19, అక్టోబర్ 2014, ఆదివారం

పద్యరచన - 711 (పదుగు రాడు మాట)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
‘పదుగు రాడు మాట’

11 కామెంట్‌లు:

  1. కవిమిత్రుల మన్నించాలి. గతంలో పద్యరచన శీర్షికలో ‘తేనె పూసిన కత్తి’ 2-4-2013 నాడు ఇచ్చాను. మరిచిపోయి మళ్ళీ ఇవాళ ఇచ్చాను. గుర్తుకు వచ్చి అంశాన్ని మార్చాను. గమనించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    మధురమైనవాడు మంచివారల కెప్డు
    కఠినమైనవాడు కఱకులకును
    ధర్మపథము విడడు, ధర్మజు నెన్నగా
    తేనె పూయబడిన తీపి కత్తి.

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    పదుగురాడు మాట పాడియై ధర జెల్లు
    ననుచు నుడువుచుందు రార్యు లంత
    వాక్కు కున్నవిలువ పలువురు గుర్తించి
    పలుకవలెను మంచి పలుకు లెపుడు

    రిప్లయితొలగించండి
  4. పదుగు రాడు మాట పాడియై ధరఁజెల్లు
    ననెడు బుధుల పలుకు కనుచు మదిన
    పరుల పేరు నెపుడు పాడుచేయతగదు
    యనృత మాట లెపుడు నాడ వలదు

    రిప్లయితొలగించండి
  5. పదుగు రాడుమాట " పాడి " యై ధరజెల్లు
    మంచి నిర్ణయమ్ము మహిని నిలుప
    పదుగు రాడుమాట " పాడు " యై ధరజెల్లు
    నెంచి లాభములను పెంచ చెడును.

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతి శాస్త్రి గారూ,
    నేను శీర్షికను మార్చేలోగా మీరు మీ పద్యాన్ని పోస్ట్ చేశారు. ఫరవాలేదు.
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

    పదుగురాడు మాట పరిశీలనము లేక
    బడుగు వోలె నడువ పదును నూత
    ఎందరో యనక ఎంత సమంజస
    మ్మంచు జూడ వలెను అవనిలోన

    కేంబాయి వేంకట తిమ్మాజీ రావు

    రిప్లయితొలగించండి
  8. హృదయంబును కలబోసిన
    మృదు మధురంబైన మాట మేధిని యందున్
    సదమలమై శ్రేయ మొసగ
    నదియె పదుగురాడ పాడియై ధరఁ జెల్లున్!

    రిప్లయితొలగించండి
  9. పదుగు రాడు మాట లెల్ల పాటియగుచు చెల్లురా
    మృదువు మాట లాడుచుండ మిగుల కీర్తి కల్గురా
    వదుర వలదు నొరల కించ పరచు మాట లెప్పుడున్
    హృదయఘోష శాపమిడును హేయ నుడువు లేలరా?

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి