రాజేశ్వరి అక్కయ్యా, దేవుని వింతసృష్టిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఉండెన్+ఇంకను (ఇంకా అన్నది వ్యావహారికం)’ అన్నప్పుడు యడాగమం రాదు. నాలుగవ పాదంలో గణదోషం. ‘శంకరుని వింత లెన్నియొ| పంకజము బురదను బుట్టి పరిమళ మిడదా’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, వంకలున్న చెఱకుగడను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వంకాయను’ అన్నచోట ‘వంకా+ అను’ అని మీ భావమా? ***** నాగరాజు రవీందర్ గారూ, చెఱకురసంలో పడ్డ వంకాయను గురించిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, వంకాయకూర అంత మధురంగా ఉందన్నమాట! బాగుంది మీ పూరణ. అభినందనలు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, మిత్రుల పద్యాల గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు. రాజేశ్వరి గారి పద్యానికి సవరణ సూచించాను. అన్నపరెడ్డి గారిది కందపద్యమే.. మొదటి పంక్తి వచనం. తరువాతి నాలుగు పాదాలు కందం. ఇక లోకవింతలను, వంకాయపులుసును గురించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘సత్యము+ఇంకను (ఇంకా అనడం వ్యావహారికం)’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఇంక’ పునరుక్తమయింది. అక్కడ ‘సత్య| మ్మింకను కనుగొనగ నుంటి మెన్నిటిని భువిన్’ అనండి. రెండవ పూరణలో ‘ఓయమ్మ+అనగా’ అన్నప్పుడు సంధి లేదు. ‘ఇంకొంచెము’ గ్రామ్యం. అక్కడ ‘ఓ యమ్మ యన| న్నింకను చక్కెర కలుపగ...’ అందామా? ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వంకాయచెట్టు, చెఱకుగడ ప్రక్కప్రక్కనే పెరినవని చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, వంకాయకూర మాధుర్యాన్ని వివరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, సమస్యపాదాన్ని బొంకుగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కాయడంతో అనే అర్థంలో ‘కావం’ అన్నారు కాని అది గ్రామ్యం.
Prasad Piratla గారూ- మొదటి చివరి పదములు పద్యములో భాగం కాదు. మొదటి పదము వివరణ, చివరి పదము అర్థము. వంక అంటే వాగు / A rivulet or watercourse (వాగులు వంకలు)క్రషరు లో పెట్టినప్పుడు కారేధార వాగులాఉన్నది అని నా అభిప్రాయం.
రాజేశ్వరమ్మ గారు మీరు చెప్పిన గురువులలో నేను వుంటే మన్నించి నన్ను ఆ పట్టికలో చేర్చకండి . మీరు పెద్దవారు నాలాంటి చిన్నవారిని ఆసీర్వదించాలె గాని నాకు నమస్కారం తెలుపవద్దని సవినయంగా కోరుతున్నాను .తప్పులు మానవసహజం చూస్తూ చూస్తూ మంచి పద్యం లో తప్పులు సహించలేక తెలిపిన చేష్టలే కాని వేరొకటి కాదని మనవి.
పిరాట్ల ప్రసాద్ గారూ, మీరు ‘సుబ్బా’ అని సంబోధిస్తూ వ్రాసిన పద్యం పూర్వపరాలు బోధపడలేదు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
టెంకాయను తీపి జలము
రిప్లయితొలగించండివంకాయను చెఱకు రసము వడియుచు నుండెన్
యింకా దేవుని వింతలు
పంకజ ముబురద నుండి పరిమళ మిడగన్
గానుగలో నుంచిన చెఱుకుగడ గురించి
రిప్లయితొలగించండివంకలులేకుండ పెరిగి
బంకగరుములను దిగుబడి బాగుండుటతో
బింకముగా గడలుండను
వంకాయను చెఱుకురసము వడియుచు నుండెన్
బంక గరుములు: బంక యిసుక నేలలు
టెంకాయ జలము తోడన్
రిప్లయితొలగించండిపంకజముఖి భార్యవండ పతియే నెలమిన్
పొంకమ్ముగనిట్లనియెన్
వంకాయ ను చెఱకురసము వడియుచు నుండెన్!!!
అమ్మా రాజేశ్వరి గారు మీ పద్యం లో చివరి పాదం లో ఆఖరి మూడు గణాలు భంగామయ్యాయి .యతి కూడా సరిచేయగలరని ప్రార్థన. తప్పు చెప్పిన మన్నిచగలరు.
రిప్లయితొలగించండిసత్యనారాయణ రెడ్డి గారు మీ పద్యం యే చందం లోనిదో దయచేసి తెలుపగలరు.
రిప్లయితొలగించండివంకాయ బాగ పెరిగెను
రిప్లయితొలగించండిపొంకముగా ప్రక్కనున్న పొడవౌ మ్రానా
వంకకు కదలుచు గీరగ
వంకాయను చెఱకు, రసము వడియుచు నుండెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకేమియు లేదు తినుము
రిప్లయితొలగించండివంకాయను చెరుకు రసము వడియుచునుండెన్
వంకర యాలోచనలిటు
కుంకా! నీకెపుడువలదు కూర్చుని వినుమా!
వంకాయ కూర అంటే నచ్చని పిల్లవానికి తల్లి చెప్పిన హితము.
కం. బొంకే మిగాదు సత్యము
రిప్లయితొలగించండియింకా యిటువంటిజూడ యింకెన్నిలలో
సంకరజాతులుకనుగొన
వంకాయను చెఱకురసము వడియుచునుండెన్.
కం.వంకాయపులుసుకలుపగ
రిప్లయితొలగించండిఓంకారమువచ్చుచుండెనోయమ్మనగా
నింకొం చెముకలిపషుగరు
వంకాయను చెఱకు, రసము వడియుచు నుండెన్.
బొంకులు బలుకుట మానుము
రిప్లయితొలగించండివంకాయను చెఱకు రసము వడియుచు నుండె
న్నింకను నెందున నేమియు
సంకరములు కారు చెపుమ ,శర్మా ! నాకున్
వంకాయ కూర మధురము
రిప్లయితొలగించండివంకాయది ధప్పళాన పరగును రుచితో
నింకిన బెల్లపురసమున
వంకాయది చెరుకురసము వడియుచు నుండెన్
బింకంబయ్యెడు మావియ
పొంకంబౌ 'చెరుకురసము'పొల్పుగ కాచెన్
కొంకక మందుల చేకా
వం,కాయను చెరుకురసము వడియుచునుండెన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిదేవుని వింతసృష్టిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఉండెన్+ఇంకను (ఇంకా అన్నది వ్యావహారికం)’ అన్నప్పుడు యడాగమం రాదు. నాలుగవ పాదంలో గణదోషం. ‘శంకరుని వింత లెన్నియొ| పంకజము బురదను బుట్టి పరిమళ మిడదా’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
వంకలున్న చెఱకుగడను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వంకాయను’ అన్నచోట ‘వంకా+ అను’ అని మీ భావమా?
*****
నాగరాజు రవీందర్ గారూ,
చెఱకురసంలో పడ్డ వంకాయను గురించిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
వంకాయకూర అంత మధురంగా ఉందన్నమాట! బాగుంది మీ పూరణ. అభినందనలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
మిత్రుల పద్యాల గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
రాజేశ్వరి గారి పద్యానికి సవరణ సూచించాను.
అన్నపరెడ్డి గారిది కందపద్యమే.. మొదటి పంక్తి వచనం. తరువాతి నాలుగు పాదాలు కందం.
ఇక లోకవింతలను, వంకాయపులుసును గురించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘సత్యము+ఇంకను (ఇంకా అనడం వ్యావహారికం)’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఇంక’ పునరుక్తమయింది. అక్కడ ‘సత్య| మ్మింకను కనుగొనగ నుంటి మెన్నిటిని భువిన్’ అనండి.
రెండవ పూరణలో ‘ఓయమ్మ+అనగా’ అన్నప్పుడు సంధి లేదు. ‘ఇంకొంచెము’ గ్రామ్యం. అక్కడ ‘ఓ యమ్మ యన| న్నింకను చక్కెర కలుపగ...’ అందామా?
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వంకాయచెట్టు, చెఱకుగడ ప్రక్కప్రక్కనే పెరినవని చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
వంకాయకూర మాధుర్యాన్ని వివరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
సమస్యపాదాన్ని బొంకుగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాయడంతో అనే అర్థంలో ‘కావం’ అన్నారు కాని అది గ్రామ్యం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిPrasad Piratla గారూ- మొదటి చివరి పదములు పద్యములో భాగం కాదు. మొదటి పదము వివరణ, చివరి పదము అర్థము. వంక అంటే వాగు / A rivulet or watercourse (వాగులు వంకలు)క్రషరు లో పెట్టినప్పుడు కారేధార వాగులాఉన్నది అని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండిసంకర తియ్యటి పొత్తులు
రిప్లయితొలగించండిచంకల నెగరే సితినుట చక్కగ తెలియన్
బొంకులు చెప్పని నాపై
ఇంకను కోపమ దియేల మేధా!సుబ్బా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్య గారు నా పద్యము లో సత్యం + ఇంకా అని సంధి చేయలేదు అది సత్యము , ఇంకా మాత్రమె.
రిప్లయితొలగించండిఇంకా రెండపద్యము కొంచెము మార్చిన పిదప
వంకాయపులుసుకలుపగ
ఓంకారమువచ్చుచుండెవొద్దని యనినన్
నింకొం చెముకలుపషుగరు
వంకాయను చెఱకు, రసము వడియుచు నుండెన్
వంకాయలంటే పడని పతి సంతలో సతితో:-
రిప్లయితొలగించండిమంకునువీడుము కొనకుము
వంకాయను - చెఱకురసము వడియుచునుండెన్
బంకున త్రాగుదమది నే
నింక నడువలేను చాలునింటికి చనుమా
చెరకు పంట కోతకు వచ్చింది.....పొద్దు గ్రుంకుతున్నది చెరకు పంట కోయడాని సమయము లేదంటూ ఒక ఆసామి పనివాళ్ళకు చెబుతున్నట్లుగా...
రిప్లయితొలగించండిఇంకా యేమిటి చోద్యము
ఢంకా భజియించి చెప్పడములేదిచటన్
గ్రుంకగనేగుచునినుఁడా
వంకాయను చెఱకు రసము వడియిచునుండెన్.
వంకాయలునొకపాత్రన
రిప్లయితొలగించండిబంకగునాచెరుకుపట్టియువండన్
టంకములేనివిపాత్రలు
వంకాయనుచెరుకురసమువదియుచునుండెన్
నమస్కారములు
రిప్లయితొలగించండిపొరబాట్లను సవరించిన గురువులకు ధన్య వాదములు
రాజేశ్వరమ్మ గారు మీరు చెప్పిన గురువులలో నేను వుంటే మన్నించి నన్ను ఆ పట్టికలో చేర్చకండి . మీరు పెద్దవారు నాలాంటి చిన్నవారిని ఆసీర్వదించాలె గాని నాకు నమస్కారం తెలుపవద్దని సవినయంగా కోరుతున్నాను .తప్పులు మానవసహజం చూస్తూ చూస్తూ మంచి పద్యం లో తప్పులు సహించలేక తెలిపిన చేష్టలే కాని వేరొకటి కాదని మనవి.
రిప్లయితొలగించండిధన్యోస్మి
విధేయుడు
పిరాట్ల.వెంకటశివరామకృష్ణ ప్రసాదు
పిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీరు ‘సుబ్బా’ అని సంబోధిస్తూ వ్రాసిన పద్యం పూర్వపరాలు బోధపడలేదు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
subbaarao gaaru పద్య రూపం లో నామీద ఆగ్రహం వ్యక్తపరుస్తూ బొంకులు పలుకుట మానుము అంటూ చివరకి " న్నింకను నెందున నేమియు
రిప్లయితొలగించండిసంకరములు కారు చెపుమ ,శర్మా ! నాకున్" అన్నారు . దానికి సమాధానము గా పద్యము వ్రాసాను.అంతే .
నిన్నటి సమస్యాపూరణం :
రిప్లయితొలగించండితమ్ముని భరతని రాజుగ
ముమ్మాటికిఁ జేయనెంచి పోరిన కైకన్
నెమ్మనమున రఘు రాముం
డమ్మా! యని పిలిచి నంత నాగ్రహమందెన్!
నేటి సమస్యాపూరణం :
ఇంకను 'వాణీ జయరాం '
యంకిత భావమున పాడ నానందముగన్
సంకీర్తన లొలుకుచు, గొరు
వంకా! యను చెరకు రసము వడియుచు నుండెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఇంకను 'వాణియు,జానకి '
రిప్లయితొలగించండియంకిత భావమున పాడ నానందముగన్
సంకీర్తన లొలుకుచు, గొరు
వంకా! యను చెరకు రసము వడియుచు నుండెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
పంకజముఖి వోలుననిరి
రిప్లయితొలగించండివంకాయను; చెఱకురసము వడియుచునుండెన్
కింకరుని చేతి నుండిన
చింకిది యౌపాత్రనుండి చిటపట యనుచున్
రిప్లయితొలగించండిటెంకాయననమృతమ్మును
వంకాయను చెఱకురసము, వడియుచునుండెన్,
బింకము తో భామయునట
లంకెల లంకెల పదమ్ములన్ గూర్చగనే !
జిలేబి
వంకాయ గుత్తి కూరను
రిప్లయితొలగించండిలంకేశుని గెల్చినంత రమణులు వండన్
ఢంకా బాదగ కపులే
వంకాయను చెఱకురసము వడియుచునుండెన్