అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. టైపాట్లు రాకుండా చూడండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం ఎంకిపాటలా మనోహరంగా ఉంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండవ, మూడవ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** పి.యస్.ఆర్. మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘పోతివి+ఏదూర’ అన్నప్పుడు నుగామం రాదు. ‘పోతివా యేదూర...’ అనండి. ***** మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నీరాకకు నే వేచితి
రిప్లయితొలగించండిభారమ్మయ్యె బ్రతుకిచట వద్దికమనకా
దూరాభారపు కొలువులు
దూరమ్ముగనుండి యేల దొసగు భరించన్
గోడమీద భామ గోప్యంగ చింతించే
రిప్లయితొలగించండిమనుసులోని బాధ మాటరాక
అతనిరాకనెపుడొఅంతులేక తలచె
చింతతీరువేళ చివరికెపుడొ!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దూరభారాలు’ సరియైన ప్రయోగం. అక్కడ ‘దూరపు భారపు కొలువులు’ అనండి.
*****
‘పానుగంటి’ గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మంచి భావంతో పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
‘గోప్యంగ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘గోప్యముగ వగచె’ అందామా?
ఆమని నేసినట్టి హరితాంబరమూనిన భూరుహమ్ములున్
రిప్లయితొలగించండిభామినివోలె రమ్యముగ పాతరలాడుచు పారు వాగులున్
కామునిగాల్చువాని నిజకాంతకు సోదరులంటి కొండలా
సీమన గాంచినంతటనె చిన్నది చిత్తరువైనదచ్చటన్
కామేశ్వర శర్మగారూ. పద్యం చాలా బాగున్నది. మూడవ పాదానికి అర్థం వివరించ మనవి.
తొలగించండిశ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన భావంతో చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
‘వంటి’ని ‘అంటి’ అన్నారు. అక్కడ ‘సోదరులైన’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినమస్కారం శంకరయ్యగారూ
రిప్లయితొలగించండిసోదరులైన ,, బాగుంది మీ సూచన, ధన్యవాదం
ఏటి యొడ్డున చక్కని బోటి యొకతె
రిప్లయితొలగించండిప్రియునిరాకకై దీక్షతో వేచియుండె
పిల్ల తెమ్మెరల్ మెల్లగా వీచుచుండ
కలలఁగనుచుండె తనయొక్కకాంతుగూర్చి
మట్టి కుండను జేబుని మానిని యట
రిప్లయితొలగించండిభర్త గూరిచి గాబోలు బహుళ ముగను
శోక తప్తయై చింతించు చుండె నా? య
నునటు లుండెను మఱి యామె నుగను మార్య !
ఏటి కాడ నన్ను వాటేసి దాటించి
రిప్లయితొలగించండివ్రేలి కొసల మీట ప్రేమ వీణ
నేలు కొనెద వంచు నెదురు చూపులనుంటి
జాడ కాన రాదె జాలి లేద?
వచ్చెనుగాది|మన్మధునిభావనలన్నియునుంచివెళ్ళగా?
రిప్లయితొలగించండినచ్చి|చిగిర్చెచెట్టు|జయ నగ్నతజేర్చియువెళ్లిపోయినన్
తెచ్చినబిందెనింపకనె తీరికలేదనినూరకున్నచో?
వచ్చియుచేరునాజలము పట్టుగజేయు?ప్రయత్నముంచుమా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
టైపాట్లు రాకుండా చూడండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం ఎంకిపాటలా మనోహరంగా ఉంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
చెట్టుచిగిర్చెకొమ్మలు విచిత్రముగాను తటాకమండచే
రిప్లయితొలగించండికట్టడులున్న కన్యతనకాింక్షచిగిర్చిన?లోకతీరుతో
పట్టనినీటిబిందెవలె?భావనలేవియునింపకున్నచో
తట్టెడిదాహ మెట్లుడుగు తన్వికితీరున?కామితార్థమున్
మనసు దోచిన వగకాని మరువలేక
రిప్లయితొలగించండిసఖుని రాకకై చూచుచు చంద్రవదన
ఏటి కడకు నేగి మరచె నీటి తలపు
కడవ చేగొని కూర్చుండె కలువకంటి.
పులుల మనోభిలాషలను పూర్తిగజూసినకన్య శిల్పమై|
రిప్లయితొలగించండివలపులవాగులాగదల?"వన్నెలచిన్నెకుచెట్టుగట్టునన్
కలసినబిందెచేదెలుప?కంచుక కంటముజీరబోయె|యే
వలపుకుదారిజూపు పరిమాణ ప్రవర్తనదైవలీలయే|
వలపు సంకెల బిగియించి కలలు నింపి
రిప్లయితొలగించండిమరలి పోతివి నేదూర తీరము లకొ
పేద గుండెను నిండిన పిడికె డంత
ప్రేమ కరిగెను జలరాశి ప్రిదిలె మనము
నాదారిని కాచి వలచి
రిప్లయితొలగించండినేదూరపు తీరములకు నేగితి వౌరా ? ?
కాదని మరచిన ప్రేమను
వేదన లేకుండ మనుము వేయి సుఖమ్ముల్
ఏలను భామినీ యిచట నీ సెలయేటి దరిన్ ముఖమ్ములో
రిప్లయితొలగించండిబేలదనమ్ము దోపగను వృక్షము నానుక చేత బిందెతో
జాలిగ జూచుచుంటి వెద సందడి జేసెనె చేదు జ్ఞాపకాల్
కాలము చిత్రమై చెలగు గాయము లన్నిటి మాన్ చు నమ్మవో.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ, మూడవ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘పోతివి+ఏదూర’ అన్నప్పుడు నుగామం రాదు. ‘పోతివా యేదూర...’ అనండి.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చెట్టు క్రింద యువతి సేదతీరగనెంచి
రిప్లయితొలగించండికుండ చేత బట్టి కూరుచుండె
మగని తలపు లోన మైకమ్ము క్రమ్మగ
నీరు గొంటబోక నిలిచి పోయె!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నేరక వచ్చినా నిటకు నీటినిబిందెడు గైకొనంగ నే
రిప్లయితొలగించండినూరక సంజ వ్రాలినది ఊరది దూరము యత్త మామలున్
దూరక నుందురా,సరిగ దోసెడు నీరము లేదు ఏటిలో
జేరెద నెవ్విదిన్ ఉనికి చెప్పెద నేమని నీరమేదనన్
స్వామీ నీ మోముఁ దలచుచు నిస్సారమౌ జీవనమ్మా
రిప్లయితొలగించండిరామమ్మందెట్లు గడపితినో, రమ్ము రారమ్మికన్ , నీ
కేమో కోపంబు తెలుపుమ , నాదేమి నేరమ్మొకో? మా
రామేలోయీ! వడివడిగ రారాదొ, నన్నేల రాదో!
రవికాంత్ గారూ, పద్యం నచ్చినందులకు సంతోషం
రిప్లయితొలగించండికాముడు = మన్మధుడు,
వానిని కాల్చినవాడు = శివుడు
అతని (నిజకాంత) భార్య = పర్వత రాజ పుత్రి పార్వతి
ఆమెకు అన్నదమ్ములుంటే వారు కొండలే అన్నది నా భావన.
కామునిగాల్చువాని నిజకాంతకు సోదరులైన కొండలు అని అన్నాను. అదీ భోగట్టా
అర్థం అవగతమైనది. ధన్యవాదములు శర్మగారూ!
తొలగించండిఇంతిదిగులుతోడ చింతలుజేయుచు
రిప్లయితొలగించండిబిందెచేతబట్టి బింకముగను
తరువు ప్రక్కనుండితన్మయత్వమునొంది,
బ్రాంతితోడనుండె భామనచట
నీటి బిందె ఓలె నిండైనవయసుతో
రిప్లయితొలగించండిఏటి అలల జూచి ఎగిసె మనసు
ఆశ లెన్నవీచె ఆకాశ మంతగా
చెలియవలపుదెలుపు చిత్ర మనగ
సుందర రమణీయ ప్రకృతి శోభలందు
రిప్లయితొలగించండిమైమరచి ముగ్ధ వరిచేల మధ్య నున్న
యేటి యొడ్డున కూచోని యెంకి లాగ
కడవ చేదాల్చి కన్నుల కలియజూచె!