8, మార్చి 2015, ఆదివారం

పద్యరచన - 842

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. టక్కరిబుద్ధితోడ శకటాసురుడాపసికృష్ణుజేరి తా
    మిక్కిలిశక్తితో విసరె బండిని బాలునిపైకి యంతటన్
    గ్రక్కున కాలితోడ హరి రాక్షసుపై శకటంబుతన్నగన్
    క్రక్కుచురక్తమున్ భువికి వ్రాలెను దైత్యుడు బొబ్బపెట్టుచున్

    రిప్లయితొలగించండి
  2. పాలనిచ్చి యశోదతా బాలకృష్ణు
    యెండ తగులనీయక నొక బండిక్రింద
    చక్కని పడక పైనుంచి చనగ పనికి
    బాలకుని కాలితాపున వ్రయ్యలయ్యి
    శకట మంబరవీధికి చయ్యనెగయ
    శకటమందలి యసురుడు చచ్చిపడియె
    వింతగనివ్రేతలు యశోద విస్తుపోవ
    బాల కృష్ణుని లీలల పలుకతరమె

    రిప్లయితొలగించండి
  3. ఊయల యందున బాలుడు
    మాయల భండా సురునెటుల మహిమగ జంపెన్
    గాయములు తగుల నందున
    హాయిగ ముదమందె యశోద హాహా యనుచున్

    రిప్లయితొలగించండి
  4. శకటపు రూపున యసురుం
    డకటకటా చంపబూన నానంద సుతుం
    డొకకాలి తోడ తన్నగ
    వికటమ్ముగ నరచి జచ్చె, వెన్నుడు నవ్వెన్.


    రిప్లయితొలగించండి
  5. శకట రూపాన నసురుడు సరగు చేర
    కృష్ణు జంపగ, నంతట కేళి వలెను
    తాపు తన్నగ చచ్చెను తక్ష ణం బె
    దుష్ట శిక్షణ యాతని కిష్టము గద

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘బాలకృష్ణు| నెండ....’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘హాయిగ నవ్వెను యశోద...’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘రూపున నసురుం...’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. దురితాలోచన తత్పరుండయి మహా దుష్టుండు కంసుండు నన్
    పరిమార్చన్ శకటాసరాధముని తాఁ బంపించగా గాంచి దా
    పరికావృత్తి మహోగ్రభీషణముగా వారించి నిర్మూలనా
    తురతన్ సంహరణంబొనర్చె నిజసంతోషాత్ముఁడై కృష్ణుఁడున్

    రిప్లయితొలగించండి
  8. శకటాసురసంహారము
    శకగాశ్రీకృష్ణలీలచక్కగజూపన్
    కకవికలతకంసునిమది
    వికటించెను-వినగవార్త|వేదననొసగెన్|

    రిప్లయితొలగించండి
  9. మాస్టారూ ! రెండవ పాదం యతి తప్పింది ... సవరించిన పద్యం
    టక్కరిబుద్ధితోడ శకటాసురుడంతట కృష్ణుజేరి తా
    మిక్కిలిశక్తితోడ హరిమీద పడెన్ వెస తాను బండిగా
    గ్రక్కునతన్ని పాదమున రాక్షసునిన్ తెగడార్ప బాలుడున్
    క్రక్కుచురక్తమున్ భువికి వ్రాలెను దైత్యుడు బొబ్బపెట్టుచున్

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    నేను గమనించని దోషాన్ని సవరించుకున్నందుకు సంతోషం. సవరణ బాగున్నది.

    రిప్లయితొలగించండి
  11. మాస్టరు గారూ ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...


    శకటపు రూపున నసురుం
    డకటకటా చంపబూన నానంద సుతుం
    డొకకాలి తోడ తన్నగ
    వికటమ్ముగ నరచి జచ్చె, వెన్నుడు నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  12. నిన్నటి పద్య రచన :

    ఉప్పును కారము సోకిన
    వప్పల నూరంగ నూట పచ్చడి! లోనన్
    గొప్పగ జాడీ నిండెనొ?
    కుప్పెకు పై నూరినట్లు గోచర మాయెన్!

    నేటి పద్య రచన :

    వికసిత మోమున దనరెడు
    సకలాత్ముని, బాలమురళి, సర్వోన్నతునా
    యకుతో భయుఁ గూల్చ దలఁచ
    శకటాసురు జంపె నింగి శకలము లెగురన్!



    రిప్లయితొలగించండి
  13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. బాలుఁడకట! శకటాసురు
    పాలినిఁ బడె, కావరమ్మ! బాధలకోర్వన్
    చాలదు ప్రాయము; నేటికి
    కాలమ్మిట్టులరుదెంచె, గనలేనమ్మా!

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి