28, మార్చి 2015, శనివారం

న్యస్తాక్షరి - 28

అంశం- రామకథ. 
ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక.
పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.

24 కామెంట్‌లు:

  1. శ్రీవరుండు యాగంబును కావగ ముని
    సీమకు జని తాటక యను చీడ దునిమె
    తానె తరలె వనమునకు ధర్మమనుచు
    రాజ్యమును వీడి తన నిజ రమణి తోడ
    ముష్కరుడు సీతఁ గొనిపోవ పొగులుచుండి
    తను లతనడుగుచు మది వెతను బొందె
    కుదెరె చెలిమి, సుగ్రీవుని కోర్కెఁ దీర్చె
    వందలు మరి వేలుగ సాగె వానర తతి
    క్షిణమ్మున సంద్రము దాటి వెడలె
    మ్మి వెదకంగ దొరికెను నాతి జాడ
    ముగిసె రావణు చరితము తెగిపడె తల
    లు జయ జయ రామ యనుచును ప్రజలు మెచ్చె!!

    రిప్లయితొలగించండి
  2. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

    తేట గీతి:
    శ్రీధవుండిల రక్షింప శిష్ట జనుల
    సీతగా సిరి రాముడై చేరె తాను
    తాము శంఖమ్ము చక్రమ్ము పాము పడక
    రాము తోడుగ బుట్టెగా ప్రేమ మీర
    మునుల యాగమ్ము రక్షించి జనక పురిని
    లలన సీతను పెండ్లాడె, పలుక తండ్రి
    కుదురుగా వనముల కేగె కోరి కోరి
    వంకరాలోచనలు జేసి లంక రాజు
    దరికి జేరిచి మైథిలిన్ దాచగాను
    నచ్చి హనుమను బంపగా నాతి వెదకె
    ముష్కరాధములందర మోదిజంప
    లుప్తమయ్యెను పాపాలు లోకమందు.

    రిప్లయితొలగించండి
  3. జిగురు వారూ....రవీందర్ గారూ.... రామాయణాన్ని చక్కగా సంక్షిప్తం చేశారు..అభినందనలు..

    రిప్లయితొలగించండి
  4. శ్రీరఘూత్తముఁడుదయించె చెలువు మీర
    సీతయైజనియించె లక్ష్మీకళత్ర
    తాటకి ని జంపె రాముండు ధర్మమెసఁగ
    రాయి నాతిగ మారె సప్రాణయగుచు
    ముదిత సీతను బట్టె రాముఁడు జగాన
    లక్ష్మణసమేతుఁడయ్యె నరణ్యములకు
    కుపతియై రావణుఁడుసీతనపహరించె
    వందలాదిగ వానరప్రముఖ తతులు
    దనుజ సేనలతో గూడి పెనుగులాడె
    నతులసంగ్రామమునమహోద్ధతుఁడునగుచు
    మురిపెముగరావణుని జంప భువిని ప్రాణు
    లు మరి యానందమునుబొందిరమర వినిత.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు.

    తేటగీతిక:

    శ్రీని జేబట్టె ద్రుంచగ శివుని విల్లు
    సీత మాయమ్మ స్నిగ్ధయై చెంత జేరె
    తామస గుణ మంధర కైక తలపు మార్చ
    రాము నడవులఁ బంపగ ప్రభువుఁ గోరె
    మురిసె లోకోద్ధరణ జేయ ముని నుతుండు
    లజ్జ వీడియు గొంపోవ రావణుండు
    కుజను దరిజేర్చ చిరునామఁ గోరి నంత
    వందనాలంచు మారుతి పడతిఁ గాంచె
    దనుజ రావణు గూల్చె నా ధర్మ ప్రభువు
    నరులు పొగడెడు పాలన దొరలె నంట!
    ముక్తి నిచ్చును రామయ్య భక్తి కథయు!
    లుప్త హస్తమ్ములన్ నిండు గుప్త ధనము!

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులకు , కవిమిత్రులకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు....

    శ్రీహరి దశరధ సుతుడై చెంగలించ
    సీతగా సిరి జనకుని చింత దీర్ప
    తాటకినిజంపి ముని వెంట దరలి మిధిల
    రామ భూజను బెండ్లాడె రాఘవుండు
    ముసలి దండ్రియె శాసించ త్రసము జేర
    లంకకు గొనిపోవ సతిని రావణుండు
    కుమిలి సుగ్రీవ మైత్రితో కుజనువెదకి
    వంద లాదికపులతోడ వార్ధి దాటి
    దనుజ రావణుదునుమాడి తనదు భార్య
    నసుర చెరనుండి విడిపించి కసలు దీర్చి
    ముదము మీరగ హితులతో పురికిజని గొ
    లువున వెలుగు హరికి జోతలు నహరహము !!!

    రిప్లయితొలగించండి
  7. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు.


    శ్రీలు పొంగు నయోధ్య సుక్షేత్ర మైన
    సీమలో పుత్ర కామేష్టి జేసి బడిసె
    తాపసులు దేవతలు మెచ్చ దశరథుండు
    రామ లక్ష్మణ భరతాది నామ వరుల!
    మునుల పనుపున జనకుని పురముకేగి
    లలన సీతను పెండ్లాడె లక్షణముగ !
    కుమతి మందర, కైకమ్మ కోర్కె మీర
    వందనీయుడౌ తండ్రి సద్వాక్కు నిల్పె !
    దనుజ నాథుని తలద్రుంచి తనదు సతిని
    నరులు వానరుల్ గొనియాడ తిరిగి గొనియె
    ముక్తి నిక్కంబు కథవిన్న భక్తులకు క
    లుగు సుఖంబులు సంపదలు నిరతముగ!!!

    రిప్లయితొలగించండి
  8. తే.గీ.శ్రీమహావిష్ణువేసిరిచేరిధరన
    సీత రాముని రూపాన జేరె నదిగొ
    తాము యనుసరించిరిసత్య ధర్మ పథము
    రామనామంబె శ్రీరామరక్షమనకు
    ముసలి శబరియహల్యల ముక్తి నొసగి
    లలన సీతను తేవగ లంక కొచ్చి
    కుప్ప గూల్చెను రాక్షస కూట ములను
    వందనముజేయ రెజగదా నందు నకును
    దయతొ జూడుమనెపుడుకోదండ రామ
    నయన ములుపుల కించెనీ నామ మందు
    ముజ్జ గాలనుయేలునీపుణ్యచరిత
    లుప్త మగుభవ సంద్రము లొడ్డు చేర

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ క రుండగు రాముడు చిన్మ యుండు
    సీత జాడను కొఱ కునై వాత సుతుని
    తా ను గానంపె నోరమ ! త్వరిత గతిని
    రామ సీతను కనుగొని రమ్య మైన
    ముద్దు టు o గర మిమ్మని ముదల నిచ్చె
    లక్ష్మ ణుం డును వెడలెను రాము నా జ్ఞ
    కుదిరె నెయ్యము హనుమంతు గుంపు తోడ
    వంద లకొలది సైన్యముల్ వంది పలుక
    దక్షి ణం బున కేగెను దండు తోడ
    నమ్మ కంబుగా బోవగ నమ్మ సీత
    ముదము గలుగంగ గనబడ మోడు క్రింద
    లుప్త మయ్యెను శోకము నాప్తు లకును

    రిప్లయితొలగించండి
  11. 'శ్రీ'రఘువు వంశమున యందు శ్రేష్టుడునయి
    'సీ'త నింపుగా పెండిలి చేసికొనియు
    'తా'ను తండ్రిమాట నిలుపన్,ధర్మపత్ని
    'రా'మతోడ నాయడవుల రాముడేగె
    'ము'దిత సీతను దొంగిల మూఢ దనుజు
    'ల'క్ష్యమౌచును లాంగూల రాజ్యమేగి
    'కు'పితుడౌచును వాలినిగొట్టి,వెనుక
    'వం'దనంబులు వానరుల్ వానికిడగ
    'ద'నుజ రావణు లంకకు,దారిబట్టి
    'వ'య విభీషణు సాయాన నణగ జేసె
    'ము'దిత,సీతయు,సర్వులు మోదమంద
    'లు'బ్ధ రావణు తెగటార్చె లోకవిభుడు

    రిప్లయితొలగించండి
  12. శ్రికరుడు|శ్రీరఘువరుడు|శ్రియుతుడు
    సీత,సీమాటి,సుఖద సుసీలయనుచు
    తాళిగట్టెను ఈనాడెధరణిసుతకు|
    రావణాసురమర్యాద రయముజేసి
    మునులుఆశీస్సులొసగంగ?ఘనుడటంచు
    లక్ష్యసాధనయందు సులక్షణాన
    కుత్చితుండగురావణున్ గూల్చెతుదకు
    వందనంబిదే శ్రీరామ నందుకొనుము
    దలచినంతనె హనుమకు దగ్గరయిన
    నరునియవతారమెత్తినకరుణమూర్తి|
    ముగ్ధమోహన శ్రీరామమౌనిరక్ష్|
    లుప్త-ప్రతిభుడు గాదుఈలోకమందు

    రిప్లయితొలగించండి
  13. శ్రీర సముచిందు వేళ సు శ్ర్రీ ల గాథ
    సీత రాముల పరిణయ చిత్ర గాథ
    తామ సుం డగు రావణ తత్వ గాథ
    రామ లీలను c జూపెడు రమ్య గాథ
    మునుల ఆశ్రమ రక్షణ పుణ్య గాథ
    లక్ష్మణ భరత సోదర లలిత గాథ
    కుశుడు లవుడు ను పాడిన కుశల గాథ
    వంశ మదియన్న రఘువంశ వంశ గాథ
    దమము c జూపిన రాముని ధర్మ గాథ
    నరుని అవతార శోభతో నవ్య గాథ
    ముదిత సీతమ్మ శీలపు ముఖ్య గాథ
    లుబ్ధ కు c డు c జూపె సుందర లూమ గాథ
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు28/03/15

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న రాత్రినుండి నాకు మూత్రపిండాలో రాయి వల్ల విపరీతంగా నొప్పి వస్తున్నది. పైగా జలుబు, దగ్గు, జ్వరం. అయినా ఎప్పటికప్పుడు మిత్రుల పూరణలను, పద్యాలను చూసి ఆనందిస్తూనే ఉన్నాను.
    న్యస్తాక్షరిని సమర్థంగా నిర్వహిస్తూ సంక్షేపరామాయణాలను మిత్రులు ఉత్సాహంగా ఒకరిని మించి ఒకరుగా ప్రశంసనీయంగా వ్రాశారు. విడివిడిగా సమీక్షించే ఓపిన లేదు. ఇప్పటికి మన్నించండి.
    రామకథను తేటగీతిలో రచించిన మిత్రులు....
    జిగురు సత్యనారాయణ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    శైలజ గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    పిరాట్ల ప్రసాద్ గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. మాస్టరు గారూ ధన్యవాదములు...ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకొనండి...తగిన విశ్రాంతి తీసుకోండి..

    రిప్లయితొలగించండి
  16. గురువుగారు,
    శ్రీరాముడు మీకు స్వస్థత చేకూర్చుగాక!

    కవిమిత్రులందరూ కళ్యాణాన్ని వర్ణించినారు. ఇంక దంపతులకు ఆరతి పాటగా తేటగీతిక.

    శ్రీసతిపతికి యారతి చేయరండు!
    సీత మాయమ్మకారతి చేయరండు!
    తాల్మితోనిల్చి గెల్చెనా తల్లినతడు!
    రాముఁడను పేరు జపియింప రక్షనిడును!
    మునులె పూజలఁ జేయుచూ మ్రొక్కిరంట!
    లంక గెల్చె- నీ సుకుమారి లలన కొఱకు!
    కుశలవుల తండ్రిగా పేరు గొనియెనితఁడు!
    వందనములనరే యతివలిపుడిటను!
    దనుజపీడల మాన్పెనే ధరణి యందు!
    నలువ కొలిచిన పాదాల నతులనిడుము!
    మురిపెముగ పెండ్లి జరిపించి ముదిత లిట్టు
    లు కని ముక్తి పథము నెట్టి లోటులేక!
    ---శ్రీ సతి పతికి యారతి చేయరండు!

