13, మార్చి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1621 (గానము సేయంగ నొప్పు గాడిదల కడన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్.
(గరికిపాటి వారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

26 కామెంట్‌లు:

  1. వీనులవిందగు పాటల
    నేనాడైనజనులు వినునిష్టముతోడన్
    హీనంబౌ నేటి సినీ
    గానము సేయంగనొప్పు గాడిదలకడన్

    రిప్లయితొలగించండి
  2. పానము జేయగ మధువు
    న్నానందము పట్టలేక మైకము నందున్
    వీనుల తేనియ లనుకొని
    గానము సేయంగ నొప్పు గాడిదల కడన్

    రిప్లయితొలగించండి
  3. జ్ఞానము నారసి సుస్వర
    గానము సేయంగనొప్పు ఘనసభలోనన్
    జ్ఞానము లేకనపస్వర
    గానము సేయంగనొప్పు గాడిదలకడన్

    రిప్లయితొలగించండి
  4. వీనులకానందంబుగ
    గానముచేయంగనొప్పు, గాడిదల కడన్
    మౌనమె భూషణమందురు
    మానితముగ మాటవినని మందుల యెడలన్

    రిప్లయితొలగించండి
  5. జ్ఞానము లేనట్టి దనుజ
    మానవుల యెదుటను పాడు మనుగడ కంటెన్
    కానలలోన తిరుగుచును
    గానము చేయంగ నొప్పు గాడిదల కడన్

    రిప్లయితొలగించండి
  6. వీనుల విందగు పాటలు
    గానము సేయంగ నొప్పు, గాడిదల కడ న్
    గానము జేయుట యనునది
    గానమునే గించ పఱఛు గానగు బుడమిన్

    రిప్లయితొలగించండి
  7. జ్ఞానుల ముందర ముదమున
    గానము చేయంగ నొప్పు, గాడిదలకడన్
    వీనుల విందుగ పాడిన
    నీనాము నిడగతలంచి ఈడిచి తన్నున్

    రిప్లయితొలగించండి
  8. వీనుల వెగటాయెనురా
    మానుము నీ పాటలన్న మాన వదేలా
    హీనుడ పొమ్మావల నీ
    గానము సేయంగ నొప్పు గాడిదల కడన్.

    రిప్లయితొలగించండి
  9. గాన పిపాసుల సరసన
    గానముచేయంగనొప్పు, గాడిదల కడన్
    గానారధనకు గాత్రము
    బూనుట ఘాసమ్ము గరిక బుక్కుట సుమ్మీ

    రిప్లయితొలగించండి
  10. వీనుల విందుగ సుమధుర
    గానము సేయంగనొప్పు, గాడిదల కడన్
    పూనిక గొని జేయు నెడల
    మానని గాయమ్ము గలుగు మానసమందున్!!!

    రిప్లయితొలగించండి
  11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి...’శ్లోకం ఆధారంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘గానారాధన’ను ‘గానరధన’ అన్నారు. అక్కడ ‘గానసభ జేసి గాత్రము...’ అందామా?
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. హీనస్వరముగల వటువు
    గాన కచేరిన నొక యవకాశము నడుగన్
    వానిని గని యా గురువనె
    గానము సేయంగ నొప్పు గాడిదల కడన్!

    రిప్లయితొలగించండి
  13. కం.పూనిక కరువైవినుటకు
    గానము రసరమ్యమైనగానమునకటా!
    వీనుల రక్తము కారెడి
    గానము సేయంగనొప్పు గాడిదలకడన్.

    రిప్లయితొలగించండి
  14. జానెడుపొట్టనునింపగ
    గానముసేయంగనొప్పగాడిదలకడన్.
    ఆనాటిఘంటసాలో
    జ్ఞానిగగీతామృతమ్ము-జనమునబాడెన్
    గానమెగాంధర్వంబై
    గానముసేయంగనొప్పు|"గాడిదలకడన్
    గానముజేసినఫలమా?
    మాననిచోరాళ్లుబడునుమనుషులకెపుడున్


    రిప్లయితొలగించండి
  15. కానగ లోటిపిట యందము
    గానముకై చెల్లి ఖరము గాత్రమని వినన్
    కోనల విడి నక్క వచ్చె
    గానము సేయంగనొప్పు గాడిదలకడన్

    రిప్లయితొలగించండి
  16. మానగ కూతను గాడిద
    చేనటు వసుదేవుడొదిగి చేయడె నతులన్
    కానను నవసరమునకై
    గానము చేయంగనొప్పు గాడిదల కడన్

    గానము గార్దభ కంఠము
    వీనుల బడగను చికాకు వెంటనె కలుగున్,
    మానగ నట్టిడు పాటను,
    గానముచేయంగనొప్పు గాడిదల కడన్

    వీనుల విందుగ పికములె
    గానము చేయంగనొప్పు- గాడిదల కడ
    న్నాననముంచగ రాదని
    తానటు తన్నును,సహజపు ధర్మంబిదియే

    గానము గాడిదవలె గన
    నానన శోభను వెలుగగ నా కపి వోలెన్
    మానవు లెవ్వరు నందక
    గానము చేయంగనొప్పు గాడిదల కడన్

    రిప్లయితొలగించండి
  17. కెయెస్గురుమూర్తి ఆచారి గారి పూరణ
    గానకళ మధుర గళ ని
    స్వానమరయగ భగవత్ప్రసాదమ్ము గదా
    వీనుల కసహ్య కరమౌ
    గానము సేయంగనొప్పు గాడిదలకడన్

    రిప్లయితొలగించండి
  18. జ్ఞానము నేర్చిన వారల
    గానము పులకింప జేయు గాంధర్వముగన్,
    జ్ఞానపు వైనము నేర్వని
    గానము సేయంగ నొప్పు గాడిదల కడన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  19. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘నక్క వచ్చె’ అన్నచోట గణదోషం.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్త్రి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు ధన్యవాదములు
    సవరించిన పద్యము
    కానగ లోటిపిట యందము
    గానముకై చెల్లి ఖరము గాత్రమని వినన్
    కోనల విడి నక్క వెడలె
    గానము సేయంగనొప్పు గాడిదలకడన్

    రిప్లయితొలగించండి
  22. తేనెలు గ్రోలగ జేయును
    గానమునా తేనెటీగ గంభీరముగన్ ;
    వీనులు నొచ్చెడి గార్దభ
    గానము సేయంగ నొప్పు గాడిదల కడన్

    రిప్లయితొలగించండి


  23. వేనకు ధరబల్కు! ఖరము
    చానా పాలిచ్చు పాట చక్కగ వినగన్!
    మీ నోరారన్ పాటల
    గానము సేయంగ నొప్పు గాడిదల కడన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. దీనుడు పాపము మగడే
    వీనుల సంగీత మసలు వినజాలనిచో
    వేణువు గైకొని సరసన్
    గానము సేయంగ నొప్పు గాడిదల కడన్

    రిప్లయితొలగించండి