19, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణం - 1626 (జయనామాబ్దమున జయము సాధించితివా?)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జయనామాబ్దమున జయము సాధించితివా?

17 కామెంట్‌లు:

 1. రయమున యేడాది గడచెను
  జయనామాబ్దమున జయము సాధించితివా?
  నయమే! కష్టము లేకనె
  వయసు పెరగె నింకొక్క వత్సరమార్యా!

  రిప్లయితొలగించండి
 2. రయమున వచ్చెను మన్మధ
  పయనించ గజనుల నిచ్చ భగవత్ కృపచే
  శయనించె మింట తారలు
  జయనామా బ్ధమున జయము సాధించితివా ?
  [ లేదు ]

  రిప్లయితొలగించండి
 3. జయమను నబ్దము గడచెను
  జయ నా మాబ్దమున జయము సాధించితివా ?
  జయమప జయములు రెండును
  జయవత్సర మిచ్చె నాకు శంభుని నాజ్ఞన్

  రిప్లయితొలగించండి
 4. వెయమున్ జేసిన దా సమ ?
  భయమును గల్పించకుండ ప్రమదమ్మిడెనా?
  ప్రియమగు నా సఖి దెల్పుమ?
  జయ నామాబ్దమున జయము సాధించితివా?

  రిప్లయితొలగించండి
 5. రయమున రాష్ట్రముఁ జీలిచి
  దయలేకను గొప్పవారిఁ దన్నుకు పోవన్
  భయము మిగిలెఁ గాలమ్మా!
  జయనామాబ్దమున జయము సాధించితివా?

  రిప్లయితొలగించండి
 6. వ్యయముల బాధలను విడిచి
  జయనామాబ్ధమున జయము సాధించితివా!
  నయము కలుగలేదు హితుడ
  జయమును మన్మథ నిడుమని జపియింతు హరిన్

  రిప్లయితొలగించండి
 7. నియమంబనునయనంబుల
  జయనామాబ్దమున-జయముసాధించితివా?
  భయమేబాధ్యత-దృంచగ?
  శయనించక-మన్మధాబ్ది-సాగియురమ్మా

  రిప్లయితొలగించండి
 8. మయసభవంటి-ప్రపంచము
  జయనామాబ్దమున-జయముసాధించితివా?
  దయయన్నది-లేకున్నను
  నియమాలకుతావులేక-నిలువదుజయమే|

  రిప్లయితొలగించండి
 9. నయమున బంగ్లా దేశము
  జయమ్ముపై పెట్టుకొన్న శంసను ధోనీ!
  స్వయముగ నాశము జేసియు
  జయనామాబ్దమున జయము సాధించితివా?

  రిప్లయితొలగించండి
 10. భయ రాజకీయ తంత్రమ!
  రయమున సోదరుల నడుమ రగిలెను పగలే!
  నయమా తెనుగు ధరిత్రికి?
  జయనామాబ్దమున జయము సాధించితివా?

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో చివరి అక్షరాన్ని తొలగించండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదం అర్థం కాలేదు. టైపాట్లున్నాయా?
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  ఇంట్లో ఇంటర్‍నెట్ కనెక్షన్ లేక ఇవాళ రోజంతా నేను చేసిన పని భారత బంగ్లా క్రికెట్ మ్యాచ్ చూడడమే!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  నిస్సంశయంగా ఈనాటి పూరణలలో మీది ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. "జయ"మది యేగుచు నుండగ
  "జయనామాబ్దమున జయము సాధించితివా!"
  నయమున నడుగగ నందును
  జయముగ పూరణలనన్ని సాధించితిగా!

  జయమేగె నాంధ్రజనులల
  భయమై రెండుగ పగగొని వారుమెలగగా
  నయమున నడుగుట తగునా?
  జయనామాబ్దమున జయము సాధించితివా?

  జయ వత్సరమంతమునను
  జయనామాబ్దమున జయము సాధించితివా?
  భయముగ నడుగగ తగునా?
  జయమును,నోటమి,గలిగెను సహజపు గతిలో!

  రిప్లయితొలగించండి
 13. శ్రీకేంబాయితిమ్మాజీరావుగారిపూరణం
  --------------
  జయనామపువత్సరమున
  వ్యయమదికంబవుననంగ?భావ్యంబగునా?
  నయముగనడుగుటతగదని
  జయనామాబ్దమున జయముసాదించితివా?

  రిప్లయితొలగించండి
 14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. నయమున బంగ్లా దేశము
  జయమ్ముపై పెట్టుకొన్న శంసను ధోనీ!
  స్వయముగ నాశము జేసియు
  జయనామాబ్దమున జయము సాధించితివా?

  రిప్లయితొలగించండి