10, డిసెంబర్ 2014, బుధవారం

పద్యరచన - 761

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

subbarao చెప్పారు...

పూల గుత్తులు చేబూని పురుష దంతి
యిచ్చు చుండెను దనదైన నింతి కచట
జన్మ దినముకా బోలును జల్ల గాను
బ్రదుకు మాయను న టు లనా బగిది దోచె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మనమున తలచెను గజమట
తనువును చాలించి నంత తానగు శిలయై
తనరుచు దిరిగిన మనుజులు
కనుగానక మరలు చుండు గారవ మనకన్

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

జాలి నింత లేక జంతు ప్రదర్శకుల్
పస్తు లుంచి వాని పగలు రాత్రి
నొసలు కొట్టి బాద నూచనొకటి బట్టి
పూల గుత్తి పట్టు పోతు గజము

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

అడవిలంస్వేచ్చగ తిరుగు హస్తిదెచ్చి
వీపు లెక్కినీ మోజుకు విద్దె నేర్ప
చింత కల్గదే మనసున చిత్ర మిచట
మదపు టేనుగ బట్టగ మాల నొకటి

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఏను గురుతెరిగితిని గన
నేనుగు ప్రేమించెనొక్క నేనుగు నటుపై
కానుకగ పూలగుత్తిని
పూనిక తొండమ్ముతోడ పొగడుచు నిచ్చెన్.

Unknown చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు

విజనమ్మగు విపినమునన్
సజావుగ విహార మచట సలిపెద మనుచున్
నిజప్రేమను ప్రకటించుచు
గజరాజర్పించె పూల కానుక నిభికిన్

కంది శంకరయ్య చెప్పారు...

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అడవిలో స్వేచ్ఛగ...’ అనండి.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
***
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

మనుజుల ప్రవర్తనను తన మదిన తలచి
పుష్ప గుఛ్చము నిచ్చెను ముదముతోడ
నిభ్యకు నిభము, కరమగు యింపుగూర్చె
సుందరమ్మగు దృశ్యము చూపరులకు

మిస్సన్న చెప్పారు...

సంకష్ట హర చతుర్థిని
పొంకముగా మదగజమ్ము పూవుల చెండున్
శంకర సుతున కొసంగుచు
శంకర! శుభకామనలను చాటుట గనరే!


గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

విరులమరిన గుత్తి నిడన్
గరితొండము తోడఁ బట్ట కనువిందాయెన్!
సరసాల తలఁపు లెగయన్
గరికైనను ప్రేమఁ దెల్పు జ్ఞానమ్మొకటే!

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

sailaja చెప్పారు...

పెరిమలు మనుజులకేనా?
కరికీ వలచుట తెలుసని కన్పడె నదివో!
కరమున పూలను బట్టుకు
మురియుచు చెలి కిచ్చుచుండె పుష్కరి యచటన్!!!

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

krkr చెప్పారు...

స్నేహ హస్తము నందించు శేముషి గన
విభవ మొలి కెడి ఏనుగు విరుల జల్లు
కనక ధారలు గురిపించు కాంతి జల్లు
మేలు రాకలు తెలుపుచు పూల జల్లు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు

కంది శంకరయ్య చెప్పారు...

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.