5, మార్చి 2015, గురువారం

పద్యరచన - 839

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. కామ దహనము జరుపగ కాశి వాసు
  కాలి బూడిద గామారె కాముడంత
  పతిని బతికించి పంపెను సతియు వేడ
  అంత హోలిని జరిపిరి హరుని జేరి.

  కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా ఆ పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. . దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ.

  రిప్లయితొలగించండి
 2. భస్మ మైనట్టి తన భర్త భవుని దయను
  దిరిగి బ్ర దుక ర తీదేవి పరమ సంత
  సమున బంధు వర్గము రాగ జరుపు కొనెను
  హోళి నాబ డు పండుగ హొయల తోడ

  రిప్లయితొలగించండి
 3. మంగళకరముగ హోళీ
  రంగులు హరిపైకిఁ జల్లి లాస్యము లాడన్
  పొంగిన సంతస మందున
  రంగడు సైతము నటించె రమణుల తోడన్!

  రిప్లయితొలగించండి
 4. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. కరుణఁజూపి తనపతిని కావమంచు
  కాముని సతి తా ప్రార్థింప కాలకాలు
  శివుడు కరుణించి బ్రతికించె సిరితనయుని
  కేళికల్ జరిపిరిసురల్ హోళి పేర

  రిప్లయితొలగించండి
 6. తరుణుల గూడి మాధవుడు తారలతో శశి వోలె నాటలన్
  మురియుచు మానినీ హృదయ పుష్కరముల్ వికసింప యామునీ
  శరముల హోళి పూర్ణిమను సారసపత్రపు నీటిబిందువై
  తిరిగిన వేళ లోకములు తీయని వేదన నొందె నెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 7. రంగులహోళీపండుగ
  సింగారముచూడతరమ?శ్రీకృష్ణుండే
  అంగనలకామితంబగు
  పొంగెడిరంగేళిహేళనూహించగిదే|

  రిప్లయితొలగించండి
 8. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మనోహరమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. రంగులహోలిపండుగకు-రాత్రికిచంద్రుడురాగ?కామినీ
  పొంగునుపంచిపెంచు|మనపూర్వులునెంచినసంబరాలతో
  చెంగునకృష్ణ్డుడట్లుతనచెంతనజేరినసుందరాళితో
  హంగులచేవసంతమునుఅంతరమందునజల్ల?జల్లులే|

  రిప్లయితొలగించండి
 10. రంగుల జలమును జల్లుచు
  పొంగారుచు నాడుచుండె మురళీధరుడే
  నింగిన శశికాంతులలో
  రంగనిగని మురిసిపోయె రమణీ మణులే !!!

  రిప్లయితొలగించండి
 11. రంగుల యుత్సవంబు మధురంపు వసంతమునందు వచ్చు నా
  నింగికి నేలకున్ నడుమ నెయ్యడ జూచిన రంగులేసుమా
  చెంగున గెంతులేయుచును చేయుచు నాట్యము పాటపాడుచున్
  రంగులు జల్లుకొంచుకడు రమ్యముగా జను లాడు హోలినే

  రిప్లయితొలగించండి
 12. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మొదటి పాదంలో నేను గమనించని గణదోషాన్ని సవరించినందుకు సంతోషం. స్వస్తి!

  రిప్లయితొలగించండి
 14. గోపికలెల్లరు నదిలో
  గోపాలునితో నగవుల కొంగ్రొత్త కళల్
  తోపింప రంగు కలసిన
  నాపమ్ముల నాడుచుండ్రి యందరు గనుడీ.

  రిప్లయితొలగించండి
 15. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి