26, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణము - 1632 (దారము లేకుండ పుష్పదామము లల్లెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దారము లేకుండ పుష్పదామము లల్లెన్.

21 కామెంట్‌లు:

  1. ఏరెను పూజించగ నా
    భారతి భక్తిన్ సుమములు పలురకముల బృం
    దారముగా నే చెత్తచె
    దారము లేకుండ పుష్పదామము లల్లెన్

    రిప్లయితొలగించండి
  2. శౌరిని బూజించదలచి
    వారిజలోచన హరువగు ఫల్యంబులతో
    చారిమముగ గట్టుచు మం
    దారము లేకుండ పుష్ప దామము లల్లెన్ !!!

    రిప్లయితొలగించండి
  3. చారువు పలికెను ప్రియముగ
    దారము లేకుండ పుష్ప దామము లల్లెన్
    కోరిన దెచ్చెద నీకని
    తారను గనినంత ముదము తన్మయ మందున్

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఔరా ! యెంతటి నేర్పరి ?
    దారము లేకుండ పుష్ప దామము లల్లెన్
    వారికి జేతును నతులను
    వారెవరో తెలుపుడా ర్య !వడివడి గమఱి న్

    రిప్లయితొలగించండి
  6. ఆరాము నుండి చేకొని
    పోరిగుడికినేగితాను పొందిక తోడన్
    శౌరికి ప్రియముగ చెత్త చె
    దారము లేకుండ పుష్ప దామము లల్లెన్

    రిప్లయితొలగించండి
  7. మారెడిమార్పులుయెన్నో
    జేరిన?దైవంబుగూర్చుచిత్రముగనగా?
    కారణమెరుగనిచెట్టుకు
    దారము లేకుండ పుష్పదామములల్లెన్
    ----------

    రిప్లయితొలగించండి
  8. హారముఁ గీయగ మరువన్
    శ్రీరాముని కంఠమందు సింగారింపన్
    మారుతి కుంచెను గదుపుచు
    దారము లేకుండ పుష్పదామము లల్లెన్!

    రిప్లయితొలగించండి
  9. హారముకాధా రంబగు
    దారములేకున్న?నిలచు తగునేర్పరిగా
    కోరియు వేసినచిత్రము
    దారములేకుండ పుష్ప దామము లల్లెన్

    రిప్లయితొలగించండి
  10. మీరిన భక్తి గలిగి గురు
    వారము నేడనుచు సాయి భక్తుండొకడున్
    తీరికగా విరులకు చే
    దారములేకుండ పుష్పదామములల్లెన్

    చేదారము = నష్టము

    రిప్లయితొలగించండి
  11. వారణమెరుగని భక్తిని
    తోరపుగుణుడగు వికుంఠు తుష్టుగ గొలిచెన్,
    సారముగాగను పోతన
    దారములేకుండ పుష్పదామములల్లెన్

    సారపు సంగీతమునను
    ధీరుని రాముని పొగడుచు తిరమగు కృతులన్
    ధీరుడు త్యాగయ యిడెగద
    దారము లేకుండ పుష్పదామములల్లెన్

    తోరపు నుత్పలమాలిక
    ధీరుడు పెద్దన్నచెప్పి తిరముగ సభలో
    ధారగ,పితామహుండయి
    దారము లేకుండ పుష్పదామములల్లెన్

    తీరిచె వేంకట పతిపయి
    ధీరుడు నన్నయ్య కృతుల తేటగుతెనుగున్
    సారపు పదముల పాడడె
    దారము లేకుండ పుష్పదామములల్లెన్

    రిప్లయితొలగించండి
  12. మారిన నైపుణ్యంబుల
    తీరుగ గణనంపు యంత్ర తెరపై యొకడే
    తోరణముల చిత్రించుచు
    దారము లేకుండ పుష్పదామములల్లెన్

    రిప్లయితొలగించండి
  13. చేరుచు కోసిన పూవుల
    తీరగు కనకాంబరమ్ము తెల్లని మల్లెల్
    పేరుగ గ్రుచ్చుచు సతి మం
    దారము లేకుండ పుష్పదామములల్లెన్.

    రిప్లయితొలగించండి
  14. దారము కొరకై వెదకిన
    దా రమ, లభియించ బోక యరటి తడపతో
    తీరుగ నందము చిందగ
    దారము లేకుండ పుష్పదామము లల్లెన్.

    రిప్లయితొలగించండి
  15. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘మార్పులు+ఎన్నో’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘మార్పు లవెన్నో’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    భేష్! చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించించి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. బారుగ మాన్సంపంగుల
    నేరుపుతో కాడ కాడ నిమ్మళముంగా
    తోరమువలె ముడివేయుచు
    దారము లేకుండ పుష్పదామము లల్లెన్

    రిప్లయితొలగించండి


  17. కారము లేక రసంబున్,
    సారము లేని కవనమ్ము చక్కర లేకన్
    క్షీరాన్నము వండుచు,హా!
    దారము లేకుండ పుష్పదామము లల్లెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. కర్ణాటకంలో సోనియ, 2018

    పోరాటములో నోడియు
    వైరుల వైరులను కూడి పడతియె గెలిచెన్
    ఔరా! ఇదియెట్లన్నన్
    దారము లేకుండ పుష్పదామము లల్లెన్

    రిప్లయితొలగించండి