కవిమిత్రులకు నమస్కృతులు. మా అక్కయ్యవాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. రోజంతా బ్లాగుకు అందుబాటులో లేను. ప్రయాణపు బడలిక వల్ల ఒక్కొక్కరి పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి. ఈనాటి సమస్యకు పూరణ లందించిన మిత్రులు.... చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, మిస్సన్న గారికి, రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి, పోచిరాజు సుబ్బారావు గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, మల్లెల సోమనాథ శాస్త్రి గారికి. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి, పిరాట్ల ప్రసాద్ గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారికి, శైలజ గారికి, కె. ఈశ్వరప్ప గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, రాజేశ్వరి గారి పద్యం రెండవ పాదం చివర ‘మిత్రత్వమునన్’ (గగము, సగణము) వచ్చాయి. అక్కడ గణదోషం లేదు.
లాలనగ చూచుకొనునెవ
రిప్లయితొలగించండిడాలిని మదిలోననిల్పి యపురూపముగన్
భూలోకమునట్టి కుల
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్
మాలిన్యము లేక మదిని
రిప్లయితొలగించండిమేలిమి బంగార మువలె మిత్ర త్వమునన్
శీలము గలిగిన పురుషుని
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్
లోలోపల పరమాత్ముడు
రిప్లయితొలగించండిలీలల గన తిరుగువాడు లేమలతో గో
పాలుండును బాలుండా
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భూలోకమున నట్టి’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘భూలోకమున గల కుల...’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదాన్ని ‘శీలము గలిగియును నిజ| స్త్రీలోలుడె...’ అనండి.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్రీలన శక్తికి నిలయము
రిప్లయితొలగించండిస్త్రీలన నోరిమికి తావు సిరిమూలంబౌ
స్రీలకు సాటెవ్వరు యిల
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్
లోలత లౌకిక సహజము
లోలనమున పెరుగుచుండు లోలో ప్రేమల్!
లోలాక్షుల దూఱకు, శా
స్త్రీ!లోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్!
పాలసు డగు నిల నార్యా !
రిప్లయితొలగించండిస్త్రీ లోలుడె, సజ్జనుడని చెప్పెదరు బుధుల్
బాలుర వృద్ధుల నింతుల
మేలును గాంక్షించు వాని మెప్పును దలచిన్
ఏలోకంబుననైనను
రిప్లయితొలగించండివేలుపు, నరుడైన గాని వేదోక్తముగన్
ఆలిని చేపట్టిన కుల
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్
సుబ్బారావుగారు స్వదేశానికి విచ్చేసినట్లున్నారు...
రిప్లయితొలగించండిపాలన జేయుచు సత్యము
రిప్లయితొలగించండిచాల నహింసావ్రతమున సాధువు నగుచున్
కాలము గడిపెడి యా గుణ
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్
లీలగ తెలియుచు శాస్త్రము
హేలగ విద్యల గరచియు నితరులకెలమిన్
మేలును గూర్చెడి విద్యా
స్త్రీ లోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్
రాజేశ్వరి గారి పద్యం లో రెండవపాదం లో చివర వగణం వచ్చింది అక్కడ సగణం లేదా గగణం వేస్తే సరిపోతుందని నా ఊహ .
రిప్లయితొలగించండివేళే దైనను వేశ్యా
రిప్లయితొలగించండిలోలుండౌ పుండరీకు రోయక, దలుచన్
మేలెంచ పాండు రంగడు
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్.
రిప్లయితొలగించండిఏలోకపు ధర్మము సరి
యాలోకమ్మునకు నెపుడు నవలోకింపన్
భూలోకము నందున నిజ
స్త్రీ లోలుఁడె సజ్జనుఁడని చెప్పుదురు బుధుల్
ఆలిని ప్రేమగ జూచుచు
రిప్లయితొలగించండిమేలిమి బంగారమనుచు మెచ్చుచు నెపుడున్
తాలిమి తోమసలు కుల
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్!!!
స్రీలోలుడె|శ్రీకృష్ణుడు
రిప్లయితొలగించండికాలానికితగినరీతి-కాంక్షలుదీర్చే
మేలైనదైవమిలలో
స్రీలోలుడెసజ్జనుడనిచెప్పెదరుబుధుల్
ఏలోపములేకున్నను
కాలమునకు,కల్పనలకు-కామితమొసగే
వేలానికితలయొగ్గని
స్రీలోలుడెసజ్జనుడనిచెప్పెదరుబుధుల్
పాలును వెన్నయు దొంగిలి
రిప్లయితొలగించండిబాలురకున్ పంచిపెట్టి బాధను తీర్చెన్
లీలగ కృష్ణుఁడు గోప
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమా అక్కయ్యవాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. రోజంతా బ్లాగుకు అందుబాటులో లేను. ప్రయాణపు బడలిక వల్ల ఒక్కొక్కరి పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
ఈనాటి సమస్యకు పూరణ లందించిన మిత్రులు....
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
మిస్సన్న గారికి,
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
పిరాట్ల ప్రసాద్ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారికి,
శైలజ గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
రాజేశ్వరి గారి పద్యం రెండవ పాదం చివర ‘మిత్రత్వమునన్’ (గగము, సగణము) వచ్చాయి. అక్కడ గణదోషం లేదు.
కం.పాలగు దుర్వ్యసనములతొ
రిప్లయితొలగించండితేలిన ఘనమైనవారి తీరులుకన్నన్
మేలుకొనిమోక్షమందిన
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్.
మేలగు చాకలి దొరకక
రిప్లయితొలగించండినూలువి షర్టులను ప్యాంట్ల నొత్తుచు తానే
కాలరు నెత్తుకొనిన "యి
స్త్రీ" లోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్
ఖాళీ పాకెటు తోడను
రిప్లయితొలగించండిజాలీగా తిరుగుచుండి జవరాల్ వెంటన్
కాలరెపుడు నలుగని యి
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్