కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘సీతారాములు’ అని సమాసం చేయాలి కదా... అక్కడ ‘పెంచిరి సీతయు రామచంద్రులే’ అనండి. రెండవ పద్యం మొదటి పాదం చివర ఒక గురువు తక్కువయింది. ‘వోడగ, వోర్పున’ అన్నారు. వు,వూ,వొ,వో లతో మొదలయ్యే తెలుగు పదాలు లేవు. ఆ పాదాన్ని తగువిధంగా మార్చండి. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘మిన్న+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
shankararya!
రిప్లయితొలగించండిసకల శుభ ములు గలిగించు శంకరుండు
ఆయు రా రోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
మూడు మంగళ సూత్రముల్ ముచ్చట గను
రిప్లయితొలగించండిగట్టె రాముడు సీతకు బిట్టు గాను
పెళ్లి రోజుకా రణముగా బెద్ద లెదుట
మంగ ళ మగును మనకది మాన్యు లార
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పెద్దల+ఎదుట’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘పెద్ద లలర’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమంగళ సత్రముఁ జూపుచు
రిప్లయితొలగించండినంగన సీతకు రఘువరు నాథుని జేయన్
మంగళ కరమని దీర్తురు
సింగారపు యొంటి మిట్ట క్షేత్రము నందున్!
(మంగళ కరమని జగతికి
సింగారపు భద్రగిరిన సేవించదరే!)
(సింగారపు రామ తీర్థ క్షేత్రము నందున్)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ బహుళార్థసాధక పద్యం బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. అందరూ మనవారలే గదండీ!
రిప్లయితొలగించండిరామునిభక్తిసంపదను రాష్ట్రములా విడగొట్టిపంచినన్
రిప్లయితొలగించండిప్రేమ,పరోపకారమునుపెంచిరినేడిల సీతరాములే|
క్షెమమొసంగుపెళ్లియన?సిద్దులు,యోగులుసంతసింపగా
కోమలి సీతపెళ్లిమనకోరికజేసెను దేవళంబునన్|
చూడగ రామలగ్నమును-సూర్యుడునాతురచేతరాగ?
రిప్లయితొలగించండినీడగుపెళ్లిపందిరి కనీసపుచూపుకు నోచుకోకనే
వొడగ?శాస్త్రయుక్తమున|వోర్పునభక్తులె సీతరాములన్
జోడిగ మార్చుతాళి మనసొప్పగ సీతకుగట్టెరాముడే|
అన్నుల మిన్నగు సీతకు
రిప్లయితొలగించండిమిన్నగు శుభలగ్నమందు మేదిని యందున్
చెన్నుడు శ్రీరామునితో
కన్నుల పండువగ జరిగె కల్యాణంబే !!!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘సీతారాములు’ అని సమాసం చేయాలి కదా... అక్కడ ‘పెంచిరి సీతయు రామచంద్రులే’ అనండి.
రెండవ పద్యం మొదటి పాదం చివర ఒక గురువు తక్కువయింది. ‘వోడగ, వోర్పున’ అన్నారు. వు,వూ,వొ,వో లతో మొదలయ్యే తెలుగు పదాలు లేవు. ఆ పాదాన్ని తగువిధంగా మార్చండి.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మిన్న+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామునకు సీతతోడుత రామ మంది
రిప్లయితొలగించండిరమున జరిగె వివాహము రమణతోడ
పసిడి మంగళ సూత్రముల్ వరలు చుండ
ప్రజలు తనిసిరి కాంచి భద్రాద్రిలోన
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది.అభినందనలు.