14, మార్చి 2015, శనివారం

పద్యరచన - 848

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. ఇమ్ముగ జలధితటి నిందుమౌళి నిలచి
  మమ్ము బ్రోవుననుచు నమ్మినాము
  కమ్మనైన గరళకంఠుసేవ శుభక
  రమ్ము జనులకు శరణమ్ము గాదె

  రిప్లయితొలగించండి
 2. సాగర తీరము నందున
  భోగము లనువీడి నీవు భూరి తపంబున్
  యోగము తెలియని జనులట
  జాగరణ ముచేయు చుండె సంకట పడగన్

  రిప్లయితొలగించండి
 3. తలపై గంగను హర ! భూ
  తలమునకే దించి నీవు దరినున్నావా !
  తలపై మాతలలోపల
  తలగంగను ముంచ మాకు ధన్యతనిమ్మా !

  రిప్లయితొలగించండి
 4. అబ్ధి తీరము నందున నంబ విభుడు
  తపముఁ జేయుచు నుండెను తన్వయముగ
  కోరి భక్తితో ప్రార్థింప తీరుగాను
  కామితమ్ముల నిచ్చును కాటి రేడు

  రిప్లయితొలగించండి
 5. సంద్ర పుదరిన ఠీ విగ శంకరుండు
  తిష్ఠ వేసుకు కూర్చుండె తేజ ! చూడు
  కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
  యెల్ల వేళల మనలను జల్ల గాను

  రిప్లయితొలగించండి
 6. నీపై పద్యము వ్రాయబూనితి జగన్నిర్మాణ ధౌరేయ మా
  పాపమ్ముల్ హరియింపుమయ్య కరుణాపథోనిధీ జన్మ సం
  తాపమ్ముల్ దరిజేరనీక విలసద్వ్యావృత్త మౌ నీదు చి
  ద్రూపమ్మున్ మదివెల్గఁజేయుమిక సాద్గుణ్యైక భావాత్మకా.

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  ఉభయతారకమైన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం అద్బుతంగా ఉంది. అభినందనలు.
  ‘పాథోనిధి’.. టైపాటువల్ల ‘పథోనిధి’ అయింది.

  రిప్లయితొలగించండి
 8. హరా! పార్వతీశా! మహాకాలకాలా!
  సురేంద్రాది వంద్యా! త్రిశూలాగ్రహస్తా!
  పరా! పాపనాశా! శుభాంగా!మహేశా!
  ధరన్ గావుమయ్యా! వెతల్ దీర్చుమయ్యా!

  రిప్లయితొలగించండి
 9. ధన్యోస్మి గురువుగారూ.

  అంబుజాసనుఁడు దివ్యాంబుజోదరుఁడు నీ
  .......... యాద్యంతముల గాంచనైరి గారె
  విశ్వాంతరాళముల్ భీతిల్లి బెదర వి
  .......... షము మ్రింగుతీవు నీ సముఁడెవండు
  నిజ భక్త తతులకున్ నిజరూపమును జూపి
  .......... ఋజుమార్గమును దెల్పు యజుఁడవీవు
  ఢమరుకాయత్త నాట్యప్రకర్షములచే
  .......... మురిపించు నటరాజ మూర్తివీవు

  నీపదాంబుజ యుగ్మంబు నెమ్మనమున
  భక్తిఁ దలఁచుచు నీస్తోత్ర పాఠములను
  వాక్కులోనుంచి మ్రొక్కెద పరమ గురుఁడ
  నాగభూషణ! నిన్నిక నమ్మినాడ.

  రిప్లయితొలగించండి
 10. ఈశున్ దిక్కని నమ్మితిన్, పదములందేకాగ్రతన్ నిల్పి, వే
  పాశంబుల్ నను ముంచగా శరణు నీవంచున్ మదిన్ దల్చి , నా
  కాశంబెల్లెడ భూమినిండ గని, యా కాలున్, మహా దేవునిన్,
  శ్రీ శంభున్, శశిశేఖరున్, భవునినాశీస్సుల్ సదా వేడితిన్.

  రిప్లయితొలగించండి
 11. గురువుగారూ క్రమాలంకారదోషముగల మొదటిపాదాన్ని క్రిందివిధంగా సవరిస్తున్నాను.

  అంబుజోదరుఁడు దివ్యాంబుజాసనుఁడు నీ
  .......... యాద్యంతముల గాంచనైరి గారె

  రిప్లయితొలగించండి
 12. గంగనుచెంతనుంచుకొని,గౌరిమనోహరుడైనఈశుడే
  బంగముకానితత్వమునభక్తులగావ?తపస్సుజేయుటౌ
  రంగమునందునుండుటన?రాక్షసకృత్యముమాన్పనెంచియే
  నింగికినేలకున్తగిననిత్చలతత్వమునుంచుశంకరా|

  రిప్లయితొలగించండి
 13. శాంతమునందెసౌఖ్యమనిసర్వులునెంచెడిమార్గగామిగా
  బ్రాంతినిమాన్పునీతపసు,భావితరాలకునేర్పనెంచి,వి
  శ్రాంతినిబంచుసాంబశివ|శంకర|కింకరనాశకార|నా
  ద్యంతమునీవెనిండితివి-అంబమనోహర|ఈశ్వరుండవై

  రిప్లయితొలగించండి
 14. గంగనెత్తమీద గంగాధరుండవు
  నాగుపాము మెడన నాగభూష
  కంఠమందు విషము గరళకంఠుండవు
  ఫాలమందు కన్ను శూలధారి!

  రిప్లయితొలగించండి
 15. శరణము శంభో శంకర
  కరుణించీ గావుమయ్య గంగాధరుడా!
  హరహర తప్పుల నెంచక
  పరమార్ధము దెల్పవయ్య పాపవినాశా!!!

  రిప్లయితొలగించండి
 16. లక్ష్మీదేవి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి