11, మార్చి 2015, బుధవారం

పద్యరచన - 845

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. దద్దమ్మగ ననుజూడకు
  మద్దమ్మది తెచ్చినాను మంచిదెసుమ్మా
  వృద్దత్వము దరిజేరెను
  ముద్దుల నీమోమునందు ముడుతలు గనుమా

  రిప్లయితొలగించండి
 2. కం. ముగిసెను యవ్వన చాయలు
  ముగమేమోముడుతలోచ్చి ముడుచుకు పోయెన్
  మొగుడేయద్దముతెచ్చిన
  మగువా నీయందచందమంతయువడలెన్.

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఒచ్చి (వచ్చి), మొగుడు (మగడు)’ అని గ్రామ్యశబ్దాలను ప్రయోగించారు. ‘మొగమేమొ ముడుతలు వచ్చి ముడుచుకు పోయెన్| మగడే...’ అనండి.

  రిప్లయితొలగించండి
 4. గురువుగారు మీరు చెప్పిన విధంగా మరచినాను కాకపొతే రెండవపాదం లో ముడుతలు అని బహువచనం వేయాలని కోరికతో "ముదతలోచ్చి" అన్న ప్రయోగాన్ని "ముడుతలు" గా మార్చాను చూసి మీ అభిప్రాయం తెలుపగలరు."మొగుడు" ని "మగడు" గా మార్చినాను.

  కం. ముగిసెను యవ్వన చాయలు
  ముగమేమోముడుతలుపడి ముడుచుకు పోయెన్
  మగడేయద్దముతెచ్చిన
  మగువా నీయందచందమంతయువడలెన్.

  రిప్లయితొలగించండి
 5. బుద్ధులు మారెను నీకట
  వృద్ధాప్యము దాచ నెంచి వేదన పడగన్
  సిద్ధించదు ముకురమందున
  బుద్ధిని మరలించి గనుము ముసలి తనంబున్

  రిప్లయితొలగించండి
 6. నారంభా నా యూర్వసి
  చేరంగా రావెయంచు చెంతనె రోజున్
  తీరుగ జెప్పి యబద్ధము
  మీరే మోసమ్ముజేయ మేలా ! తెలిసెన్.

  రిప్లయితొలగించండి
 7. అద్దమేరీతి తెచ్చితి వయ్య నీవు
  చూచి తెచ్చితివో లేక చూడ లేదొ
  ముసలి ముడుతలు గనిపించె మోము నందు
  ననుచు మగనిని దిట్టె గయ్యాళి సాధ్వి!

  రిప్లయితొలగించండి
 8. అవ్వ తనమోము జూచుచు నద్దమందు
  ముడుత ముడుతలు గానుండ , ముసలి ముండ
  వోలె గన్పడు చుంటిని భూరి గాను
  ననుచు వాపోవు చుండెను దనదు భర్త
  యొద్ద కూర్చుండి ముదుసలి తద్దయు నట

  రిప్లయితొలగించండి
 9. పెరిగిన తన వయస్సును సరకుగొనక
  మొగడు తెచ్చిన యద్దముఁ దెగడుచుండె
  ముదిమివయసున జంటలు మోదమొంద
  విరసమే వారి కిసతము సరసమగును

  రిప్లయితొలగించండి
 10. అద్ద మునజూచి బూదండ దిద్దుకొనుచు
  ముసలి ముడుతలు గనిపింప మోము నందు
  పాడు ముకురమ్ము గొనిదెచ్చె పతియనంచు
  వాదు లాడుచు నుండె నా బామ్మ గారు !!!

  రిప్లయితొలగించండి


 11. మంచి యద్దము కాదిది మగడ ! నీవు
  తెచ్చి యిచ్చిన దీ యది తేరి జూడ
  ముసలి దానిగా గనబడె ముఖము నా ది
  యేల దెచ్చితి విటువంటి బోల సరుకు

  రిప్లయితొలగించండి
 12. అద్దముఁ దెచ్చిన నేనే
  వద్దన్నను పెద్ద వారు వదలక నిన్నే
  దద్దమ్మై పెళ్లాడితి!
  నద్దము లేనాడు జూపు నసలునె భామా!

  రిప్లయితొలగించండి
 13. మగని యంధత్వ మీరీతి తెగడె భార్య
  స్వీయ సౌందర్య వాంఛతో వాయి పోవ,
  నసలు సంగతి గ్రహియించి ముసలి భార్య
  నేమి యనలేక యుండె కునిష్టి మగడు

  రిప్లయితొలగించండి
 14. కళ్ళు నీకెప్పుడు సరిగ కానరావు
  పిచ్చి యద్దముఁ గొని నాకు నిచ్చినావు
  ముసలిదానిగ నుంటిని ముకురమందు
  గొంతుఁగోసెను మానన్న కూర్చినిన్ను

  రిప్లయితొలగించండి
 15. ఈనాటి వ్యంగ్యచిత్రంపై స్పందించి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు....
  రాజేశ్వరి అక్కయ్యకు,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  కుమార్ గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  శైలజ గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి