7, మార్చి 2015, శనివారం

పద్యరచన - 841

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చూడగ చక్కగ నున్నవి
జాడీలట పచ్చడు లను సంచిత పరుచన్
వేడిమి గలయన్న మందున
వాడిగ మాగాయ రుచులు వేడుక తినగన్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రంగారెడూరగాయల
పొంగారగ రుచుల దాచి భోజనమునకై
సింగారపు పచ్చడినిడు
పింగాణీ జాడి నీకు పెక్కగు నెనరుల్.

subbarao చెప్పారు...

ఊర గాయల జాడీ ల సౌరు జూడ
నంద మొలికించు చుండును నంద ఱకును
భద్ర పఱతురు పచ్చళ్ళు భామిను లిల
నిల్వ యుండుట కొరకునై నీ ర జాక్షి !

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘వేడిమి గల యన్నములో’ అనండి.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

చేడియ లందరు కూడుచు
వేడుకగా చేయుచుంద్రు ప్రియమగు చట్నీ
జాడీలలోన నుంతురు
పాడగునని యావకాయ పల్లెలలోనన్

sailaja చెప్పారు...

ఇమ్ముగ జాడీ లందున
కమ్మగ పచ్చడులు బెట్టి ఘనముగ నిండ్లన్
చెమ్మను దగలక దాచగ
ఘుమ్ముగ చెడిపోక నుండు కోరి తినంగా!!!

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

జాడీలనూరగాయల
నేడాదికిసరిపడంగ నిల్వన్ జేయన్
పాడవకనుండు జక్కగ
వాడుకొనగవచ్చు మనయవసరముకొలదిన్

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉప్పును కారము సోకిన
వప్పల నూరంగ నూట పచ్చడి! లోనన్
గొప్పగ జాడీ నిండెనొ?
కుప్పెకు పై నూరినట్లు గోచర మాయెన్!