23, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణము - 1630 (తేటగీతి యయ్యె నాటవెలఁది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
తేటగీతి యయ్యె నాటవెలఁది.

15 కామెంట్‌లు:

  1. నిదురమాని చేయనెంచి పూరణమును
    మత్తులో చదివి సమస్య నేను
    పూరణమ్ములోన పొరబాటు దొరలెను
    తేటగీతియయ్యెనాటవెలది

    రిప్లయితొలగించండి
  2. నాటకమున తాను నర్తించుచుండెను
    తేట జూపు పాట నోట రాగ
    తన్మయంబునొంది తరలేక్షణను జూడ
    తేటగీతి యయ్యె నాటవెలఁది!!

    రిప్లయితొలగించండి
  3. వృత్త మంచు వ్రాయ చిత్తమే లేదంచు
    తుదకు వెదకి నంత దొరికె పదము
    మత్తు గాను వ్రాసి చిత్తమలర గాంచ
    తేట గీతి యయ్యె నాట వెలఁది

    రిప్లయితొలగించండి
  4. క్రొత్త రాజు వచ్చి కొలువు దీర్చిన వేళ
    పేర్లు మార్చ మనియె పేట పేట
    రాజు తలచి నంత రాయి నాణె మవును
    తేట గీతి యయ్యె నాట వెలది

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె. తేటతెనుగులోన తియ్యగా రచియిస్తి
    కావ్యకన్యయొక్కకధనునేను
    పొద్దు లేచి చూడ ముద్దైన భామగా
    తేటగీతియయ్యెనాటవెలది

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి యయ్యె నాటవెలది యార్య !
    పద్య పాద మపుడు బాగు చూడ
    కుదర లేదు రాత్రి కునుకుప ట్టు కతన
    నటుల మారె , నింక నట్లు రాదు

    రిప్లయితొలగించండి
  7. తేట గీతిలోన పాటను బాడుచు
    నాటవెలది యాడె నద్బుతముగ
    జూచు వార లనిరి చోద్యమ్ము గాదొకొ!
    తేటగీతి యయ్యె నాట వెలది!!!

    రిప్లయితొలగించండి
  8. తేట పద్యములను దీటుగాఁబాడుచు
    పేరుఁబొందినట్టి నారిఁజూచి
    వాడనున్న జనులు పల్కిరి ముదమున
    తేటగీతి యయ్యె నాటవెలది

    రిప్లయితొలగించండి
  9. ఇను డొకండు, నింద్రు లిర్వురు, సూర్యులు
    నిద్ద రైన తెలుపు మేమి ? మువ్వు
    రర్కు, లింద్రు లిద్ద, రాదిత్యు లేవురు?
    తేటగీతి యయ్యె, నాటవెలఁది.

    రిప్లయితొలగించండి
  10. నిన్నటి సమస్యాపూరణం:
    క్రమాలంకార పూరణము...
    విశదంబై రఘు రాముడా క్షణమె నిర్వీర్యంబొనర్చంగనా,
    దిశమార్చన్ హరి, జ్ఞాన భాగ్యమున దా ధీరుండుగా దూకడే,
    వశుడై తారను గూడె చందురుడు తద్భావంబు తప్పైనయున్,
    దశకంఠున్ దునుమాడె,నర్జునుఁడనిన్, దారాశశాంకమ్మునన్
    నేటి సమస్యాపూరణం:
    గణపు గుట్టు దెలిసి గణవంతుడై తాను
    యతుల గతుల ప్రాస యతుల బలిసి
    మాన్యు డయ్యు కొద్ది మార్పుల జేయగన్
    తేటగీతి యయ్యె నాటవెలది.

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి నేర్వ తీరుబడిగ నొక్క
    క్రొత్త కవి వరుండు కోరి వ్రాసి
    గురువు గారి కిచ్చి సరిచూడమని కోర
    తేటగీతి యయ్యె నాట వెలది

    రిప్లయితొలగించండి
  12. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమస్కారములతో,

    తేఁటి గీతి నాడు మేటి యాటవెలఁది
    యాట వెలది కాన; నాటవెలఁదిఁ
    గూర్చి తేట గీతిఁ గూర్ప సుకవిరాజు
    తేటగీతి యయ్యె నాటవెలఁది!

    తేఁటి గీతి = భ్రమరగీతము.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  13. డబ్బుబెట్టికొనెడి దర్జాలవాడికి
    తేటగీతి యయ్యె-నాటవెలది|
    చేటుగలిగినపుడు?దాటికికందమై
    చింతబెరుగ బ్రతుకు?సీసమగును|
    తేటగీతియయ్యె నాటవెలదిగాదు
    ఆటవెలదిగాదుతేటగీతి
    అన్నచందముండు నద్భుతరచయిత
    లందజేయుపద్యలౌక్యమందు|

    రిప్లయితొలగించండి
  14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు పూరణలో చెప్పినట్లు మన మిత్రుల్లో కొందరు అటువంటి పొరపాట్లు ఎక్కువగానే చేశారు. అటువంటి సంధర్భాలలో పై మూడుపాదలను సమస్యపాదానికి అనుగుణంగా సవరించడం చేశానుకూడా. కొన్నిసార్లు అలా సవరించడం వీలుకాక సమస్యపాదాన్ని కూడా (కేవలం వారికోసమే) మార్చడం జరిగింది. ఇవన్నీ ఆటలో అరటిపండు!
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అక్కయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    (మనలో మాట! నాలుగు పాదాల్లో మూడవపాద మొక్కటే మీదనుకుంటాను!)
    *****
    భళ్లముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రచియిస్తి’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘వ్రాసితి/ కూర్చితి’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఇంక నట్లు రాదు’... అన్వయం?
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    నిన్నటి సమస్యకు మీరు చేసిన చేసిన, ఈనాటి సమస్యకు పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ‘ఆటవెలఁది’తో ఆటాడి తేటగీతాన్ని వినిపించారు. అద్భుతమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. దత్తపది ని తేటగీతి లో పూరించండి.
    ఇవ్వబడిన పదాలు: తమన్న, సమంత, కాజల్, త్రిష

    రిప్లయితొలగించండి