21, మార్చి 2015, శనివారం

సమస్యా పూరణము - 1628 (కరిముఖుని జన్మదినమె యుగాది గాదె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కరిముఖుని జన్మదినమె యుగాది గాదె.

12 కామెంట్‌లు:

  1. జగతి శుభముల నందించ జనన మంది
    విఘ్న నాయకు డనుపేర వెలసి తీవు
    శర్వు డైనను ముందుగ జపము జేయు
    కరిముఖుని జన్మ దినమె యుగాది కాదె

    అందరికీ ఉగాది శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. భాద్రపద శుద్ధ చవితిన పరశుధరుడు
    కరిముఖుని జన్మదినమె, యుగాది గాదె
    చైత్ర శుద్ధ పాడ్యమి నాడు చక్క గాను
    వైభవంబుగ వచ్చును శుభము లిడుచు !!!

    రిప్లయితొలగించండి
  3. భాద్ర పదమాస పుచవితి భవ్యు డైన
    కరిము ఖుని జన్మ దినమె, యు గాది గాదె
    చైత్ర మాసపు పాడ్యమి శర్మ !తెలియు
    మీవి షయములు ప్రతియేట యిదియె క్రమము

    రిప్లయితొలగించండి
  4. కనక దుర్గమ జనులకు కరుణజూపి
    సర్వ లోకాల విఘ్నాలు చక్కదిద్ద
    తనయు బడయెగ జగములు తలచె నాడు
    కరిముఖుని జన్మ దినమె యుగాది కాదె

    రిప్లయితొలగించండి
  5. భాద్రపద శుక్ల చవితిన భైరవి సుతు
    కరిముఖుని జన్మదినమె; యుగాది గాదె
    చైత్ర శుక్ల పాడ్యమినాడు సంజ వేళ
    లోన కవుల సమ్మేళన మొప్పు రోజు.

    రిప్లయితొలగించండి
  6. వక్రతుండుని రూపము ప్రక్క నుండి
    సొంపుఁ గూర్చు నోంకారమై చూడ రండు

    కరిముఖుని, జన్మదినము యుగాది గాదె
    సృష్టి యాదికోంకారమై చెల్లు గాన!

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    లాజిక్కుతో కూడిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వేంకటప్పయ్య గారూ,
    బహుకాల దర్శనం... సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీకేంబాయితిమ్మాజీరావుగారిపూరణం
    ------------
    బాద్రపదశుక్లచవితియేభద్రసుతుడు
    కరిముఖునిజన్మదినమె యుగాదిగాదె
    చాంద్రమానర్థములనువసంతఋతువు
    చైత్రశుద్ధపాడ్యమియేపవిత్రదినము

    రిప్లయితొలగించండి
  9. మీరుదేల్పినదేనిజ-మేమిటనగ
    కరిముఖునిజన్మదినమెయుగాదిగాదె
    చైత్రమాసానపాడ్యమి-యాత్రచేత
    మన్మధాజ్ఞగ?వచ్చుసన్మానమందు|


    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. సృష్టి సలుపంగ నాదిని సృష్టి కర్త
    విష్ణునాజ్ఞను మొదలిడె వేడుకగను
    శృతుల ధర్మాల సూత్రాల చెలువు,శృతుల
    కరి ముఖుని జన్మదినమె యుగాదికాదె

    కాలపురుషుడు తానయై గ్రాలుచుండి
    శివుడు నర్ధనారి రూపాన సృష్టి జేసె
    జగములెల్లను,శుభమగు జననియు,శుభ
    కరి ముఖుని జన్మదినమది యుగాదిగాదె!

    చిన్ని పాపగ వటపత్ర సేవ్యశయను
    మదిని మెలగిన నాటకమదియె సృష్టి
    జీవజాలంబు పోషించు చేతను శుభ
    కరిముఖుని జన్మదినము యుగాదిగాదె!

    పార్వతీదేవిచే,రూపు బలము నంది
    శివుని నెదిరించి చచ్చియు,సేవ్యరీతి
    నేన్గు ముఖమున వెలిగెను నిపుడనంగ
    కరిముఖుని జన్మదినము యుగాదికాదె!

    రిప్లయితొలగించండి
  12. శివుని శూలమ్ముధాటికి శిరము తెగిన
    విఘ్నరాజును బ్రతికించ వేడ భవుని
    ప్రాణములు నిడె ముక్కంటి, పార్వతికిక
    కరిముఖుని జన్మదినమె యుగాది గాదె!

    రిప్లయితొలగించండి