17, అక్టోబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 709

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. తూనీగా నీలాగా
    నేనే నాడైన స్వేచ్ఛ నెగురగ గలనో
    లేనో కానీ చక్కని
    యీనీ విహరణము జూచి యీర్ష్య జనించున్

    రిప్లయితొలగించండి
  2. తూనీగా నీవు వరుణు
    తూణీరమవనుచు ప్రజకు తోచును నీవే
    వానలు కురియుట ముందుగ
    నీనీ గుంపంత నింగి నెగిరెదరటగా !

    రిప్లయితొలగించండి
  3. తూనీగా! తూనీగా!
    వానలరాకడను తెలిపి వయ్యారముగా
    పూనికతో గుంపులుగా
    సూనములో నెగురు తావె సుందర గతితో!!

    రిప్లయితొలగించండి
  4. తూనీగల బట్టుకొనగ
    పూనికతో బాల్యమందు పొలములు, పుట్రల్,
    కానలలో తిరుగాడుచు
    నానాడు గడిపిన గురుతు లన్నియు వచ్చెన్!

    రిప్లయితొలగించండి
  5. తూనీగలతో నాడుచు
    పూనితునిమి రెక్కలప్డు పొందితి ముదమున్
    దానవుడనై, వయసుడుగ
    నానా పాపఫలమిప్డు యనుభవమయ్యెన్

    రిప్లయితొలగించండి
  6. పచ్చని పంటపొలమ్ముల
    విచ్చినపూదోటలందవిచ్చ్హిన్నముగా
    నచ్చికములేక తిరిగెద
    వెచ్చోటను సేదదీరుటేతూనీగా!

    రిప్లయితొలగించండి
  7. వానల రాకను దెల్పును
    తూనీగ లనుచుఁ దలపక దుశ్శకునమనే
    బాణీ పాశ్చాత్యులు నీ
    వే నేరముఁ జేయకున్న నేర్పరచి రటన్!

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    తూర్పు తెల్లవారె తూనీగ తిరుగాడె
    చేల లోని గఱుకు చెఱకు పైన
    నెగురుచుండు తాను సొగసుగా నిటునటు
    ఘన విమాన మట్లు గాలి లోన

    రిప్లయితొలగించండి
  9. తూనీగపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి