రాజేస్వరమ్మ గారు మీ పద్యం బాగుంది కాకపొతే రెండవపాదం లో దైన్యంబు న్నిసుమంత correct కాదు. "దైన్యంబున్ న్నిసుమంత " మరియు అదే line ధనుజా అన్నారు అక్కడ సగణం వచ్చింది మనకి కావలసిన గణం త గణం చూసి సరిచేయగలరు.
మిస్సన్న గారు మీదాంట్లో రెండవపాదం యతి తప్పింది. "అ" కి "రా" నప్పుదు సరిచేయగలరు.
పిరాట్ల ప్రసాదు గారూ - మిస్సన్న గారి పద్యంలో వీర+ ఆవేశము. యతి మైత్రి చక్కగాయున్నది. నాపద్యంలో తల్చకుండగను లో "ను" కు "స్వీ" నుండి ఎలాంటి వత్తిడి లేదు. కాబట్టి "గను స్వీ" సగణం సరిగానే ఉన్నది.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో యతి తప్పింది. రెండవ పాదం చివర గణదోషం. ***** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, ధన్యవాదాలు. ‘దైన్యంబున్+ఇసుమంత=దైన్యంబు నిసుమంత’ కావాలి. కాని కొన్ని సందర్భాలలో ‘దైన్యంబు న్నిసుమంత’ వంటి ప్రయోగాలు కొందరు కవులు చేశారు. ఇవి ఎక్కువగా పోతన కవిత్వంలో కనిపిస్తాయి. మీరన్నట్లు ‘దైన్యంబున్ న్నిసుమంత’ అన్న రూపం రాదు. అన్నపరెడ్డి గారి సమాధానమ్ మీ సందేహాన్ని తీర్చిందనుకుంటాను. ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘కన్నియన్+అన్యాయంబుగ’ అని విసంధిగా వ్రాయరాదు. అక్కడ ‘కన్యనే| యన్యాయంబుగ’ అనండి. రెండవ పాదంలో ‘కయ్యంబులై’ అన్నచోట గణదోషం. ‘వివాదంబులై’ అనండి.
పిరాట్ల ప్రసాద్ గారూ, ‘కన్యా!’ అని సంబోధనతో చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘పాద్రోలనే’..? ‘ఏది+ఎఱుగన్’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘వీక్షింప నో|కన్యా...’ అనండి.
మిస్సన్న గారికి మరియు సత్నారాయన రెడ్డి గారికి నా క్షమాపణలు. శాస్త్రము తెలుసుకునే జిజ్ఞాస లో మీ పద్యాలలో వివరణ కోరినాను.దీనిని academic interest గా భావించి చిన్నవాడినైన నన్ను మన్నించగలరు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యం రెండవ పాదం చివర అర్థం కాలేదు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, సవరించిన పూరణలోను లోపాలున్నాయి. ‘గణ్యంబేయుదియేమి’ సవరించలేదు. ‘అన్యంబేది+ఎరుగన్’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘ఎరుగన్+ఇహంబు=ఎరుగ నిహంబు’ అవుతుంది, యడాగమం రాదు. నా కెప్పుడూ కోపం రాదని గమనించ మనవి.
Prasad Piratla గారూ - మన సీనియర్లు కనీసం గురువు గారు అందుబాటులో లేని సమయంలో నైనా సవరణలు సూచనలు యివ్వటంలేదు.మిత్రులు చంద్ర మౌళి సూర్యనారాయణ గారు, మీరు చక్కగా విశ్లేషన చేస్తున్నందులకు ధన్యవాదములు.మనము విశ్లేషన చేయటంద్వారా యితరులకు తప్పొప్పుల గూర్చి అవగాహన ఏర్పడుతుంది. మీరు సంకోచించ కుండా కొనసాగించండి.
