వారంక్రితం ఫేస్బుక్ లో ఇదే చిత్రానికి నేనువ్రాసిన పద్యం పెట్టుడు వాకిలిలోనన్ పిట్టలకొరకింత నీరు వేసవిలోనన్ లొట్టలు వేయుచు పిట్టలు మట్టిపిడతలోనిజలము మరిమరి త్రావున్
పోయినసంవత్సరం క్రొత్తగా పద్యాలువ్రాయడం మొదలుపెట్టినపుడు ఇదే చిత్రానికి వ్రాసిన పద్యం పిట్టకోసమింత పిడతలో నీరుంచి యారుబయట పెట్టియాదుకొనుడు సాటి జీవములకు సాయపడుట కంటే నేటి జీవనమునకు నేమి కలదు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, నేను ఈ చిత్రాన్ని అక్కడినుండే కాపీ చేసి పెట్టాను. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యం చివరి పాదాన్ని ‘నేటి జీవనమున నేమి కలదు’ అనండి. గణదోషం తొలగిపోతుంది. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, ధన్యవాదాలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిస్సన్న గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ఒచ్చినది’ గ్రామ్యం. ‘వచ్చినది’ సరైన రూపం. ‘వేసవి వచ్చె దుర్భరము వేడియు...’ అందామా?
వారంక్రితం ఫేస్బుక్ లో ఇదే చిత్రానికి నేనువ్రాసిన పద్యం
రిప్లయితొలగించండిపెట్టుడు వాకిలిలోనన్
పిట్టలకొరకింత నీరు వేసవిలోనన్
లొట్టలు వేయుచు పిట్టలు
మట్టిపిడతలోనిజలము మరిమరి త్రావున్
పోయినసంవత్సరం క్రొత్తగా పద్యాలువ్రాయడం మొదలుపెట్టినపుడు ఇదే చిత్రానికి వ్రాసిన పద్యం
రిప్లయితొలగించండిపిట్టకోసమింత పిడతలో నీరుంచి
యారుబయట పెట్టియాదుకొనుడు
సాటి జీవములకు సాయపడుట కంటే
నేటి జీవనమునకు నేమి కలదు
అన్నెము పున్నెము నెరుగని
రిప్లయితొలగించండివన్నెల సొగసైన పక్షి పానము జేయన్
చిన్నవి మృణ్మయ పాత్రల
చన్నీటిని తనివిదీర సాంత్వన మొందన్
చంద్రమౌళి గారు మీ పద్యం లో మూడవపాదం లో చివరి ఇంద్ర గణం మరియు 4 వ పాదం లో చివరి రెండు ఇంద్ర గణాలు భంగంయ్యాయి చూడండి.
రిప్లయితొలగించండినీరు కంటబడక నీరు కంటనురాక
రిప్లయితొలగించండినీరు దొరక నపుడు నీరు గారు
ఊరి పక్షులకును చేరువగా నీవు
పాత్ర నీరు బెట్టి పలుకరించు.
పక్షుల కొఱకుగ నచ్చట
రిప్లయితొలగించండినిక్షిప్తము జేయు కతన నీటిని పాత్రన్
పక్షులు ద్రాగుచు నున్నవి
యక్షయ మగు పున్నె మబ్బు నందుల కార్యా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేసవిసమయమేతెంచె పిట్టలకట
రిప్లయితొలగించండినీరుదొరకక తపనతో నీల్గుచుండె
ప్రకృతి సమతుల్యమును కాచ ప్రతిన బూని
పక్షి జాతి కాపాడుడు వారినిచ్చి
మట్టి పాత్ర లందు మంచినీటిని బట్టి
రిప్లయితొలగించండిపెట్టు చున్న మనము పెరటిలోన
పిట్టలన్ని వచ్చి గుట్టుగా త్రాగును
గట్టి మేలు గాదె ఖచ్చితముగ !!!
లోకమ్ము సమస్తము నే
రిప్లయితొలగించండిశోకము లేకను వసించ స్త్రోత్రము లేలన్?
మూకటిఁ బెట్టుచు నీరిడు
సౌకర్యముఁ గూర్చ పక్షి జాతులు బ్రతుకున్!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినేను ఈ చిత్రాన్ని అక్కడినుండే కాపీ చేసి పెట్టాను.
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యం చివరి పాదాన్ని ‘నేటి జీవనమున నేమి కలదు’ అనండి. గణదోషం తొలగిపోతుంది.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గుళ్ళు వద్దు గొప్ప గోపురమ్ములు వద్దు
రిప్లయితొలగించండిదాన ధర్మ ములను దలుప వద్దు
యెండ లోన గొంతు లెండి పోయెడి జీవ
జాలమునకు నిమ్ము చాలు నీరు.
వేసవికాలమోచ్చినదివేడియుదాడికినిల్వబూనగా
రిప్లయితొలగించండిఈసమయానపక్షులకునేర్పడుదప్పికమాన్పనెంచియే
వేసవితాపమున్దరుగవెంటనెనీటిని-త్రాగురీతిగా
ఆసర|మట్టిపాత్రలిడు,అందుననీటినినుంచపుణ్యమౌ|
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఒచ్చినది’ గ్రామ్యం. ‘వచ్చినది’ సరైన రూపం. ‘వేసవి వచ్చె దుర్భరము వేడియు...’ అందామా?