7, డిసెంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 758

కవిమిత్రులారా,

మన కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారు
ఈరోజు
నూతన గృహపవేశ మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా
వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యము(ల)ను వ్రాయండి.


నూతనగృహప్రవేశవినోదవేళ
సకలదేవతల్ గరుణతో చంద్రమౌళి
సూర్యనారాయణకు పెక్కు శుభము లొసఁగ
గా నపేక్షించు మా శుభాకాంక్ష లివియె.

17 కామెంట్‌లు:

subbarao చెప్పారు...

క్రొత్త దై నట్టి యింటికి కూర్మి తోడ
నేగు సూర్యనా రాయణ ! యిపుడ నీకు
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆ యు రారోగ్య సంపద లన్ని యిడుత

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

గౌరీశంకర కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు :

01)
____________________________________

చక్క నైనట్టి నూతన - ఛాయ యందు
సర్వసంపదల్ సమకూర్చు - సర్వకరుడు !
శాంతి సౌఖ్యము లొనగూర్చు - శాశ్వతుండు !
చంద్రమౌళికి శుభమిడున్ - జంద్రమౌళి !
____________________________________

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సోదరులు నూతన గృహప్రవేశ శుభ సందర్భముగా శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
కలకాలం సుఖంగా ఉండాలని దీవించి అక్క

A.Satyanarayana Reddy చెప్పారు...

నూతన గృహప్రవేశ శుభ సందర్భంగా మిత్రులు చంద్ర మౌళి సూర్య నారాయణ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రీ చంద్రమౌళి సూర్య నారాయణ ( సూరి అన్నాను ఏమీ అనుకోకండీ...) గారికి నూత్న గృహప్రవేశ ఉత్సవ శుభాకాంక్షలతో..


చంద్రమౌళీశు కృపనంది సవ్యముగను
సూర్య నారాయణుని దయ చొప్పడగను
భోగ భాగ్యమ్ములన్నియు పొంది " సూరి "
నూత్న గృహమందు చక్కగా నుండవలయు.

sailaja చెప్పారు...

శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి శుభాకాంక్షలతో....

నూతన గృహప్రవేశమునుజరుపుకొను
సూర్యనారాయణకవికి శుభము లొసగి
చంద్రశేఖరుడందించు సంతసమ్ము
కరుణతో,మీకుమాశుభాకాంక్ష లార్య!!!

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
గృహప్రవేశమహోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. తప్పకుండా రావాలనే అనుకున్నాను. కాని మూడు రోజులుగా నడుమునొప్పితో బాధపడుతున్నాను. ప్రయాణం చేయలేను. రాలేకున్నందుకు మన్నించండి.
మీకు, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు!
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.
****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

మిస్సన్న చెప్పారు...

భానువారము కృష్ణ పాడ్యమి భానుబింబపు దీప్తులన్
శ్రీనివాసము బోలు స్వార్జిత శ్రీకరంబగు నింటిలో
తాను కాలిడు చంద్రమౌళికి తాతయున్ హరిశంకరుల్
పూని సేమము జేయు గావుత భూరి శోభనమూర్తులై.

Unknown చెప్పారు...

చిరంజీవి చంద్రమౌళికి శుభాశీస్సులు

కలలు సాకారముగ నిల్లుగట్టినావు
ప్రేమ బంధమ్ములగు భార్యపిల్లలుండ
వలపుతలపులు నీయెద తలుపు దీయ
శాంతి సౌఖ్యము లందుము చంద్రమౌళి

కంది శంకరయ్య చెప్పారు...

మిస్సన్న గారూ,
మిత్రునకు మత్తకోకిలతో శుభాకాంక్షల పాట పాడించి అలరింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

మిస్సన్న చెప్పారు...

గురువుగారూ ధన్యవాదాలండీ.

A.Satyanarayana Reddy చెప్పారు...

సూర్య నారాయణాఖ్యుడు చొచ్చె నూత్న
గృహము నీనాడు ముదమున గేహినియును
బంధు మిత్రుల తోడుత, భగవతియును
కలుముల జవరాలు హితుని కాచు గాత

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

గురువర్యులు కంది శంకర య్యగారికి,శుభాకాంక్షలతో పద్యాలువ్రాసిన కవిమిత్రులందరికీపేరుపేరునా ధన్యవాదములు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారికి శుభాకాంక్షలతో:
సీతారాముల కృపతో
పోతనవలెపద్యరచనమోదమునీయన్!
నూతన గృహప్రవేశము
ప్రీతిగ నెరవేరి మీకు వేడుకలొసగున్!
(అనివార్యకారణాన ఆలస్యంగా)

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
సూర్యనారాయణ గారి పక్షాన ధన్యవాదాలు.