అన్యాయంబుగ చిన్న పిల్లలకు కళ్యాణంబుచేబూనగా
రిప్లయితొలగించండిధన్యాత్ముండగువాడువచ్చెనటకాతంతున్ నిరోధించి యా
విన్యాసంబును సల్పువారిననెనేవేదంబులోలేనియీ
కన్యాదానఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్.
అన్యాయంబది తానుపెంచి తనయన్ జామాత కీయంగ నే
రిప్లయితొలగించండిదైన్యంబు న్నిసుమంత లేకవధువున్ దనుజా వ్యాపాద మున్
కన్యా రత్నము మోసపోయు మనమున్ గాసిల్ల గారోయు చో
కన్యాదాన ఫలమ్ము గానరకమే కల్గున్ గదా దాతకున్
ఏ న్యాయమ్మగు ధర్మమున్, సుగుణమున్, హృత్కోశమందార్ద్రతన్
రిప్లయితొలగించండిమాన్యుల్ మెచ్చెడు వర్తనమ్మొకడు నెమ్మాత్రమ్ము లేదన్నచో
ధన్యుండౌనొకొ యట్టి బాలనొరుకున్ దానంబుగా నిచ్చినన్,
కన్యాదానఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్.
ప్రేమ వివాహమని పెద్దలనొప్పించి నొప్పించి జరుగుతున్న ఈ రోజులలో ఒక కూతురు..........
రిప్లయితొలగించండిఅన్యాలోచన తత్పరుండు వనితావ్యామోహ చిత్తుండు, సౌ
జన్యంబించుక లేనివాఁడు, కడు దుస్సాంగత్య లోలుండు నే
ధన్యత్వంబును లేక దుష్టకర చిత్తస్వాంతునిన్ కోరగా
కన్యాదానఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్
కన్యన్ రుక్మిణి తాను శౌరి తృటిలో గాజేయగా, రుక్మి 'యీ
రిప్లయితొలగించండియన్యాయమ్మును సైపలే' ననుచు వీరావేశ ముప్పొంగ సౌ
జన్యమ్మున్ విడనాడి పల్కె 'విను కృష్ణా! దొంగ! నీ బోటికిన్
*కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్! *
ధన్యంబయ్యెను జీవితమ్మనుచు తా దానంబు గా కన్నియన్
రిప్లయితొలగించండిపుణ్యాత్ముండని వృద్ధమానవునికిన్ ప్రోయాలుగా పంపగా
నన్యాయంబుగ నామెభర్త మృతితో నాకాలునిన్ చేరగన్
కన్యాదాన ఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్
అన్యాయంబని తల్చకుండగనుస్వీయాత్మోధ్బవన్ పంపగన్
రిప్లయితొలగించండిసన్యాసాశ్రమమందునున్న యతికిన్ సాధ్వీమణిన్ జేయుచున్
మన్యంబందున నామె జీవితములో మాధుర్యమున్ వీడగన్
కన్యాదాన ఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్
రాజేస్వరమ్మ గారు మీ పద్యం బాగుంది కాకపొతే రెండవపాదం లో దైన్యంబు న్నిసుమంత correct కాదు. "దైన్యంబున్ న్నిసుమంత " మరియు అదే line ధనుజా అన్నారు అక్కడ సగణం వచ్చింది మనకి కావలసిన గణం త గణం చూసి సరిచేయగలరు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు మీదాంట్లో రెండవపాదం యతి తప్పింది. "అ" కి "రా" నప్పుదు సరిచేయగలరు.
సత్యనారాయణ రెడ్డ్డి గారు మీ పద్యాలు బాగున్నవి అయితే రెండవ పద్యం లో మొదటి line లో 4 వ గణం యగణం వచ్చ్చింది కావలసినది సగణం శార్దూల వృత్తం కాబట్టి.
రిప్లయితొలగించండిమాన్యంబుల్, మణులున్, భవంతులును సన్మానంబుతో కన్నియన్
రిప్లయితొలగించండిఅన్యాయస్థున కిచ్చిచేయగ వివాహమ్మున్; కయ్యంబులై
యన్యోన్యమ్ముగ లేక కాపురము సౌహార్దంబు గోల్పోయినన్
కన్యాదాన ఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్!
పిరాట్ల ప్రసాదు గారూ - మిస్సన్న గారి పద్యంలో వీర+ ఆవేశము. యతి మైత్రి చక్కగాయున్నది.
రిప్లయితొలగించండినాపద్యంలో తల్చకుండగను లో "ను" కు "స్వీ" నుండి ఎలాంటి వత్తిడి లేదు. కాబట్టి "గను స్వీ" సగణం సరిగానే ఉన్నది.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. రెండవ పాదం చివర గణదోషం.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.
‘దైన్యంబున్+ఇసుమంత=దైన్యంబు నిసుమంత’ కావాలి. కాని కొన్ని సందర్భాలలో ‘దైన్యంబు న్నిసుమంత’ వంటి ప్రయోగాలు కొందరు కవులు చేశారు. ఇవి ఎక్కువగా పోతన కవిత్వంలో కనిపిస్తాయి. మీరన్నట్లు ‘దైన్యంబున్ న్నిసుమంత’ అన్న రూపం రాదు.
అన్నపరెడ్డి గారి సమాధానమ్ మీ సందేహాన్ని తీర్చిందనుకుంటాను.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కన్నియన్+అన్యాయంబుగ’ అని విసంధిగా వ్రాయరాదు. అక్కడ ‘కన్యనే| యన్యాయంబుగ’ అనండి. రెండవ పాదంలో ‘కయ్యంబులై’ అన్నచోట గణదోషం. ‘వివాదంబులై’ అనండి.
అన్యోన్య౦ బది లేక,యీడు పొసగంగాలేక,హీను౦డుయున్=
రిప్లయితొలగించండికన్యన్ సేవలు చేయు బానిసగ తత్కామమ్ము దీర్చంగ నో
విన్యాసమ్ముగ నెంచు వానికి తగన్ పెండ్లాముగా నిచ్చుచో
కన్యాదాన ఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘హీనుండునున్...’ అనండి.
శా.గణ్యంబేయుదియేమిమాయలలనాకవ్వించిపాద్రోలనే
రిప్లయితొలగించండిసన్యాసంబునుపొందనాకునికనీసాంగత్యమేయివ్వగా
అన్యంబేదెరుగన్ యిహంబువిధివిన్యాసంబువీక్షింపయో
కన్యా!దానఫలమ్ముగా,నరకమేకల్గున్ గదాదాతకున్.
గురువుగారు మిస్సన్న గారి పద్యం లో రెండవ పాదం మొదటి అక్షరం అ దాని యతి రా ఎలా కుదురుతుంది ? రా అంటే ర మీద ఆకారం కదా . తెలుపగలరు.
రిప్లయితొలగించండిపిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండి‘కన్యా!’ అని సంబోధనతో చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పాద్రోలనే’..? ‘ఏది+ఎఱుగన్’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘వీక్షింప నో|కన్యా...’ అనండి.
ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి గారి వివరణ చూడలేదా? వారు స్పష్టంగా సమాధాన మిచ్చారు కదా!
గురుదేవుల సూచించిన సవరణ శిరోధార్యము!
రిప్లయితొలగించండికన్యాదానము చేయగా కలుగు నాకంబెంతొ యావంశమున్
రిప్లయితొలగించండికన్యన్ దానము చేయువాని కలి,పేకన్వింశతౌ నుద్ధతి
న్నన్యంబౌ గతి పూరుషాళికిని తన్నందించు నాదుష్టయౌ
కన్యాదాన ఫలమ్ముగా నరకమేకల్గున్ గదా దాతకున్!!
అన్యంబౌ పది దానముల్ సలిపినన్,నవ్విందుకున్ సాటి యా
కన్యాదానమదే సదా తనకు దక్కంజేయు పుణ్యంబునే
కన్యాదాన ఫలమ్ముగా-నరకమే కల్గున్ గదా దాతకున్
పున్నామంబును దాటకేవిధిని,తాపుణ్యంబు గోల్పోవుగా!!
శా.గణ్యంబేయుదియేమిమాయలలనాకవ్వించిమెప్పింనే
రిప్లయితొలగించండిసన్యాసంబునుపొందనాకునికనీసాంగత్యమేనివ్వనే
నన్యంబేదెరుగన్ యిహంబు విధివిన్యాసంబువీక్షింపనో
కన్యా !దానఫలమ్ముగా,నరకమేకల్గున్ గదాదాతకున్.
గురువుగారు పద్యం చిన్న మార్పు తొ
Guruvugaarikee, piraatla prasaad gaarikee, satyanaaraayana reddi gaarikee, dhanyavaadamulu.
రిప్లయితొలగించండిsavarimchina guruvulaku dhanya vaadamulu
రిప్లయితొలగించండిగురువుగారికి కోపం వచ్చినందులకు క్షంతవ్యుడను
రిప్లయితొలగించండిమిస్సన్న గారికి మరియు సత్నారాయన రెడ్డి గారికి నా క్షమాపణలు. శాస్త్రము తెలుసుకునే జిజ్ఞాస లో మీ పద్యాలలో వివరణ కోరినాను.దీనిని academic interest గా భావించి చిన్నవాడినైన నన్ను మన్నించగలరు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసవరణతో...........
రిప్లయితొలగించండిమాన్యంబుల్, మణులున్, భవంతులును సన్మానంబుతో కన్యనే
యన్యాయస్థున కిచ్చిచేయగ వివాహమ్మున్; వివాదంబులై
యన్యోన్యమ్ముగ లేక కాపురము సౌహార్దంబు గోల్పోయినన్
కన్యాదాన ఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యం రెండవ పాదం చివర అర్థం కాలేదు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
సవరించిన పూరణలోను లోపాలున్నాయి. ‘గణ్యంబేయుదియేమి’ సవరించలేదు. ‘అన్యంబేది+ఎరుగన్’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘ఎరుగన్+ఇహంబు=ఎరుగ నిహంబు’ అవుతుంది, యడాగమం రాదు.
నా కెప్పుడూ కోపం రాదని గమనించ మనవి.
Prasad Piratla గారూ - మన సీనియర్లు కనీసం గురువు గారు అందుబాటులో లేని సమయంలో నైనా సవరణలు సూచనలు యివ్వటంలేదు.మిత్రులు చంద్ర మౌళి సూర్యనారాయణ గారు, మీరు చక్కగా విశ్లేషన చేస్తున్నందులకు ధన్యవాదములు.మనము విశ్లేషన చేయటంద్వారా యితరులకు తప్పొప్పుల గూర్చి అవగాహన ఏర్పడుతుంది. మీరు సంకోచించ కుండా కొనసాగించండి.
రిప్లయితొలగించండిపిరాట్ల ప్రసాద్ గారూ ఇక్కడ మనం అందరం విద్యార్థులం. కోపతాపాలకు తావుండదు.
రిప్లయితొలగించండికన్యాదానము జేయగానె సరియా కట్నమ్ము బాధింపదా
రిప్లయితొలగించండికన్యన్ గైకొని వెంటనే వరుడు తా గర్భమ్ము గావించడా
కన్యాదానఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్
సన్యాసమ్మిక మేలుగాదె వడిగా సంసారమున్ వీడుమా!
కన్యన్ దానము జేసితిన్ చెలగుచున్ గంభీరమౌ తీరునన్
రిప్లయితొలగించండిశూన్యంబాయెను నాదు బొక్కసమయో! చూలాలు నా కూతుతో
జన్యంబున్ గెలువంగ లేక విడెనే జామాత సన్యాసియై
కన్యాదానఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్ 😢