1, డిసెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 752

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఎండిన డొక్కల నింపగ
    కుండల దన సారెపైన కుమ్మరి శ్రమతో
    యెండకు చలించక కళా
    ఖండంబుల వోలె మలచ గాంచంగ వలెన్

    రిప్లయితొలగించండి
  2. కుమ్మరి కుండలు సేయును
    నిమ్మహిలో ,మారు మూల యిండ్ల ల యందున్
    నమ్మగ వాటిని వచ్చిన
    సొమ్ముల బోషించు నతడు సుఖముగ నాలిన్

    రిప్లయితొలగించండి
  3. గుడగుడ చక్రము తిప్పుచు
    తడుపుచుమట్టితగినంత దాకలు కుండల్
    జడిగా చేయుచు కడుపును
    గడుపుట రెక్కలు శ్రమించ కష్టము రన్నా !

    రిప్లయితొలగించండి
  4. జనులీనాటనువృత్తివిద్యల మహా సామర్థ్యముల్ జూపుచున్
    పనులందెల్లరు మున్గ శాంతియుతమై భవ్యమ్ముగా వెల్గి జీ
    వనమీ భారతమందు తృప్తినిడి పాపాచారముల్ తక్కువై
    మనుచున్ గొప్పగనుండెనందునకటా! మా భాగ్యమేమయ్యెనో?

    రిప్లయితొలగించండి
  5. మన్నును కుండల జేయుచు
    మన్నగనే జేసి యమ్మి మనుగడ కొరకై
    మన్ననలను బొందునుగద
    అన్నా కుమ్మరికి సారె హరి చక్రమ్మే !

    రిప్లయితొలగించండి
  6. మట్టి పిసికి నడుము లొంగ కిట్టు నెంత?
    కాయ కష్టము మిగలగ కడుపు నిండ
    పట్టె డన్నము పెట్టని పాటు నీది
    పోరు బాట బ్రతుకుతీరుమారు టెపుడు?

    రిప్లయితొలగించండి

  7. పేదర్మి కి ఘటాకాశం
    ఊర్మి కి మహాకాశం
    చేత వచ్చిన కళ
    చేరువై వచ్చిన శ్రీకళ !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. సారెను జేర్చిన మృత్తికఁ
    దీరిచి నొక కుండ వలెను తేరును తానే
    గూరుచు కొమరిని కొలువున
    చేరిచి నట్టుల మురియును సేమమొసంగన్!

    రిప్లయితొలగించండి
  9. జీవము బోయుచు మట్టికి
    జీవనమును గడుపుచుండె చెన్నగు సరణిన్
    భావించుచు హరిపద రా
    జీవములను చిత్తమందు చేయుచు ఘటముల్!!!

    రిప్లయితొలగించండి
  10. మట్టిని సారెకు జేర్చుచు
    పట్టుదలగ చేయుచుండె పరమావధిగన్
    గట్టిగ దిద్దుచు కుమ్మరి
    బుట్టించును సుందరమగు బుంగలనెన్నో

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ హుస్నాబాద్ నెట్ సెంటర్‌లో ఉండి మిత్రుల పూరణలను, పద్యాలను (నిన్నటివి, ఈరోజువి) చూశాను. సంతోషం. సమయాభావం వల్ల ప్రస్తుతం సమీక్ష చేయలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  12. ప్రమిదలు, ముంతల జేయుచు
    నమితంబగు వెలుగు నింపు యాతని మదిలో
    స్థిమితము జూడము నేడిట
    కమిలిన బ్రతుకుల కరుణను కావగ లేమా!


    రిప్లయితొలగించండి