16, మార్చి 2015, సోమవారం

పద్యరచన - 850

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. దోసకాయదెచ్చి కోసిముక్కలజేసి
    కార,మావుపిండి కలిపియందు
    నుప్పు, నూనె లందు నూరపెట్టినను దో
    సావకాయ సిద్ధమారగించ

    రిప్లయితొలగించండి
  2. అసలు సిసలు ఆంధ్ర ఆవ పచ్చడి కాస్త
    చూడ గానె నోట చొంగ కారు
    నెయ్య తోడ పిండి నెరపి కలిపి,ముద్ద
    రొప్పి రొప్పి తినగ గొప్ప కాదె

    రిప్లయితొలగించండి
  3. ఉప్పూ కారము నూనెయు
    చప్పున నావాలపిండి సరి దోస లనే
    యొప్పగు ముక్కల గలుపుము
    చెప్పగ దోసావకాయ చేసెద మిటులే !


    రిప్లయితొలగించండి
  4. బామ్మ చేసిన మామిడి పచ్చడిగని
    తేలుచున్నది నామది గాలిలోన
    పరుల దేశము పోయిన మరువనట్టి
    ఆంధ్రుల యమృతమే సుమ్మ ఆవకాయ

    రిప్లయితొలగించండి
  5. దోస కాయ ముక్కలుగను గోసి యపుడు
    కారముప్పు నా వపొడి యు కలిపి సమము
    గాను నూనెను బోసియు గలుప ముక్క
    లపుడ యగునార్య ! రుచిగ దో సావకాయ

    రిప్లయితొలగించండి
  6. మేలగుకారముప్పు,తగుమేరకుమెంతులు,నూనె చింతతో
    వాలినజాడియందువనవాసముజేయుచుకొన్నిమాసముల్
    ఆలియుఅమ్మలక్కలన,నద్భుతశక్తులనంగజేయగా?
    నాలుకనాగుపామువలెనాట్యముజేయద?ఆవకాయనన్|
    మగ్గినఆవకాయననుమానమువీడినబార్యవంటిదే
    సిగ్గునబుగ్గబువ్వనిడ?చిన్నదినంజుడురీతినుండగా
    దిగ్గజులైనకోరెదరు-దీటుగవూరినఆవకాయనన్
    పగ్గములేసిపట్టిననుభావనమారదునోటినాల్కకున్

    రిప్లయితొలగించండి
  7. పరిమళమిడు పంచ భక్ష్యమ్ము లున్నను
    ఆవకాయ రుచియె యద్భుతమ్ము
    నింట నుండ నిదియె నింతులకు సుఖము
    బ్రహ్మరథము బట్టు భక్ష్య మిదియె!!!

    రిప్లయితొలగించండి
  8. ముద్ద పప్పు తోడ మూడేసి ముక్కలు
    నావ కాయ గలిపి నారగించి,
    పిదప నొక్క ముక్కపెరుగన్నమునఁ దిన
    సుధను మరచెదరట సురలు మెచ్చి!

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్కృతులు.
    అసలే అనారోగ్యం. ఆపై తప్పని ప్రయాణాలు. ఇంతకుముందే ఇల్లు చేరాను. పద్యాలను పరిశీలిద్దామని కూర్చోగానే విపరీతంగా వాంతులు. ఇక ఏమాత్రం ఓపిక లేదు. పద్యాలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అతికష్టంమీద రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను. పద్యరచన శీర్షికకోసం చిత్రాన్ని వెదికే ఓపిక లేదు. రేపు పద్యరచన శీర్షిక ఉండదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ అశీర్వదించి అక్క

    రిప్లయితొలగించండి
  11. గురువు గారు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ అశీర్వదించి అక్క

    రిప్లయితొలగించండి
  12. పచ్చడి తింటే గొంతులో ఎలర్జీ వస్తుంది. కవి మిత్రులందరు యిలా ఆవకాయను గురించి వ్రాస్తూ ఉంటే
    మనసు ఆవకాయ మీదకు లాగుతుంది.చిన్నప్పుడు ముద్దపప్పుతో రోజుకు పదిముక్కలు తిన్న నోరు కోరుతూ ఉన్నది. రెండునెలలకొక సారి రుచి చూస్తున్నాను. ఏమిచెయ్యాలి?

    రిప్లయితొలగించండి