30, నవంబర్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1556 (ఛీత్కరించఁ దగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఛీత్కరించఁ దగును శిష్టజనుల.

24 కామెంట్‌లు:

 1. దుష్ట జనము చేయు దుర్మార్గములిలను
  చీ త్కరించ దగును, శిష్ట జనుల
  బోధనల నెపుడును బూర్ణ మనసు తోడ
  స్వాగ తించ వలయు సామి ! యెపుడు

  రిప్లయితొలగించండి
 2. దుష్టులైనవారి దురితకార్యములను
  ఛీత్కరించఁ దగును - శిష్టజనుల
  మంచిపనులకెపుడు కించితైనసహాయ
  మందజేయ వలయునదియెహితము

  రిప్లయితొలగించండి
 3. కవిమిత్రులకు నమస్కృతులు.
  హైదరాబాదు వెళ్తున్న కారణంగా ఈరోజు పూరణల, పద్యాల సమీక్ష చేయలేనేమో? దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 4. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  చందమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. తస్క రించ స్వామి ధనము సిగ్గునొదలి
  ఛీత్కరించఁ దగును శిష్టజనుల
  ధిక్క రింపు వలయు దేశ ప్రగతికోరి
  నిగ్గు తేల్చ గలరు నిజము బల్కి

  రిప్లయితొలగించండి
 6. మంచి చేయువారు వంచకులైనను
  వారిగొప్పయెరిగి పాడవలయు
  చెడ్డపనులు చేయ చేటుకలుగు నంచు
  ఛీత్కరింపదగును శిష్టజనుల

  రిప్లయితొలగించండి
 7. గురువులకు మిత్రులకు వందనములు !

  ధర్మపథముఁ దప్పి దాక్షిణ్యమును వీడి
  సభకు నింతి దెచ్చి రభస జేయ,
  వాయి విప్పి ఖలుల వారింప బూనరే !
  ఛీత్కరించ దగును శిష్టజనుల !!

  రిప్లయితొలగించండి
 8. సత్కరించ వలయు సత్కార్య ములయందు
  విబుధ జనుల నంత వేడ్క తోడ ,
  సత్య దూరులనటు నిత్యంబు సేవించ
  ఛీ త్క రించ c దగును శిష్ట జనుల
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 9. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  జనుల బాధ పెట్టు శాసనముల జేయ
  ఛీత్కరించ దగును. శిష్ట జనుల
  మాట వేదవాక్య మనుచు భావించుచు
  గౌరవి౦ఛ దగును తోరముగను

  రిప్లయితొలగించండి
 10. దుష్ప్రవర్తులైన దుష్టుల సంగతి
  నెంచగాను ఛీత్కరించదగును
  శిష్ట జనుల ఘనము సేవించుచుండిన
  జనులు మెత్రు జన్మ ధన్యమగును

  రిప్లయితొలగించండి
 11. దుష్ట జనుల కెపుడు దూరమ్ము గా నుండి
  ఛీత్క రించ దగును, శిష్ట జనుల
  నెపుడు చూడ వలయు నింపగు పేర్మితో
  మంచి పెంచు కొరకు మహిని సతము

  రిప్లయితొలగించండి
 12. సత్య దూరులనటు నిత్యంబు సేవించి
  వారి సేవ లోన వరుస గాను ,
  చేయ రాని పనులు చేవగా చేయంగ
  ఛీత్కరించ c దగును శిష్ట జనుల
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 13. సత్య దూరులనటు నిత్యంబు సేవించి
  వారి సేవ లోన వరుస గాను ,
  చేయ రాని పనులు చేవగా చేయంగ
  ఛీత్కరించ c దగును శిష్ట జనుల
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 14. మూర్తీజీ ! బహుకాల దర్శనం ! బావున్నారా !

  వామనకుమార్ గారూ మీరు కూడా చాలా రోజు లైనది కనుపించి ! బావున్నారా !

