11, మార్చి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1619 (కర్ణహస్తాభరణ మయ్యె గాండివమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కర్ణహస్తాభరణ మయ్యె గాండివమ్ము.

19 కామెంట్‌లు:

  1. నీతి నియమాలు లేనట్టి నేతలంత
    పదవులను గాండివంబును పట్టుకోని
    జేయరేపనిని ప్రజల క్షేమమెంచి
    కర్ణహస్తాభరణ మయ్యె గాండివమ్ము

    రిప్లయితొలగించండి
  2. బాపడి రూప మందున్న పార్ధు డనిన
    తెలియ కున్నట్టి గాంగేయు తెలివి మీరి
    వీని జంపిన జాలును వేరు లేరు
    తలచె నాయుధ మొందగ తనివి దీర
    కర్ణ హస్తాభరణ మయ్యె గాండి వమ్ము

    రిప్లయితొలగించండి
  3. బలరిపుతనయునిమదిలో తలచగాన
    కర్ణ హస్తా భరణమయ్యె, గాండీవమ్ము
    గాంచి విరటుని పుత్రుడు కాంచె ముదము
    తాల్చె తనరూపు విజయుడు తాక విల్లు

    రిప్లయితొలగించండి
  4. గీతోపదేశమునకు మునుపు సాటి వీరునిగా కర్ణునితో అర్జునుని పలుకులు;

    తాత తండ్రులు నాజికై తరలి రాగ
    యుద్ధరంగాన పదములు యూగులాడె
    సమరమే రీతి సాగింతు, భ్రమలు తొలగి
    కర్ణ!హస్తాభరణమయ్యె గాండివమ్ము!!

    రిప్లయితొలగించండి
  5. ఓ మహారథీ! ఈ రణోద్యోగమందు
    నిన్ను నిర్జింప లేక కుంతీ సుతుండు
    పాలు మాలక యుండె, నప్పార్ఠుకిపుడు
    కర్ణ! హస్తాభరణ మయ్యె గాండివమ్ము

    రిప్లయితొలగించండి
  6. నీదు పుట్టుక గడుశోచ నీయము గద
    కర్ణ! హస్తాభరణ మయ్యె గాం డివమ్ము
    పార్ధున కనుట యబ్బురం బాయె మదిని
    శత్రు సంహార మొనరించె సామి ! యతడు

    రిప్లయితొలగించండి
  7. మానక సతము జేసెడి దాన గుణమె
    కర్ణ హస్తాభరణమయ్యె, గాండివమ్ము
    పాండు పుత్రుని తొడవుగ పరిఢవిల్లి
    సవ్యసాచికి దెచ్చెను జయము లెన్నొ!!!

    రిప్లయితొలగించండి
  8. విరాటపర్వములో ద్రోనుఁడు కర్ణునితో అంటున్నట్లుగా............

    పేడి రూపమ్మునిక తాను వీడినాడు
    నిజ పరమమునుఁ జూప నిశ్చయించి
    యరగు చున్నట్టి యర్జునునరసిచూడ
    కర్ణ! హస్తభూషణమయ్యె గాండివమ్ము.

    రిప్లయితొలగించండి
  9. ఘనమగు మన సైన్యంబును గనుగొని కడు
    చింత జెంది సమరమును జేయననుచు
    నర్జనుడు చెప్పుమాటల నాలకించు
    కర్ణ ! ''హస్తాభరణ మయ్యె గాండివమ్మ''

    రిప్లయితొలగించండి
  10. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు, కవిమిత్రు లందరకు నమస్కారములు!

    అర్జునుడు కురుక్షేత్రమునందు యుద్ధ
    నిపుణతను జూపు వేళలో నిలిపి రథము
    శల్యు డనుచుండె నీరీతి సాహసించి
    "కర్ణ!హస్తాభరణ మయ్యె గాండివమ్ము"

    రిప్లయితొలగించండి
  11. కవచ కు౦డల దానంబు కన్యసుతుడు
    కర్ణ హస్తాభరణ మయ్యె; గాండివమ్ము
    ఈశు మెప్పించి తపమున పాశుపతము
    వరము పొందిన పార్ధుని కరము నమరె

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరమ్మ గారు మీ పద్యం బాగుంది ఒక చిన్న వివరణ మొదటి పాదం లో రెండవ ఇంద్రగణం మరియు అదే పదం లో 4 ,5 సూర్య గణాలు సరిచేయగలరు. యతి కుడా భంగంయ్యింది "బా" కి "ర్ధు " నప్పుడు.

    ధన్యోస్మి .

    రిప్లయితొలగించండి
  13. సారధ్యము చేస్తూ, శల్యుడు కర్ణునితో:

    కొమరుఁ జంపిరి మీరని కోప మందు,
    పరమశివుని మెప్పించిన పార్థుఁడతడె
    యోడి పోవుట తధ్యము చూడవోయి
    కర్ణ! హస్తాభరణమయ్యె గాండివమ్ము!

    రిప్లయితొలగించండి
  14. తే.గీ.రణము నవిరాట పుత్రుడు వణకియురుక
    శమిన దాచినఛాపంబు ,జయమునివ్వ
    విజయ గర్వంబువిడిచెను వీరు లెల్ల
    కర్ణ హస్తా భరణమయ్యె, గాండి వమ్ము

    (ఉత్తరగోగ్రహణం చేసి విజయము సాధించి ఎవ్వరిని చంపక వదిలినందుకు గాండీవం హస్తభూషణ మయ్యింది అన్న ఊహతో )

    రిప్లయితొలగించండి
  15. హస్తినందున కొమరులు నస్త్రవిద్య
    జూప,పార్ధుడు నెదిరింప సూతసుతుడు
    కర్ణ,హస్తాభరణమయ్యె గాండివమ్ము
    వంటివిల్లది,యర్జును భావిదెలుప

    ఆలమందను మరలింప నర్జునుండు
    పేడియౌచును సారధై వెడలి,యచటి
    గాండివంబును సారించె కర్ణమంట
    కర్ణహస్తాభరణమయ్యె గాండివమ్ము

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు. బంధువుల ఇంట్లో పెళ్ళికి ‘ఇల్లందు’కు వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల పూరణలపై వెంటవెంట స్పందించలేకపోయాను. మన్నించండి.
    *****
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు....
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
    కుమార్ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    శైలజ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గండూరి లక్ష్నినారాయణ గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి (బహుకాల దర్శనం!),
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి (మీ ఆరోగ్యం కుదుటపడిందా?),
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారికి, (అక్కయ్యగారి పద్యంలోని దోషాలు తెలిపినందుకు ధన్యవాదాలతో),
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. నమస్కారములు
    నా పద్యము నందు దోషమును తెలిపి నందుకు శ్రీ ప్రసాద్ గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి