నేను ఇప్పుడేచూసాను గురువు గారికి ఒంట్లో బాగుండ లేదని శ్రమ దీసుకుని బ్లాగు నిర్వహిస్తున్నందుకు ధన్య వాదములు ఐనా ఆరోగ్యం ముఖ్యంగదా ? ముందు ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోవాలి .తొందరగా ఆరోగ్యం కుదుట పడాలని భగవంతుణ్ణి కోరుతూ అక్క .
నా అనుభవం... అది 1971. కాలేజీనుండి అప్పుడే బయటకు వచ్చి వరంగల్లోని ‘డట్టన్స్ హైస్కూల్’లో ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళాను. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు పాఠం చెప్పమన్నారు. దాదాపు అరవై మంది విద్యార్థులు... ప్రిన్సిపాల్ పరంజ్యోతి మేడం, మరో టీచర్ వచ్చి కూర్చున్నాను. సభాభీతి (ఇప్పటికీ ఉంది), అనుభవరాహిత్యం... కాళ్ళు చేతులు వణికి, చమటలు పట్టి ఏదో విధంగా పాఠం చెప్పి చివర సంధులు, సమాసాలు తప్పుగా చెప్పాను. పరిశీలించడానికి వచ్చిన ఆ ఇద్దరికీ తెలుగు వ్యాకరణంలో ప్రవేశం లేకపోవడంతో నాకు ఉద్యోగం వచ్చింది. తొమ్మిదేళ్ళు ఆ పాఠశాలలో పనిచేసి ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందాను. 1980 లో ఎయిడెడ్ పాఠశాలలో ఉద్యోగం దొరికింది.
నా ఆరోగ్యం గురించి సందేశాలు పంపిన మిత్రులకు ధన్యవాదాలు. ఇంకా కుదుట పడలేదు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మత్తేభ శార్దూలాలు తెలుగులోనే కాదు సంస్కృతాది అన్యభాషల్లోనూ ఉన్నాయి. కనుక చివరి పాదాన్ని ‘నిత్తెము ఛందమున వచ్చు నిజమిది కనుమా’ అందామా?
ఎత్తిన "స భ ర న మ య వ "లు చిత్తము నకు ఏమి దెల్పు? చిరు మార్పు గనన్ అత్తరి లఘువుల మార్చగ మత్తేభమునకుగణములు , "మ స జ స త త గల్" కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, ఛందోవైవిధ్యంతో మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు. కాని భావం దురవగాహంగా ఉంది. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, బాగుంది మీ తాజా పూరణ. అభినందనలు. ‘మెత్తని శార్దూలమ్మై’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
నేను ఇప్పుడేచూసాను
రిప్లయితొలగించండిగురువు గారికి ఒంట్లో బాగుండ లేదని
శ్రమ దీసుకుని బ్లాగు నిర్వహిస్తున్నందుకు ధన్య వాదములు
ఐనా ఆరోగ్యం ముఖ్యంగదా ? ముందు ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోవాలి .తొందరగా ఆరోగ్యం కుదుట పడాలని భగవంతుణ్ణి కోరుతూ అక్క .
మొత్తెదను !సభరన మయవ
రిప్లయితొలగించండిమత్తే భమునకు గణములు - మసజస తతగల్
బొత్తుగ కాదుర! త్రాగిన
మత్తున నీవిటులబల్క మర్యాదగునా!
మాష్టారి ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్ధిద్దాం...మాస్టారు ...విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి..మీ ఆరోగ్యమే మాకు మహా భాగ్యం
రిప్లయితొలగించండిసొత్తగు సభరన మయవలు
రిప్లయితొలగించండిమత్తేభమునకు గణములు , మసజస తతగల్
మత్తగు శార్దూల మునకట
పుత్తడి వంటిది తెలుగని పొంగుచు తెలుపన్
----------------------------------
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
ప్రణామములు గురువుగారు,...తగిన విశ్రాంతి తీసుకోండి,...మీరు తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా..
రిప్లయితొలగించండిపొత్తుగ సభరనమయవలు
రిప్లయితొలగించండిమత్తేభమునకు గణములు, మనజసతతగల్
సత్తుగ శార్ధూలమునన్
నిత్తెము వచ్చును ముదముగ నిండుగ తెలుగున్!!!
గురుదేవులకు ప్రణామములు. తమరు త్వరగా కోలుకోవాలని దేవదేవునికి నా ప్రార్థన.
రిప్లయితొలగించండిక్రొత్త తెలుఁగు పండితుఁ డా
రిప్లయితొలగించండియత్తము గానట్టివాఁడు వ్యాకరణమునన్
దత్తఱపడి చెప్పె నిటుల
“మత్తేభమునకు గణములు మసజసతతగల్”
నా అనుభవం...
అది 1971. కాలేజీనుండి అప్పుడే బయటకు వచ్చి వరంగల్లోని ‘డట్టన్స్ హైస్కూల్’లో ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళాను. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు పాఠం చెప్పమన్నారు. దాదాపు అరవై మంది విద్యార్థులు... ప్రిన్సిపాల్ పరంజ్యోతి మేడం, మరో టీచర్ వచ్చి కూర్చున్నాను. సభాభీతి (ఇప్పటికీ ఉంది), అనుభవరాహిత్యం... కాళ్ళు చేతులు వణికి, చమటలు పట్టి ఏదో విధంగా పాఠం చెప్పి చివర సంధులు, సమాసాలు తప్పుగా చెప్పాను. పరిశీలించడానికి వచ్చిన ఆ ఇద్దరికీ తెలుగు వ్యాకరణంలో ప్రవేశం లేకపోవడంతో నాకు ఉద్యోగం వచ్చింది. తొమ్మిదేళ్ళు ఆ పాఠశాలలో పనిచేసి ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందాను. 1980 లో ఎయిడెడ్ పాఠశాలలో ఉద్యోగం దొరికింది.
నా ఆరోగ్యం గురించి సందేశాలు పంపిన మిత్రులకు ధన్యవాదాలు. ఇంకా కుదుట పడలేదు.
రిప్లయితొలగించండి*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మత్తేభ శార్దూలాలు తెలుగులోనే కాదు సంస్కృతాది అన్యభాషల్లోనూ ఉన్నాయి. కనుక చివరి పాదాన్ని ‘నిత్తెము ఛందమున వచ్చు నిజమిది కనుమా’ అందామా?
కం. అత్తరి బాల్యా వస్థలొ
రిప్లయితొలగించండిబొత్తిగ జ్ఞానంబులేక బుద్దియు లేకన్
వత్తిడి పరీక్ష వ్రాసితి
మత్తేభమునకు గణములు మసజసతతగల్.
shankararya!
రిప్లయితొలగించండిసకల శుభ ములు గలిగించు శంకరుండు
ఆయు రా రోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
అత్తా ! సభరనమయవలు
రిప్లయితొలగించండిమత్తేభమునకు గణములు , మసజస తతగల్
పొత్తగు శార్దూల మునకు
మత్తున మఱి జెప్ప వలదు మార్చుచు వాటిన్
రిప్లయితొలగించండిపొత్తుగ నొకటే సూత్రము
చిత్తమున మొదటి గురువును చేయగ లఘువుల్
మొత్తముగా శార్ధూలము,
మత్తేభమునకు గణములు మసజసతతగల్
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బాల్యావస్థలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘బాల్యావస్థను’ అనండి. ‘వత్తిడి’ వ్యావహారికం. ‘ఒత్తిడి’ గ్రాంధికం. అక్కడ ‘బుద్ధియె కఱవై| యొత్తిడి’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. పూరణలో ‘లాజిక్కూ’ బాగున్నది. అభినందనలు.
సత్తా జూపుచుఁ దడబడి
రిప్లయితొలగించండిసత్తెము' శార్దూలమునకు సభరనమయవల్!
పొత్తని గుర్తెరుగక యనె
మత్తేభమునకు గణములు మసజసతతగల్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సొత్తుగ సభరన మయవలు
రిప్లయితొలగించండిమత్తే భమునకు గణములు - మసజస తతగల్
వ్రుత్తము శార్ధూల మగున్
చిత్తము రంజిల్ల కవులు శ్రీకార మిడన్
రిప్లయితొలగించండిబెత్తము చేపట్టినయా
క్రొత్త తెలుఁగు పండితుఁనకు రోజుచు తెలిపెన్
జిత్తుల ఛాత్రుం డార్యా
మత్తే భమునకు గణములు - మసజస తతగల్
వృత్తమున "సభరనమయవ "
రిప్లయితొలగించండిమత్తేభమునకుగణములు!మసజసతతగల్
మత్తేభమునకె యన్నను
వృత్తములే ప్రాప్తియౌను వృధయౌచదువే !!!
అత్తా|సబరనమయవలు
రిప్లయితొలగించండిమత్తేభమునకు,గణములు-మసజసతతగల్
మొత్తముశార్దూలమునకు|
చిత్తమునందుంచుమత్త-చెరపకుమదిలో
అత్తే తరగతిగురువని
రిప్లయితొలగించండిమత్తేభమునకు గణములు-మసజసతతగల్
క్రొత్తగ కోడలుదెలుపగ?
సత్తాజూపించుటందు-శార్దూలమగున్|
ఎత్తిన "స భ ర న మ య వ "లు
రిప్లయితొలగించండిచిత్తము నకు ఏమి దెల్పు? చిరు మార్పు గనన్
అత్తరి లఘువుల మార్చగ
మత్తేభమునకుగణములు , "మ స జ స త త గల్"
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచిత్తమ్ము నకు వెరపుగలుగ-జేసిన యత్త మరదులు
మత్తేభమునకు గణములు - మసజస తతగల్ చిరుతగ
నత్తకు తగుజామి వచ్చె-ననగ గేహమ్మున పగటు
లెత్తగ తగవులు బాపు -రే వచించను నోరు రాదు
ఒత్తుగ సభరనమయవల్
రిప్లయితొలగించండిమత్తేభ మొదటి లఘువుల మార్చగ గురువై
యుత్తమ శార్దూలమగుట
మత్తేభమునకు గణములు మసజసతతగల్
మొత్తము సభరనమయవల్
మత్తేభమునకు గణములు-మ,స,జ,త,త,గల్
యుత్తమ శార్దూలమగును
నొత్తిన,వృత్తములు రెండునుత్తమ రీతుల్
ఉత్తముడనంచు నొకరుడు
నత్తరి పండిత సభనటుననెగా తప్పున్
చెత్తగ,నగరే యందరు
"మత్తేభమునకు గణములు మసజసతతగల్"
ధూత్తెరి!చెప్పిన దెవరిటు?
రిప్లయితొలగించండిమత్తేభమునకు గణములు మసజసతతగల్
మత్తున చెప్పెనొ యేమో?
సత్తెము నేనిటు వచింతు సభరనమయవల్.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిఛందోవైవిధ్యంతో మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
కాని భావం దురవగాహంగా ఉంది.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారు మీరు ఇచ్చిన corrections చేసినాను
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు నా భావం
అత్తయు మామయు మరదులు
మత్తే భమునకు గణములు - మసజస తతగల్
మెత్తని శార్దూలముయై
క్రొత్త వధువు యత్త నెదిరి కోరలు జూపెన్
ముత్తెములు సభరనమయవ
రిప్లయితొలగించండిమత్తేభమునకు గణములు మసజస తతగల్
మత్తెక్కించునుమనసుకు
సత్తెము నామాటవినుము శార్ధూలమునన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ తాజా పూరణ. అభినందనలు.
‘మెత్తని శార్దూలమ్మై’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొత్తముగా నిరువదిగద
రిప్లయితొలగించండిమత్తేభమునకు; గణములు మసజసతతగల్
బొత్తిగ పనుతొమ్మిదియే
పొత్తుగ నక్షరము లవియె పొందుగ కూడన్
రిప్లయితొలగించండిఅత్తా! సభరన మయవల్
మత్తేభమునకు గణములు, మసజసతతగల్
సత్తెము శార్దూలంబగు
నత్తా! పండిత సభ జతనము వలయునుగా
జిలేబి
చిత్తుగ సభరనమయవల్
రిప్లయితొలగించండికత్తెరతో కోసికొంత ఘనమగు ప్రీతిన్
సత్తువ గొని యతికించగ
మత్తేభమునకు గణములు మసజసతతగల్