4, మార్చి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1612 (మాట లన్ని నీటిమూట లయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మాట లన్ని నీటిమూట లయ్యె.
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. అగ్రజుని వదలక అడవికేతెంచి యే
    ఆపద దరిజేర ఆదు కొందు
    వన్న మాట కల్ల వంచన జేయునీ
    మాట లన్ని నీటిమూట లయ్యె

    - సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  2. మాస్టరుగారూ !
    నిన్నటి పూరణలు కందములో చేశాను...ఎమిటోనండీ...పద్యం అనగానే డెందమున ముందు కందమే తయారౌతుంది...తొందరపాటుకు క్షమిమించండి...నాకందములను మార్చే పనిలేకుండా కంద పాదమును నాకందించిన కందివరాన్వయులకు నా నమస్సులు.

    రిప్లయితొలగించండి
  3. సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని సందర్భమే అర్థం కాలేదు. పద్యంలో పేర్కొన్న ‘అగ్రజుడు’ ఎవరు?
    *****
    గోలి వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. విరిగె యాంధ్ర రెండు విడివిడి ముక్కలు
    సోనియమ్మ తల్లి సూచన మేరకు
    పెక్కు రాయితీలు బెడిసి గొట్టె!
    మాటలన్ని నీటి మూట లయ్యె

    రిప్లయితొలగించండి
  5. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ, మూడవ పాదాలలో గణదోషం. ‘విరిగె నాంధ్ర’ అనండి. మీ పద్యానికి నా సవరణ.....
    విరిగె నాంధ్ర రెండు విడివిడి ముక్కలు
    సోనియమ్మ చెప్ప చోద్యముగను
    పెక్కు రాయితీలు బెడిసి గొట్టిన వౌర!
    మాటలన్ని నీటి మూట లయ్యె

    రిప్లయితొలగించండి
  6. ఎన్ని కలల యపుడు నెన్నియో వాగ్దాన
    ములను బలికి పిదప ముఖము కూడ
    చూప బోరు సామి ! చోద్యము గద !వారి
    మాట లన్ని నీటి మూట లయ్యె

    రిప్లయితొలగించండి
  7. గద్దె నెక్కు వరకు సుద్దులు జెప్పుచు
    గారడీలు జేయు వీరు లంత
    పదవి బొంద గానె బల్కునా గోవింద ?..!
    మాట లన్ని నీటి మూట లయ్యె !!!

    రిప్లయితొలగించండి
  8. పదవినెక్కు వరకు పలుమాటలను చెప్పి
    కానరారు జనుల కనుల కెపుడు
    నటన తోడ గతము నాయకుల్ చెప్పిన
    మాట లన్ని నీటి మూట లయ్యె

    రిప్లయితొలగించండి
  9. చెప్పువారెగాని-చేయనిపెద్దల
    మాటలన్నినీటిముటలయ్యె
    పలుకులన్నిమనకు-పట్టమువారికి
    నెంచ?ఎన్నికలలు-ఎన్నికందు

    రిప్లయితొలగించండి
  10. ఐదు పుష్క రమ్ము లధికార మ్ముల నుండి
    పేద రైతు బ్రతుకు పెరగ లేదు
    కలత మిగిలె మనకు కాంగ్రెస్సు పాలించి
    మాట లన్ని నీటి మూట లయ్యె

    రిప్లయితొలగించండి
  11. మల్లెలసోమనాథశాస్త్రిగారిపూరణం
    ----------
    రాజకీయమందురాజిల్లుప్రతినలు
    చేయుచుండివారుచేయలేక
    యున్నప్రజలునమ్మియుంటను-పార్టీల
    మాటలన్నినీటిమూటలయ్యె
    చదువువైద్యమిలనుచదువులకందింప
    ప్రభుతనీతియనుచు-వారెగద్దె
    నెక్కినంతజేయనేరరునేవరైన
    మాటలన్నినీటిమూటలయ్యె

    రిప్లయితొలగించండి
  12. కే-యస్*గురుమూర్తిగారిపూరణం-
    -------
    నీవెప్రాణమనుచునీయాజ్ఞజవదాట
    ననుచు పారిజాతనాసపత్ని
    కిచ్చినన్నుమోసగించితినోకృష్ణ
    మాటలన్నినీటిమూటలయ్యె

    రిప్లయితొలగించండి
  13. గురువుగారికి నమస్కారాలు. రామాయణంలో సీతను రావణుడు అపహరించే ఘట్టంలో, బంగారు జింక వెనుక వెళ్ళిన రామునికి ఆపదవచ్చిందేమోనని లక్ష్మణుడిని వెళ్ళిచూడమని చెప్పగా, వెళ్ళనంటున్న లక్ష్మణుడితో సీత ఇలా అనివుంటుందన్న అర్థంలో రాసాను. ఆ భావం వచ్చిందో లేదో తెలీదు.

    రిప్లయితొలగించండి
  14. నీతులన్నివున్న?నిష్టూరములముందు
    మాటలన్నినీటిమూటలయ్యె
    భాగ్యమెంతయున్న-భావనలేనట్టి
    మమతలందుసమతమాసినట్లు|

    రిప్లయితొలగించండి
  15. " వచ్చు పోల వరము, ప్రత్యేక హోదాలు "
    లోక సభకు బయట రొప్పు కొంటు
    మేటి వార్తఁ గంటి నీటి పొట్లము పైన
    మాట లన్ని నీటి మూట లాయె !


    రిప్లయితొలగించండి
  16. బాస నిచ్చి తీవు బాలగోపాల! 'యీ
    యమున చెంత రాధ! యామిని నిను
    కలువచెలువ జేసి కరగింతు' నని నాడు
    మాట లన్ని నీటిమూట లయ్యె.

    రిప్లయితొలగించండి
  17. పరిహసించెనన్ను హరి పారిజాతంపు
    పుష్పమిచ్చితాను భోజసుతకు
    సతులలోనహరికి సత్య యిష్టమనెడు
    మాట లన్ని నీటిమూట లయ్యె

    రిప్లయితొలగించండి
  18. Guru devulaku dhanyavaadamulu

    Maata Lanni niti muta layyenu nedu
    Modi raajya mamdu mota juda
    Nemi setu mayya raama Chandra teliya
    Naitimi gada charita khyaati gaanu

    రిప్లయితొలగించండి
  19. Guru devulaku dhanyavaadamulu

    Maata Lanni niti muta layyenu nedu
    Modi raajya mamdu mota juda
    Nemi setu mayya raama Chandra teliya
    Naitimi gada charita khyaati gaanu

    రిప్లయితొలగించండి
  20. వేరు బడిన మీకు వేలకోట్లిత్తుము
    ఏపి నోరునింక తీపి జేతు
    మనుచు నెన్నికలను మాన్యులు జెప్పిన
    మాట లన్ని నీటిమూట లయ్యె

    రిప్లయితొలగించండి
  21. శ్రీ కందుల వరప్రసాదు గారి పూరణ తెలుగు లిపి లోకి మార్చాను.....


    మాటలన్ని నీటి మూట లయ్యెను నేడు
    మోడి రాజ్య మందు మోత జూడ
    నేమి సేతు మయ్య రామ ఛంద్ర తెలియ
    నైతిమి గద చరిత ఖ్యాతి గాను.

    రిప్లయితొలగించండి
  22. Raamadaasu cherasaala yamdu


    Maata Lanni niti muta layyenu gada
    Karuna toda nelu Kari varadudu
    Hari yani biluvamga dariki jeru nanuchu
    Pogaduchu pudamini Munulu baluku

    రిప్లయితొలగించండి
  23. శంకరయ్య గారు ఒక చిన్న మనవి ఎక్కువగా ఆటవెలది లేదా తేటగీతి ఇవ్వడానికి కారణం తెలుపగలరు. వేరే వృత్తాలని కూడా ప్రోత్సహించాలని సమస్యలు కుడా కొంచెం క్లిష్ట తరం చేస్తే కవులకి కుడా మేధోమధనం అవుతుంది తద్వారా గ్రూప్ హోదా మరింత పెరుగుతుందని నా అభిలాష.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ కందుల వర ప్రసాద్ గారి పూరణ తెలుగు లిపిలో....


    రామదాసు చెరసాల యందు

    మాట లన్ని నీటి మూట లయ్యెను గద
    కరుణ తోడ నేలు కరి వరదుడు
    హరి యని బిలువంగ దరికి జేరు ననుచు
    ఫొగడుచున్ పుడమిని మునులు బలుకు

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్ళి రాత్రికి తిరిగిరావడం వల్ల నిన్నటి పూరణపై, పద్యాలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఎన్నికల సమయము నెన్నియో...’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వ.రా. సత్యనారాయణ గారూ,
    వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కందుల వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ సందేహానికి గతంలో సమాధానం ఇచ్చినట్లు గుర్తు. మన బ్లాగులో పద్యాలు వ్రాసే వారిలో అత్యధికులు ఔత్సాహికులే. వృత్తసమస్యలు కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. అప్పటికీ అప్పుడప్పుడు వృత్త సమస్యలను ఇస్తూనే ఉన్నాను.

    రిప్లయితొలగించండి