27, మార్చి 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1633 (ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్.

22 కామెంట్‌లు:

 1. విడువక కూర్చుండెను వె
  న్నడి ప్రవరుఁడు పాదలేపనము వద్దనె - సి
  ద్ధుఁ డొసంగవచ్చినన్
  కడుముదమున్ పూయమనుచు కాలును జాపెన్
  (మాష్టారూ!వృత్తం వ్రాసే సమయం లేదు...ఎలాగోలా ఉత్తీర్ణుణ్ణి చేయండి)

  రిప్లయితొలగించండి
 2. ప్రవరుడు పాదలేపన మువద్దనె సిద్ధుఁడొసంగి వచ్చినన్
  నవరస భావమందున హిమాద్రిశిఖాగ్ర ముజేరి సౌరులన్
  పవన పరీమళంబులగు పాటలగంధి వరూధి నిన్ గనన్
  వివధ ముతానుమైమర చివేడెనుత్రోవ నెరుంగ పావకిన్

  నా.....ఈ.... పద్యము...... ప్రవరుడి...... అదృష్టము

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి గారు, పద్యం బాగుంది ఒక చిన్న వివరణ మీపద్యం లో రెండవ పాదం లో యతి కుదరడం లేదు "న" కి "మా " ఒప్పదు . బహుసా typing error ఏమో సరిచేయగలరు.

  రిప్లయితొలగించండి
 4. ఎవరికి నైన సంభవమె యిప్పుడు చూడగ మంచుకొండలన్
  పవనరథమ్ములో నరుగ భాగ్య మదేమి గణింప నో యతీ!
  వివరము లిందు చూడు డని వేడుక జాలము చూపె నేటి యో
  ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్.

  రిప్లయితొలగించండి
 5. చం.దివితలపించువెండినగదీప్తులసోయగమంతయున్ గనన్
  నవయువమన్మథుండుసురనందనసౌరభదివ్యమోహమం
  దవసరమైనసాధనమునంతనిశాంతప్రశాంతచిత్తుడై
  ప్రవరుడు పాదలేపనమువద్దనెసిద్ధుఁడొసంగి వచ్చినన్.

  రిప్లయితొలగించండి
 6. అవసరమన్నచో తగిననౌషదమట్లుగపుయగానె?నీ
  వివరములన్నియున్దెలిపి,విజ్ఞునిజేయును|ఇదువేలకే
  దివివరులెంచుపద్ధతిన తీర్చినలేపనమన్న|విన్న వి
  ప్రవరుడుపాదలేపనము వద్దనె సిద్దుడొసంగవచ్చినన్

  రిప్లయితొలగించండి
 7. "జవమున తానుచేర్చునిది చాలగ కోరిన చోటు కెల్లెడన్
  భవుకము గూర్చునియ్యదియ బాపడ!"యన్నను,నగ్నికార్యమీ
  భవనము నందుచేయుమని పాపము గల్గును నంచు చెప్పుచున్
  ప్రవరుడు పాదలేపనము వద్దనె సిద్ధుడొసంగ వచ్చినన్

  ప్రవరుడు నాడు ఛాందసుడు,బాగగురీతిన నిల్లుచేరునా
  భవులకు పూజసల్పియును పాదము లొత్తును నేటికాలమా
  ప్రవరుడె సిద్ధు కోరడుగ వాయువిమానపు యానమెంచియున్
  ప్రవరుడు పాదలేపమును వద్దనె సిద్ధుడొసంగవచ్చినన్

  భవమగురీతి పెండ్లియయి భార్యయు తోదుగనేగుచుండ రే
  జవము విమానమందునను,సంబరమొప్పగ ప్రేమయాత్రకున్
  నవమగు కాలమీ ప్రవరునాకసముంగొను సాధనుండగా
  ప్రవరుడు పాదలేపమును వద్దనె సిద్ధుడొసంగ వచ్చినన్

  ప్రవరుడు పాదలేపమును వద్దనె సిద్ధుడొసంగవచ్చినన్
  భవమగుశాస్త్రవిజ్జతను పాలనజేయుచు"మాయమర్మముల్
  నవమగు కాలమందునను నమ్మ"నటంచు నవీనకాలమౌ
  ప్రవరుడుతీర్ధయాత్రలను పట్టక,చేయును ప్రేమయాత్రలన్

  రిప్లయితొలగించండి
 8. తడబడుచుతూలి పడ నటు
  నడు ప్రవరుడు పాదలేపనము వద్దనె,సి
  ద్ధుడొసంగ వచ్చినన్! గడ
  బిడలన్ తెరదించు మనియె విసిగిన నటుడున్!

  రిప్లయితొలగించండి
 9. ప్రవరుడి కట్టుబొట్టుగన పద్ధతులన్నియు సాంప్రదాయమై
  సవరణలేనిసంస్కృతినిసాకెడి విద్యవివేకమున్న?"నీ
  కవసరమున్నకన్యకను గాంతువుజూడమటన్న?విన్న వి
  ప్రవరుడు పాదలేపనమువద్దనె సిద్దు డొసంగవచ్చినన్|.

