24, మార్చి 2015, మంగళవారం

పద్య రచన - 858

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“ఆకాశ రామన్న”

16 కామెంట్‌లు:

 1. తమ యునికిని తెలుపక వివ
  రముగ పరుల గురిచి యుత్తరమ్ముల యందున్
  శ్రమ యనుకొన కుండ రహ
  స్యములను చక్కంగ తెల్పు నాసందముగా

  రిప్లయితొలగించండి
 2. హంస రాయ బార మాకాశ రామన్న
  నలుని ప్రేమ కబురు నయము గాను
  వలపు శృంఖ లమ్ము నలదమ యంతికి
  విన్న వించె గాన నివ్వ టిల్లె

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అక్కయ్యా,
  పద్యం బాగుంది. అభినందనలు.
  కాని నలదమయంతుల కథలో హంసరాయబార ఘట్టంలో ఈ ఆకాశరామన్న ఎక్కుడినుంచి వచ్చాడు?

  రిప్లయితొలగించండి
 4. పెల్లు నాకాశ రామన్న పేరుమీద
  లేఖలన్ వ్రాయుచున్నట్టి లేకి వారు
  యెదిరి నిజము వచించని బెదురు గొడ్లు
  తోటివారిని సతతము దూరుచుంద్రు

  రిప్లయితొలగించండి
 5. గురువుగారు,
  మీ పద్యాలను స్పష్టంగా వినలేక పోయినాను. మళ్ళీ ప్రయత్నిస్తాను.

  పేరులేని యట్లు వింత పేర్లనుఁ బొంది
  వ్రాయుచుండు జనుల వాసి యున్న
  పేరు మ్రోగి పోయు పేర్మిఁ గలుగు గాదె
  " యూకదంపుడ"య్యు నుర్వి వెలిగె.

  ఊకదంపుడు అనే పేరు తో రామకృష్ణ కవిగారు ఉత్తమమైన పూరణలు చేసేవారిలో ఒకరు.
  వారి పేరు కలిపి పద్యం వ్రాసిన దుస్సాహసానికి మన్నింపబడెదను గాక.

  రిప్లయితొలగించండి
 6. వచ్చు నుత్తర ములుమఱి హెచ్చు గాను
  గనగ నాకాశ రామన్న యనుచు మిగుల
  తప్పు చేసెడు వారల యొప్పు గోరి
  వినిన రక్షింప బడుదురు వినని యెడల
  శిక్ష యేగతి యగునార్య ! కక్ష తోడ

  రిప్లయితొలగించండి
 7. నేను పైన వ్రాసిన పద్యం పద్యాంశాన్ని సరిగ్గ ప్రతిపాదించినట్టు అనిపించలేదు.

  మరొక పద్యం.

  మంచి కోరు జనులు మారు పేర్లనిడుచో
  మేలు చేయఁదలచి మిణుకునట్లు.
  చెడునుఁ జేయఁ బూని చిత్తమందున పేరు
  లేక వ్రాయు వారు లేకపోరు.

  మిణుకు=భయపడు

  రిప్లయితొలగించండి
 8. పెళ్లికూతురిఁ దిట్టి పెళ్లాడ వద్దని
  ఆకాశరామన్న కేకఁ బెట్టు
  యోగ్యత లేదని యుద్యోగమేదని
  ఆకాశరామన్న శాకఁ బెట్టు
  కార్యాలయపు విధుల్ కాలరాశాడని
  ఆకాశరామన్న యగ్గిఁ బెట్టు
  నిధులను గాజేసి నీరుగార్చిరనుచు
  ఆకాశరామన్న యర్జిఁ బెట్టు

  తే.గీ. శుభములు జరుగనీయని శుంఠ వాడె
  ప్రభుత మేల్కొన జేసెడు బాధ్యుడతడె
  యందరి మదుల నొకమారు నవతరించు
  నమరు డాకాశరామన్న యవని పైన!

  రిప్లయితొలగించండి
 9. గురువులకు నమస్కారములు
  రాయబారమును ఆకాశవీధిలో విహరిస్తూ పట్టుకెడుతుందికదా అందుకని హంసఏ ఆకాశరామన్న అన్నమాట అని నాఉద్దేశ్యం

  రిప్లయితొలగించండి
 10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘ఊకదంపుడు’ గారు సరే... ‘మిస్సన్న’ గారిని మరిచిపోయారు. ‘మనతెలుగు’ గారు కూడా ఉన్నారు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  ఆకాశరామన్న గురించిన సమగ్ర సమాచారంతో మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. ఆకాశమ్మునవాయుమార్గమునసాక్ష్యంబేమిజూపించకే
  సాకారమ్మునుగూర్చుప్రేమకొరకైవిశ్వాసమ్మునన్వ్రాయుచున్
  లోకాబీష్టముగాకవేరుగనుఆలోచించన్సదాలోపంబునన్
  మీకందించెడినుత్తరంబదియెసామీప్యానలౌక్యంబుగన్|

  రిప్లయితొలగించండి
 12. నేలకుచత్రమట్లుగను,నేర్పుగబండిననీలిరంగుచే
  పాలనజేసి,చుక్కలకుపట్టునుగూర్చుచుసూర్యనిప్పునే
  పేలకజేసి గాలియును,వేడి సురక్షితరక్షమార్గమున్
  కాలము కందునట్లుపదకమ్ముగనీరునుజేర్చుభూమికిన్

  రిప్లయితొలగించండి
 13. గురువుగారు, ధన్యవాదాలు.
  ఔను, మిస్సన్న గారి పేరు స్వంతపేరే అనుకున్నాను చాలా రోజులవరకూ. తర్వాత తెలిసింది.
  మనతెలుగు వారు అప్పుడప్పుడూ పేరు చెప్తూ ఉంటారు.

  రిప్లయితొలగించండి
 14. ఆకాశపు గాలి కబురు
  లేకముగా తెల్పుచుండు లేఖల యందున్
  ఆకాశమింటి పేరున
  రాకాచంద్రుండు యైన రామన పేరన్

  రిప్లయితొలగించండి