొచ్చె భువికి జనులను బ్రోవన్
    కరములు జోడించి గొలువ
    వరములనిడి గాచు నెపుడు పార్వతి సుతుడే!

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    వినాయక షణ్ముఖుల స్పర్థను ఖండికగా (చిత్రం పరిధిని దాటకుండ) చక్కగా వ్రాసి అలరింపజేశారు. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘భక్తుల + ఆర్తి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘భక్తజనుల వేదన..’ అందామా?
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు గ్రామ్యంలో... అక్కడ ‘శరవణభవు డేగుదెంచె జనులను...’ అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :జన జీవితమెటు లోయని?
    వినువీధిని కార్తికేయ విహరించెదవా!
    కనరావా? మాదు వెతలు!
    వినలేవా? భక్త జనుల వేదన లెగయన్!

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కుమార, గణేశుల పోటీలో :

    01)
    ____________________________

    ఘనుడా షణ్ముఖు డేగెను
    ఘనమైన జగంబు జుట్ట - ఘనమగు పురిపై !
    మొనగాడయ్యె గణేశుడు
    గునగున తిరుగుచును తల్లి - గురువుల చుట్టున్ !
    ____________________________
    గురువు = తండ్రి

    రిప్లయితొలగించండి
  14. వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి