వృక్షమ్మే ఘన రక్ష ధారుణికి నే వేళైన ప్రాణమ్ములన్ వృక్షమ్మే నిలుపంగ గాలి నిడి ప్రావృట్టున్ జేయగా మానవా! వృక్షమ్మే గద భావిసంతతులు జీవింపంగ కాపాడవో వృక్షో రక్షతి రక్షితమ్మను మహా విజ్ఞాన మీ వెన్నవే.
వృక్షమ్మే ఘన రక్ష ధారుణికి నే వేళైన ప్రాణమ్ములన్ వృక్షమ్మే నిలుపంగ గాలి నిడి ప్రావృట్ జేయగా మానవా! వృక్షమ్మే గద భావిసంతతులు జీవింపంగ కాపాడవో వృక్షో రక్షతి రక్షితమ్మను మహా విజ్ఞాన మీ వెన్నవే.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చెట్లవెన్నొ’ అంటే అన్వయం కుదురుతుంది. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘తతని నధిక...’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘పిడికిలి+అందు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘పెరుగసాగెను పిడికిట వృక్ష మదియె’ అనండి. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం. ‘ప్రావృట్టున్ దగం జేయఁగా’ అనండి. మీ సవరణను ఇప్పుడే చూశాను. తెలుగులో ‘ప్రావృట్’ అని హలంతంగా ప్రయోగించరాదు కాదా! ‘న్స’ ప్రాసతో మీ రెండవ పద్యం బాగున్నది. కాకుంటే వ్యావహారిక పాదాలున్నాయి. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, ధన్యవాదాలు.
వృక్షంబులంతరించిన
రిప్లయితొలగించండితక్షణమే జీవులెల్ల తప్పక చచ్చున్
రక్షించ వేడుకొందు వి
చక్షణ తో చెట్ల ధరణి జనులందరినిన్
అరచేతను స్వర్గంబట
రిప్లయితొలగించండిపొరబా టునగాంచి నంత పూసెడి తరువుల్
సరసము గబెంచ నిపుణులు
మరుగుజ్జగు చెట్ల నెన్నొ మహిమాన్వితమౌ
చేతనిమడ నరుడు చేయును గద గొప్ప
రిప్లయితొలగించండివస్తు తతిని యధిక ఫలములీయ
అధిక ఫలములిచ్చు నావృక్ష రాజమ్ము
చేతనిమడజేయ చేటు గాద.
చిత్ర మచ్చట జూడగ జిత్ర మయ్యె
రిప్లయితొలగించండిబెరుగ సాగెను వృక్షము పిడికి లందు
చూడ నేపుగ నవనవ లాడుచుండె
నమ్మ బుద్ధిగా లేదది నాకు సామి !
వృక్షములను బోషించిన
రిప్లయితొలగించండిచక్షువులకు హాయిగూర్చి జగతిని గాచున్
రక్షణనొసగెడు వాటిని
తక్షణమే బెంచవలయు ధరనెల్లెడలన్!!!
మఱ్ఱి వృక్షములను మరిగుజ్జుగా మార్చు
రిప్లయితొలగించండివిద్య పెరిగె నేడు విశ్వమందు
ప్రజ్ఞ తోడ నేడు ప్రకృతిని గెలువగ
పయనమౌచునుండ్రి ప్రజలువేగ
వృక్షమ్మే ఘన రక్ష ధారుణికి నే వేళైన ప్రాణమ్ములన్
రిప్లయితొలగించండివృక్షమ్మే నిలుపంగ గాలి నిడి ప్రావృట్టున్ జేయగా మానవా!
వృక్షమ్మే గద భావిసంతతులు జీవింపంగ కాపాడవో
వృక్షో రక్షతి రక్షితమ్మను మహా విజ్ఞాన మీ వెన్నవే.
మిస్సన్న గారు మీ పద్యం బాగుంది కాకపొతే రెండవ పాదం లో చివరి మూడు గణాలు భంగంయ్యాయి .కావలసినవి "త త గ " వున్నవి "మ య వ" దయచేసి సరిచేయగలరు.
రిప్లయితొలగించండిబోన్సాయ్ మొక్కను జూచిన
రిప్లయితొలగించండిమన్సాయెను పెంచ నాకు మామిడి మొక్కా?
పన్సా? మర్రియ? రావియ?
మున్సబు గారిచ్చి నార ముద్దుగ నీకై?
(సరదాగా)
రిప్లయితొలగించండివృక్షమ్మే ఘన రక్ష ధారుణికి నే వేళైన ప్రాణమ్ములన్
వృక్షమ్మే నిలుపంగ గాలి నిడి ప్రావృట్ జేయగా మానవా!
వృక్షమ్మే గద భావిసంతతులు జీవింపంగ కాపాడవో
వృక్షో రక్షతి రక్షితమ్మను మహా విజ్ఞాన మీ వెన్నవే.
(పిరాట్ల ప్రసాద్ గారికి ధన్యవాదములతో)
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చెట్లవెన్నొ’ అంటే అన్వయం కుదురుతుంది.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తతని నధిక...’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పిడికిలి+అందు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘పెరుగసాగెను పిడికిట వృక్ష మదియె’ అనండి.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘ప్రావృట్టున్ దగం జేయఁగా’ అనండి. మీ సవరణను ఇప్పుడే చూశాను. తెలుగులో ‘ప్రావృట్’ అని హలంతంగా ప్రయోగించరాదు కాదా!
‘న్స’ ప్రాసతో మీ రెండవ పద్యం బాగున్నది. కాకుంటే వ్యావహారిక పాదాలున్నాయి.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.
కొరగామి నేత లందరు
రిప్లయితొలగించండిఅర చేతిని స్వర్గ మిదిగొ యని చూపించన్
వరులైన శాస్త్రవేత్తలు
అరచేతిని వృక్ష మిదిగొ యని చూపిరహో
Guruvugaaroo dhanyavaadaalu. Doshaanni chakkagaa sarididdinanduku krutajnatalu.
రిప్లయితొలగించండికెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు...మీ సూచనతో...
రిప్లయితొలగించండిచేతనిమడ నరుడు చేయును గద గొప్ప
వస్తు తతిని నధిక ఫలములీయ
అధిక ఫలములిచ్చు నావృక్ష రాజమ్ము
చేతనిమడ జేయ చేటు గాద.