13, మార్చి 2015, శుక్రవారం

పద్యరచన - 847

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. సర్వమతముల సారమ్ము సంగ్రహించి
    మతములన్ని దేవుని జేరు మార్గములని
    చాటిచెప్పిన యాధ్యాత్మ సాధకుండు
    రామకృష్ణుండు దుర్గకారాధకుండు

    రిప్లయితొలగించండి
  2. పరమ హంస పేరు పలికినం తనెచాలు
    కలుగు పుణ్య మంట తొలగు నఘము
    భక్తి బోధ జేసి శక్తిదుర్గను గాంచి
    కాళి మాత దయను ఖ్యాతి నొందె
    -----------------------------

    అతడు భార్య ఐన శారదా దేవిని కాళీ మాతగా పూజించాడు

    రిప్లయితొలగించండి
  3. నిరత దీర్ఘ సమాధిని నెలవు జేసి
    తంత్ర మంత్రములన్నింట తపము జేసి
    సకల మతముల నిర్దిష్ట శక్తి నెరిగి
    రమ్య మార్గము జూపె శ్రీరామ కృష్ణ !!

    రిప్లయితొలగించండి
  4. కాళీ భక్తుండీతం
    డాలిని నామాత వోలె ననుకొనె, నాడే
    మేలు వివేకానందుని కే
    వీలుగ సన్మార్గ మిచ్చె విఖ్యాతుండై.

    రిప్లయితొలగించండి
  5. పరమ హంసగ బే రొంది ప్రజల కితడు
    భక్తి భావంబు గలుగగ రక్తి తోడ
    బోధ జేసిన మహితుండు పుడమి యందు
    రామ కృష్ణుడు నాముండు రమ్యు డా ర్య !

    రిప్లయితొలగించండి
  6. ఘనునిగను వివేకానందుఁ దీర్చిదిద్ది
    విశ్వ విఖ్యాతుఁజేసిన విమలుడతడు
    కాళిదర్శనమును గొన్న కర్మయోగి
    మనుజుల మదిలో నిలచిన మాన్యుగురుడు

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఒక్క రోజు తల్లి యొక్కతె బిడ్డను
    పరమ హంస కడకు పట్టి దెచ్చి
    పలికె నిట్లు స్వామి బాలుడు నిత్యము
    బెల్ల మడుగు తినగ వినడు మాట.

    మందలింపు డయ్య మంచిగా వీనిని
    రామకృష్ణు డపుడు భామను గని
    పలికె నిట్లు నీవు బాలుని గొని రమ్ము
    పది దినమ్ము లైన పిదప మరల

    పది దినాల పిదప బాలుని గొని వచ్చె
    పరమ హంస కడకు భామ మరల
    రామ కృష్ణు లపుడు లాలనగా జూచి
    పిల్లవాని వంక మెల్లగాను

    తప్పు బాబు నీవు తరచుగా బెల్లము
    తినుట పనికిరాదు తీపులగును
    పొట్టలోన పాము కుట్టును గట్టిగా
    ననిరి బుజ్జగించి యతని తోడ.

    తల్లి విస్మయమున తమ రిట్టి మాటను
    తొలి దినానె యేల పలుక లేదు
    పిల్ల వాని తోడ బిడ్డడీ పాటికి
    మాని యుండు బెల్ల మనిన దపుడు.

    అమ్మ! బెల్లమన్న నమితమౌ యిష్టమ్ము
    నాకు, నేను తినుచు నయము గాను
    వీని కెట్లు చెప్ప వీలగు న్యాయమే
    తినుట తగదు బెల్ల మనుచు నపుడు.

    ఈపది దినములు మనమున
    బాపితి నీ బెల్లమందు భ్రాంతిని కృషితో
    నీపై చెప్పగ దగుదును
    పాపనికీ మాట కనుక పలికితి ననియెన్.

    గురువులగు పుణ్య పురుషులు
    పరులకు బోధించు చుంద్రు పాటించునదే
    మరి తమ మనమున కర్మల
    పరికింపగ తెల్ల మిద్ది బాలుని కథలో.


    రిప్లయితొలగించండి
  9. కాళికాంబను గొల్చుచు ఘనము గాను
    సతిని దుర్గగ భావించు పతియితండు
    మతము లన్నియు నొకటని హితము దెలిపి
    భక్తి భావమ్ము బోధించె పరమహంస!!!

    రిప్లయితొలగించండి
  10. రామకృష్ణపరమహంస-రానిలోకమెళ్లినా?
    ప్రేమ,భక్తి,శక్తి,యుక్తి-పెంపుజేయుమార్గముల్
    క్షేమమొసగుదైవమన్నచింతకొంతబంచెగా
    కామమందులేదుసుఖము-కర్మమిగులుదిగులునన్

    రిప్లయితొలగించండి
  11. ఎంతవివేకవంతుడివినెవ్వరునెంచనిభక్తితత్వమున్
    చింతిలురామకృష్ణపరిశీలనజేయగనీదుశక్తియే
    అంతములేనిదయ్యుపరమాత్మునిసన్నిదిజేరుమార్గముల్
    కొంతయుదెల్పి-కాళికనుకోరియునిల్పినదైవదూతవే|

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    మీ ‘ఖండిక’ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి