30, సెప్టెంబర్ 2014, మంగళవారం

దత్తపది - 46 (కాకి-కోయిల-బాతు-నెమలి)

కవిమిత్రులారా!
కాకి - కోయిల - బాతు - నెమలి
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
(నెమిలి సరియైన రూపం. శబ్దరత్నాకరం ‘నెమలియని వాడుచున్నారు గాని దానికిఁదగిన ప్రయోగము కనఁబడలేదు’ అని చెప్పింది. దత్తపదిలో ‘నెమలి’నే ప్రయోగించండి.)

35 కామెంట్‌లు:

  1. ఇందుకా కిరీటి ధనువు? హీనుడయ్యె
    భీముడెందుకో? యిలలోన వెలదిని జడ
    బట్టి కొంగట్టి లాగిన పతుల ధీర
    మతుల వీరము నిలుచునె? మలినమయ్యె!

    రిప్లయితొలగించండి
  2. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కొంగు పట్టి’ని ‘కొంగట్టి’ అన్నారు. కొంగతో ఇబ్బందిని గుర్తించాను. అందువల్ల కొంగ స్థానంలో ‘బాతు’ను పెడుతున్నాను. మీకు కలిగిస్తున్న ఈ అసౌకర్యానికి మన్నించండి. ‘బాతు’తో మరో ప్రయత్నం చేయండి.

    రిప్లయితొలగించండి
  3. నాదు కొంగది లాగెను నాధ ! వినుము
    ఎందు కోయిల బ్రదుకంగ నిపుడు నేను
    నేనె మలిన మైతినిమఱి , నెమ్మదిగను
    నూర కుండుట కా కిరీ టీ ! ర భసము ?

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పాండవుల అరణ్యవాసములో :

    01)
    _____________________________

    కాకి గుంపులు చెట్లపై - కావు మనగ
    కోయిలల నిస్వనము లవి - హాయి గొలుప
    బాతు సంతతి కొలనులో - నీత గనుచు
    నెమలి నాట్యమ్ములను గాంచి - నెమ్మి జెంది
    ప్రకృతి సౌందర్యమును గని - పరవశించి
    నడచు చున్నారు పాండవుల్ - యడవి లోన !
    _____________________________

    రిప్లయితొలగించండి
  5. అఙ్ఞాతవాస ప్రారంభమునకు ముందు ధర్మరాజు భీమునితో :

    02)
    ________________________________

    ఎందు"కా కిం"క తమ్ముడా - నిందలాపు
    యేల"కో యిల" చాటుగా - నిటుల నిలువ
    "బాతు"మలకును చిక్కిన - సాతి యగు"నె !
    మలి"కితము గల్గు చున్నది - మనసు లోన !

    ________________________________
    కింక = కోపము
    బాతుమ = వేగు
    మలికితము = సందేహము, వ్యాకులము

    రిప్లయితొలగించండి
  6. కీచకా! కినుకనుఁ బతికి తెలుపంగ
    లేనొకో! యిల నీకుఁ జెల్లెనిక నూక;
    లకట, నాకుఁ బాతుఁడవయి నాడుచుంటి.
    తగునె మలినంపు యోచనల్? తగవు తగవు.

    పాతుఁడు = రాహువు

    రిప్లయితొలగించండి
  7. నాకా కినుకయె వచ్చెను
    మాకో యిలఖండ మెంత మాధవ ! యొడలే
    నాకాయెనె మలినమ్మిక
    నాకురుతతి బొందబాతు నయముగ కృష్ణా !

    రిప్లయితొలగించండి
  8. కాకి మూకలు దాగెను శాఖలందు
    కోయిలలు కూసె ముదముగ గొంతు విప్పి
    నెమలి నాట్యము జేసెను నయముగాను
    బాతు లన్నియు జేరెను ప్రీతి తోడ
    వారణావతమున గని పాండవులను!

    రిప్లయితొలగించండి
  9. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    "తెలుసుకో యిల నీతోనె మలినమయ్యె
    ధర్మ, మేకాకివై నీవు ధరణిగూలె
    దనగ నిశ్చయ౦బాతుది దండి యందు "
    యనుచు పలికెను కురుసభ యాదవుండు


    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ చివర ‘పాండవు లడవిలోన’ అనండి.
    రెండవ పూరణలో ‘నిందలాపు/ మేలకో’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘పాతుడవయి యాడుచుండి’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    దత్తపదాలను స్వార్థంలో వినియోగించవద్దని చెప్పకపోవడం నా పొరపాటే :-)
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘యంద/టంచు పలికెను’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. మల్లెలవార్[పూరణలు
    కాకి గూటిని కోయిలగడిపినట్లు
    పాండవు లరణ్య వాసాన వరలి రెలమి
    నెమలి వంపుల నాట్యాల నేర్పు జేయ
    చక్క బాతు లాడి మెలగె సరసి తటుల
    2. తానె మలిన౦పు వసనాల ద్రౌపదియును
    పురుషు డేకాకి యను చండ భావ మలర
    యెవరికో యిల దిక్కౌను నెటుల నేను
    బాతు వేర్వేరు వృత్తుల వరలు చు౦డె

    రిప్లయితొలగించండి
  12. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఏలకోయిల నీతివిహీను డగుచు
    పట్టి నభిమన్యు నేకాకి పట్టి చంప
    బూనె మలినమతి సుయోధనా నిలు మిక
    బాతుకుడ నీదు మదమడచు పార్ధు డిపుదు

    రిప్లయితొలగించండి
  13. కీచక గాథ:
    ఏకాకి ననుకొని దరికి
    రాకోయి! లయమ్ము నెంచు లాలస విడుమా!
    తాకుట సబబా? తుత్తర
    నీకేలననె! మలినమతి నీలుగఁ గూలెన్!

    రిప్లయితొలగించండి
  14. మిత్రులకు నమస్సులు!

    (తననుఁ బట్ట నుంకించుచున్న కీచకుని ద్రౌపది వారించు సందర్భము)

    "వలదు కీచకా, కిన్క! నన్ బట్టుకొనియు
    మత్పతుల ప్రతిక్రియనంది మ్రందకోయి!
    లిని స్త్రీషాడబాతురుం డెలమిఁ గనఁగ
    బుద్ధియుతుఁడౌనె, మలినకర్ముఁడగుఁగాని!!"

    రిప్లయితొలగించండి
  15. భారతీయ స్టేట్ బ్యాంక్ లో 36 సంవత్సరాల 3 నెలల 23 రోజులు పనిచేసి పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఈ రోజు ఉద్యోగ విరమణ చేశాను.
    సామాజికంగా నాకొక గుర్తింపు నిచ్చి ఆర్థికంగా నాకు అండదండగా నిల్చిన భారతీయ స్టేట్ బ్యాంకుకు నేనెంతో ఋణ పడి ఉన్నాను. నా దృష్టిలో భారతీయ స్టేట్ బ్యాంకులో కొలువు దొరకడమంటే పూర్వ జన్మ సుకృతం విశేషంగా ఉన్నట్లు లెక్క.
    బ్యాంకులో నా విధినిర్వహణలో నాకవసరమైన సహకారాన్ని అందించి నాకు వెన్నుదన్నుగా నిలబడిన వారెందరో పెద్దలు, మిత్రులు, అలాగే బ్యాంకులో నేను అడుగిడడానికీ, నా అభ్యున్నతికీ తోడ్పడిన పెద్దలు, మిత్రులు కొందరు కీర్తిశేషులు, కొందరు నాతో ఇప్పటికీ సంతోషాన్ని పంచుకొంటున్నవారూ
    అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. కీచకా కిన్కతో పతుల్ కాచి నారు
    నీవు డంబాతురుండవై నిక్క వలదు
    కూలిపోదు వొకో యిల పాలసుండ
    వీడునె మలినము మనస్సు పాడు బడగ?