  రిప్లయితొలగించండి
 10. చం.నవహిమవన్నగాంతరవనాంతరపూర్వమనంతసోయగం
  దివితలపించురీతిగసుతీర్ధపునీతసుగంధ ప్రాంగణం
  బవసరమేమిఇవ్వలశివాశ్రయముండ గభారమేమనా
  ప్రవరుడు పాదలేపనమువద్దనెసిద్ధుఁడొసంగి వచ్చినన్.

  రిప్లయితొలగించండి
 11. కవనములందునిచ్ఛనిడి కావ్యమునా మనుచారియిత్రమున్
  నవయుగమందు నొద్దికగ నైష్ఠ్యము తోడ పఠించె; కేశవా,
  శివశివ! యెట్టి తప్పిదము చేసెననెన్; నిజ స్వప్నమందు వి
  ప్రవరుఁడు 'పాదలేపనము వద్ద' నె సిద్ధుఁ డొసంగవచ్చినన్

  రిప్లయితొలగించండి
 12. నవయుగ శాస్త్రవేత్తలధునాతన యంత్రము లెన్నొ క్రొత్తగా
  వివధమునన్ సరించు నతివేగపు యానములెన్నొ జేయగా
  వివరము లన్నిదెల్సిన వివేకియు, ధీమతి, హేతువాదియౌ
  ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్!

  రిప్లయితొలగించండి
 13. ప్రవరుఁడు పాదలేపనము పాదముక్రిందను పూసి చేరెగా
  జవజవ మంచు కొండలను,జవ్వని చేతికి చిక్కి స్రొక్కెగా
  శివ శివ ! చేర యింటికిని చిత్రము నిద్రను స్వప్నమందునన్
  ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్

  రిప్లయితొలగించండి
 14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. ముఖ్యంగా చంపకమాల పాదాన్ని కందంలో సర్దిన మీ నైపుణ్యం, ‘వద్దనె’ శబ్దంతో చేసిన చమత్కారం ప్రశంసనీయాలు. అభినందనలు.
  మూడవ పాదంలో రెండుమాత్రలు తక్కువయ్యాయి. ‘సి|ద్ధుఁ డొసంగ వచ్చినన్ దాఁ| గడుముదమునఁ బూయుమనుచు...’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  పద్యం కొంతవరకు బాగుంది. సమస్య పరిష్కరింపబడలేదు. ప్రసాద్ గారు చెప్పినట్లు రెండవపాదంలో యతి తప్పింది.
  *
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  ధన్యవాదాలు.
  పూరణార్థం చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
  కాని సమస్య సమర్థంగా పూరింపబడలేదు. ‘ఒసంగ వచ్చినన్’ అని ఉంటే ‘మీరు ఒసంగి వచ్చినన్’ అన్నారు.
  మీ రెండవ పూరణ బాగుంది.
  *****
  మిస్సన్న గారూ,
  మీ ఆధునిక ప్రవరుని పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఒక’ను ‘ఓ’ అన్నారు. ‘చూపినట్టి యీ| ప్రవరుడు...’ అనండి.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  చాలా మంచి పూరణ చేసారు. అభినందనలు.
  కాని ప్రవరుడు పాదలేపనం వద్దనలేదే!
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  కందంలో మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.
  రెండవ పాదంలో ‘నడు’కు అన్వయం, అర్థం?
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మనుచారియిత్రమున్’ అన్నచోట ‘మనుసంభవమ్మునన్’ అనండి.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. ధన్యవాదాలు గురువుగారు. అది కేవలం typing error గా పరిగణించండి. ఒసంగ బదులు ఒసంగి అని వచ్చింది. మీరు ఒసంగ అనే తీసుకోండి.
  అప్పుడు అర్ధం ఏమి పోదని నా ఊహ.

  ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 16. గురువుగారూ ముందు చూపె నేటి అనే వ్రాశాని. కాని తర్వాత ఓ అని మార్చాను. సూచనకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. గురుదేవులకు ధన్యవాదములు.
  అటు నడు = అటువైపునకు నడిచే అన్న భావం రాదాండీ?

  రిప్లయితొలగించండి
 18. దివిపయనంబు నేడు కడు తేలికయయ్యెను భూతలమ్ముపై
  వివిధములైన శోధనలు విశ్వసితమ్ముగ సల్పు చుండుటన్
  నవయుగ మందు నాకస మునన్ పయనించెడునేటివిజ్ఞుడౌ
  ప్రవరుడు పాదలేపనము వద్దనె సిద్ధుడొసంగవచ్చినన్

  రిప్లయితొలగించండి
 19. సవరణ జేసి భాషణల చక్కని రీతిని రోజురోజునన్
  పవరును కోరి మార్చి భళి పండుగ జేయుచు పార్టిలన్నిటిన్
  జవురుచు సీట్ల నిచ్చటను జంబము మీరగ ముఖ్యమంత్రియై
  ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్

  రిప్లయితొలగించండి
 20. నవులుచునుండి బాదముల నాలుగు కోరలు కోలుపోవగా
  చివరవి నాల్గు దంతములు చీకుడు పళ్ళను పీకివేయగా
  చవిగొనలేక యాత్రలను జానువు కీళ్ళను తీపులెచ్చగా
  ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్

  రిప్లయితొలగించండి