    రిప్లయితొలగించండి
  17. శ్రీగురుభ్యోనమః ,

    మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి మిక్కిలి వ్యాకులత చెందాను.మీకు తెలియనిది కాదు మూత్రపిండాలలో రాయి వలన బాధ ఉన్నందున నాకు తెలిసిన రెండు జాగర్తలను పిత్రువాత్సల్యం తొ చెప్పాలనిపిస్తుంది దయచేసి స్వీకరించండి.

    1) ప్రతి 2 గంటలకోకసారి నీరు త్రాగండి
    2) టమాటా తొ కలిపినా ఆకుకూరలు తినకండి.

    వీటిలో మొదటిది అత్యంత ఆవశ్యకము .

    భగవంతుడు మీకు పూర్తి ఆరోగ్యం చేకూర్చాలని ,రెట్టించిన ఉత్సాహంతో ఈ గ్రూపును నడపాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . మందులు క్రమం తప్పకుండా పాటించండి.

    విధేయుడు
    పిరాట్ల. వెంకట శివరామకృష్ణప్రసాద్.

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. కొన్ని పాదాలు లయబద్ధంగా ఉన్నాయి. (ముఖ్యంగా 1,2,5,8,9 పాదాలు). అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీల నొసగెడు భారత సీమయందు
    సీతను మనువాడె విరిచి శివ ధనుస్సు
    తానె రాముడు ధశరథ తనయుడతడె
    రామ వనవాసమును గోర భామ కైక
    ముగ్ద సీతతో రాముండు పోయె వనికి
    లలన సీత నపహరించ లంక రాజు
    కుమతియౌ రావణుని రాము కుప్పగూల్చె
    వందనీయుడ యోధ్యలో వైభవముగ
    దయగల ప్రభువుగ జనహృదయములందు
    నట్టుకొనునట్లు పరిపాలనమ్ముజేసె
    ముదిత సీతను గొల్పోయె తుదకు నతడు
    లుబ్ధకుడు వ్రాసినట్టి దీ లోకగాథ

    రిప్లయితొలగించండి
  20. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీకరముగ రాముండెత్త శివధనుస్సు
    సిత వేసె రాముని కంఠ సీమలోన
    తాను పుష్పదామమ్మును తనివితోడ
    రామభద్రుడు సీతతో రాజ్యమునకు
    ంఉఖ్య పట్టణమైన యయోద్యకేగె
    లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ రగ తోడు
    ఖులపువర్థనులైన వారలనుగాంచి
    వందనములిడిరి ప్రజలానందముగను
    దశరథుండు పుత్రులగని తనివి పొందె
    నగరజనులంతముదముతో నాట్యమాడ
    మునులు దేవతల్ కురిసిరి పూలవాన
    లు పురిపైన చదలనుండివిపులముగను





    రిప్లయితొలగించండి
  22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    హడావుడిగా టైప్ చేసినట్టున్నారు. టైపాట్లున్నాయి. ఐదవ పాదంలో యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  23. సెల్ ఫోనులో క్రొత్తగా టైపుచేయటంవలన తప్పులు దొర్లాయి. మరల టైపుచేసి పెట్టుచున్నాను. శ్రీకరముగ రాముండెత్త శివధనుస్సు
    సీత వేసె రాముని కంఠ సీమలోన
    తాను పుష్పదామమ్మును తనివితోడ
    రామభద్రుడు సీతతో రాజ్యమునకు
    ముఖ్య పట్టణమైన యయోద్యకేగె
    లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ రాగ తోడు
    కులపువర్థనులైన వారలనుగాంచి
    వందనములిడిరి ప్రజలానందముగను
    దశరథుండు పుత్రులగని తనివి పొందె
    నగరజనులంతముదముతో నాట్యమాడ
    మునులు దేవతల్ కురిసిరి పూలవాన
    లుపురిపైన చదలనుండివిపులముగను

    రిప్లయితొలగించండి