18, మార్చి 2015, బుధవారం

పద్యరచన - 852

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(ఈ చిత్రాన్ని పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు)

15 కామెంట్‌లు:

 1. ఏలీల వెలసితివి నీ
  వాలోయలలోన భక్తవత్సల యెరుగన్
  నీలీలల మాతరమా
  శూలాయుధపాణి గరుణ జూడుము మమ్మున్

  రిప్లయితొలగించండి
 2. అలిగితి వాసతి పైనను
  వెలసితి వీలోయ లందు వేడుక పుట్టన్
  కలియుగ మనితెలి సికొనుము
  కలుగదు నీపైన జాలి కాళికి నైనన్

  రిప్లయితొలగించండి
 3. తపముఁజేయ నెంచి దక్షినామూర్తి తా
  లోయలోన వెలసె లీలగాను
  దంతి మోయుచుండె నంతకాంతకు ప్రీతి
  నాది భిక్షు కొలువు డాదుకొనగ

  రిప్లయితొలగించండి
 4. గిరిజా రమణా ! ఘన హిమ
  గిరి నిలయా ! దేవ ! వ్యోమకేశా ! ఈశా !
  గిరిగీచినట్లు కూర్చొన
  గిరిపై మే ' మెట్లు' జేరి కీర్తింతుమయా !

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. వాగు దరిన వెలసి భక్తజ నమ్ముల
  గావ దీర్చి యుండె గరళ కం ఠు
  డా ర్య ! వంద నంబు లాభవు నకుజేయ
  బోయి వత్తు నటకు బొరి పొరిగను

  రిప్లయితొలగించండి
 7. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. వనమున నదిలో నున్న క
  ఠినశిల నేర్పునఁ దొలిచి పటిష్టముగా శం
  భుని నేన్గుపై నిలుపు శి
  ల్పిని మెచ్చుచు వందనము లివే యర్పింతున్.

  రిప్లయితొలగించండి
 9. పారెడు గంగమ్మ హొయలఁ
  దీరుచు శృంగమ్ము పైన తిలకించదవే!
  రా! రా! గంగాధర! మా
  యూరుల నాయమ్మకురియనొప్పించగనే!

  రిప్లయితొలగించండి
 10. గరళము దాచిన ఘనునిన్
  గరిమగ సురనదిని జడను గట్టిన వానిన్
  హరిణాంకుని సిగ దురిమెడు
  హరకుని నే వేడుకొనెద ననవరతమ్మున్

  పఱికన కరి, కరి పై గిరి
  మరువున గొలువుండె నదివొ మదనాంతకుడే!
  పురహర! నిన్నిటుల మలచి
  హరువుగ నందించు వాని కంజలి నిడుదున్!!!

  రిప్లయితొలగించండి
 11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  శివునకు హరకుడు అన్న పర్యాయపదం ఉన్నట్లు మీ వల్ల తెలిసింది.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. అవతారంబులనెత్తుచు
  భవితకుభయభక్తినొసగు-బాధ్యతచేతన్
  భువిఫైకొండలమద్యన
  నివశించెడిసాంభమూర్తి|నిన్నేగొలుతున్,

  రిప్లయితొలగించండి