  రిప్లయితొలగించండి
 15. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  మనవారైనా పెరవారైనా - ధనికులైనా రాజులైనా - శిష్టులైనా భ్రష్టులైనా - శిక్షించ వలెనుగా :

  01)
  ____________________________

  తస్కరణయు హత్య ♦ తరుణుల పీడించు
  తప్పు జేయు వారి ♦ నొప్ప వలదు
  తప్పు జేయువారు ♦ ధనికులౌ రాజులౌ
  ఛీత్కరించఁ దగును ♦ శిష్టజనుల !
  ____________________________

  రిప్లయితొలగించండి
 16. సేవఁ జేయఁ జేరి శిష్టుల మంచును
  దైవ ధనము బుక్కు యావ పెరిగి
  మాయ దారి పనుల మర్మంబుగా జేయ
  ఛీత్కరించఁ దగును శిష్టజనుల !

  రిప్లయితొలగించండి
 17. కె .యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ

  కష్టము లొనగూర్చు దుష్టజనుల నెల్ల
  ఛీత్కరించఁ దగును. శిష్టజనుల !
  సథ్కరి౦ఛ దగును.సంచరించు నెపుడు
  మంచి చెడుల నెరుగు మనసు తోడ

  నవంబర్ 30, 2014 3:29 PM

  రిప్లయితొలగించండి
 18. చెడ్డ వారు తెల్పు శ్రీరంగ నీతులు
  ఛీత్కరించ దగును, శిష్ట జనుల
  మార్గ మందు నడువ మన్ననలు కలిగి
  జయము గల్గు చుండు జగతి లోన

  రిప్లయితొలగించండి
 19. కె.ఈశ్వరప్ప గారి పూరణ

  చదువు కొన్న గాని సంస్కార హీనుని
  లంచ వంచనాల లాభ పరుని
  ఛీత్కరించ దగును, శిష్ట జనుల
  హితమె లోక రక్ష గతము నేడు

  రిప్లయితొలగించండి
 20. "ఛీత్కరింపదగును ;శిష్ట జనుల" మని
  తమకు తామె తలచి,తక్కు వారి
  నధము లనుచు తిట్టు నధమాధముల నెల్ల
  పూజ సేయవలయు పుణ్యమతుల

  సత్య,శౌచ,ధర్మ చరులు కాకున్నచో
  ఛీత్కరింపదగును;శిష్ట జనుల
  నెల్ల గౌరవింప నెల్లరు ధరణిలో,
  సంఘ మపుడు నుండు చల్లగాను

  దయయు లేక వారు దారుణంబే జేయ
  ఛీత్కరింప దగును శిష్టజనుల;
  మ్లేచ్ఛులైన గాని మెచ్చగ దగునుగా
  దయయు సత్యమవియు తాము పొంద

  రిప్లయితొలగించండి
 21. శ్రీగురుభ్యోనమ:

  ఛీత్కరించ దగును శిష్ఠ జనుల ననుచు
  నసురులెల్ల కలసి ముసురుకొనుచు
  మునుల జనుల సురుల దునుమాడు చుండగా
  నవతరించె విష్ణు వాదుకొనుచు

  రిప్లయితొలగించండి
 22. శ్రీ వసంత కిశోర్ గారికి నమస్సులు.
  విద్యాలయంలో బాధ్యతలు పెరిగాయి. Vice Principal గా ప్రమోట్ అవటం వల్ల పని వత్తిడి ఎక్కువగా ఉండి పద్య రచన కొంచెం కుంటు పడింది. మరియు ప్రస్తుతం నా శతక రచన పని ఒక కొలిక్కి రాబోతున్నది. అందువల్ల, శంకరాభరణం బ్లాగ్ రోజూ చూస్తూ ఉన్నప్పటికీ పద్య రచన మాత్రం జరగటం లేదు. మీరు నేర్పిన ఛందస్సు పాఠాలు నాకు ఇంకా గుర్తుకు ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 23. కిశోర్ జీ ! బాగానే ఉన్నాను. మీరు బాగున్నారా ? పని హెచ్చి తీరిక తగ్గింది . తీరిక దొరికితే కొద్దిగా చదువుకుంటున్నాను. మిత్రుల పూరణ లద్భుతము.

  బి.ఎస్.ఎస్. ప్రసాద్ గారూ ! నమస్సులు. " తస్కరించ స్వామి ధనము సిగ్గునొదలి " ని " తస్కరించ స్వామి ధనము సిగ్గు వదలి " అందాము.

  రిప్లయితొలగించండి