    రిప్లయితొలగించండి
  17. కె .ఈస్వరప్ప గారి పూరణ
    అతివ సైరంధ్రి కాకిగ్గునదరబోను
    యందుకో యిల కీచకా పొందు కాడ
    స్వర్గ మందించునె మలివిసర్గ మందు
    బాతులా యిట రమ్ము సవాలు వద్దు
    యన్న నర్తన శాల భీమన్నమాట

    రిప్లయితొలగించండి
  18. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పాతకుడ’ అనే అర్థంలో పాతుకుడ అన్నారు. పాతుకుడు అంటే ఒక పక్షివిశేష మని నిఘంటువు చెప్తున్నది.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    కందంలో అందంలో ఒదిగిన దత్తపదాలతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కడకు నేలకో’ అనండి.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    పదవీవిరమణ శుభాకాంక్షలు! ఇకనుండు శంకరాభరణానికి, ఫేసుబుక్కు గ్రూపలకు ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నాను.
    భారతీయ స్టేటు బ్యాంకులో ముప్పది
    యారు వత్సరమ్ము లలరఁ జేసి
    నావు; పదవి విరమణమ్మున నా శుభా
    కాంక్ష లందుకొనుము కడు ముదమున!

    విశ్రాంత జీవితమున న
    విశ్రాంతముగాఁ గవితల వెలయించుము కా
    వ్యశ్రీకరణవ్యాసం
    గశ్రేయము నిరత మందఁగా మిస్సన్నా!
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసార్హం. కాని అన్వయం కుదరడం లేదేమో? ఒకసారి పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  20. మిత్రులు మిస్సన్నగారికి పదవీ విరమణ శుభాకాంక్షలు!

    పదవీ విరమణ మనునది
    పదవికి మాత్రమ్మె గాని పద్యమునకుఁ గా
    దిది మఱువక ప్రతిదినమును
    వదలక పద్యమును వ్రాయవలె మిస్సన్నా!

    (తప్పక పద్యములను వ్రాయుచు మా బోంట్లతో నెల్లప్పుడును సఖ్యము నెఱపవలెనని నా సంప్రార్థనము)

    రిప్లయితొలగించండి
  21. నా మఱియొక పూరణము:

    (అర్జునుఁడు శ్రీకృష్ణునితోఁ బలికిన పలుకులు)

    ఓయి గోపాలకా! కిరాతుండు శివుఁడు
    మెచ్చి యిడెఁ బాశుపతము నా యిచ్చ, కోయి
    క్షితప్రలంబా! తుములమున గెలుచు
    నె మలిన హృదుఁడౌ రారాజు విమతుల మము?

    రిప్లయితొలగించండి
  22. గుండు మధుసూదన్ గారూ,
    మిస్సన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు వ్రాసిన పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    ఇక మీ రెండవ పూరణ నిస్సందేహంగా అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. కీచకా కిల్బిషపుచింత కీడుఁజేయు
    తగునె మలినాత్మ నీకిట్టి తెగులు మదిన
    నిన్నుఁబాతుదురు భువిలో నిశ్చయముగ
    నాపతులొకో యిలను వారి నాపతరమె?
    పాతు: పూడ్చు

    రిప్లయితొలగించండి
  24. మిత్రులు శంకరయ్యగారూ, ధన్యవాదములు.

    నా రెండవ పూరణమున ప్రథమపాదమున యతిదోష మప్రయత్నముగఁ బడినది. దానిని...

    "ఓయి గోపాలకా! కిరా తోగ్రశివుఁడు" అనికాని,
    "ఓయి గోపాలకా! కిరా తోగ్రధన్వి"యనికాని సవరించుకొని పఠింపఁగలరని మనవి.

    రిప్లయితొలగించండి
  25. మిత్రులు శంకరయ్యగారూ, మీరు మిత్రులు మిస్సన్నగారి పదవీవిరమణ సందర్భముగ వ్రాసిన రెండు పద్యము లద్భుతముగ నున్నవి. అందునఁ గందపద్యము దుష్కరప్రాసతో నత్యద్భుతముగనున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  27. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తాజా పూరణ బాగున్నచి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. నాకు శుభాకాంక్షలు చెప్పిన గురువుగారికీ, అన్నపురెడ్డి వారికీ, గోలి వారికీ, గుండా వారికీ, గుండు వారికీ, మాజేటి వారికీ, చంద్రమౌళి వారికీ ధన్యవాద శతము.

    రిప్లయితొలగించండి