శైలజ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘గాలి’ని ‘గాలించిన’ ప్రయోగం దోషమా కాదా చెప్పలేక పోతున్నాను. వివరాలు కనుక్కుంటాను. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, ఆకాశాన్ని గురించిన అద్భుతమైన వర్ణనతో మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉంది. అభినందనలు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘చక్రబంధు’ అన్నారు. డు లేదా వు ప్రత్యయాలు చేర్చాలి. అక్కడ ‘చండకరుడు లేదా చండభుక్కు’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాగుగా లిఖించిన బ్రహ్మ వ్రాతయగును
రిప్లయితొలగించండిగగన వాహినీ రుద్రుల గానమగును
విష్ణు తానిప్పురంబున వెలసియుండు
కాక చెన్నేల వచ్చెనా కసమునకును!!
బాగుంది సార్, జిగురు వారీమధ్య కనిపించటం లేదు.
రిప్లయితొలగించండినీలి మేఘాలు తాకిన గాలి అలలు
రిప్లయితొలగించండినేల పులకించి మురియంగ నీరు కురిసె
గగన మందంత చీకటి గప్పి కొనగ
నింగి మెరుపులు మెరిసెను నిప్పు వోలె
ఆకసమ్మ నీవె యవకాశమిస్తివి
రిప్లయితొలగించండిగాలి నీరు నిప్పు నేల యుండ
చూడ బుద్ధి మాకు శూన్యమే నీయంతు
గగనమగును మాకు గగనతలమ.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిదత్తపదాలను (నేను అడుగకున్నా) అన్యార్థంలో ప్రయోగించిన మీ పూరణ చాలా బాగుంది.అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గాలించిన దొరకవుగా
రిప్లయితొలగించండినేలకు కనువిందు జేయు నీరూపంబే!
హేలగ నిప్పుక రాల్చెడు
బైలూ! నీ రుచిని గనగ పరమాద్భుతమే!!!
బైలు= ఆకాశము, రుచి= కాంతి
పంచ భూతము లీయివి పరగ వినుము
రిప్లయితొలగించండినీరు గాలియు నేలయు నిప్పు మఱియు
నాకసంబును గూడను నార్య ! వినుము
మనుగడకు ముఖ్య ములుగద మానవులకు
గాలి యాగిపోయినచోటఁ గలదదెద్ది?
రిప్లయితొలగించండినీరు పుట్టని చోటను నిలుచునెద్ది?
నిప్పు వేరు రూపుననుండు నెలవదెద్ది?
నేల జంటనెపుడు కోరు నింగి గాదె?
అబ్జ యోనియే సృష్టించె నాకసమును
రిప్లయితొలగించండినీరు నిప్పును మరి గాలి నేలతల్లి
క్రమముగానుద్భవించె నాకసమునుండి
యన్ని భూతములకు మూల మాకసమ్మె
గాలితో నుండును గాలి లేకుండును
రిప్లయితొలగించండి............శూన్యమై దోచును శుషిర మెన్న
నీరుతో నిండిన భూరి మేఘాలుండు
............నీలవర్ణము దాల్చు నింగి యెన్న
నిప్పులు కురిసెడి నీరజ బంధుని
............బండి యేగెడు ద్రోవ బయలు నెన్న
నేలనుండి కనిన నిండైన తారలన్
............పాలవెల్లిగ దోచు పైన నెన్న
పంచభూతాల నొక్కటి భవ్యమైన
యష్ట మూర్తుల లో మిన్న యాకసమ్ము,
నరుని బ్రదుకును శాసింప తిరుగుచుండు
గ్రహములకు నాట పట్టగు గగన వీధి.
తే.గీ. జీవ జాలము వేగాలి చివరి వరకు
రిప్లయితొలగించండితిరుగు జీవిత చక్రము నేలనిలను
విధిని యెదిరించి మననీరు వీరినిచట
నిప్పు శిఖలతో పోదురు నింగి వంక
ప్రణామములు గురువుగారు.. పద్యంలో" గాలించు" అని వ్రాసాను" లిం "తప్పేమోనని..మరో పద్యం పెడుతున్నా..
రిప్లయితొలగించండిగాలికి రంగులు మారుతు
నేలకు కనువిందు జేయు నీరూపమదే
ఖేలియె నిప్పులు గురిసెడు
బైలుయెవర్షించ నీరు బ్రతుకులు నడచున్ !!!
శ్రీ మిస్సన్నగారికి ప్రణామములు ..ఆకాశాన్ని అద్భుతంగా వర్ణించారు...
రిప్లయితొలగించండిగాలించి చూచిన కనుపించు నీలమై
రిప్లయితొలగించండి.........తాక శక్యము గాదు ధరణి కెపుడు
సిబ్బంది లేరని యిబ్బంది పడనీరు
.........జగతిని నింగిలో చంద్రు డినుడు
నప్పుడు నిప్పుడు నెప్పుడు తానుండి
..........సాక్షియై నిల్చును సర్వమునకు
నిను డస్త మించగనే లసత్తారల
..........హారాల దాల్చి యాహ్లాద మిడును
తుది నెరుంగ బోని తుంటరి యాశను
గగన మునకు బోల్చ కద్దు ధరని
నరుని ప్రతిభ కెన్న నాకమే హద్దని
బుధులు పలుకు మాట పూర్తి నిజము.
శైలజ గారూ ధన్యవాదాలు. మీ రెండు పద్యాలూ బాగున్నాయి. నేను కూడా రెండవ పద్యంలో గాలించు అని వాడేను
రిప్లయితొలగించండిశైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘గాలి’ని ‘గాలించిన’ ప్రయోగం దోషమా కాదా చెప్పలేక పోతున్నాను. వివరాలు కనుక్కుంటాను.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
ఆకాశాన్ని గురించిన అద్భుతమైన వర్ణనతో మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నిప్పునౌచును సూర్యుడు నేలవేడి
రిప్లయితొలగించండిజేయ,నీరును గాలిలో చేరు నింగి
యాకసంబున మేఘమై యవని తడుపు
వర్షరూపమై కురవంగ ప్రకృతి విధియ
పంచభూతాల జీవించు,వసుధ జీవు
లెల్ల,గాలి,నీరును,నిప్పులెలమి నుండి,
నేల నుండిన నీరుతా,నింపు,గాలి
కలసి,యాకాశ మేఘమై కారునిలకు
నిప్పునుండిన వేడియు నేర్పు జేరు
గాలి,యదియును తేలికై గగనమందు
వేడి యావిరియౌ నీరు వేగకలిసి
నింపు మబ్బయి యాకసిన్ నేలగురియు
చండ్ర నిప్పులు చెరగగ చక్రబంధు
రిప్లయితొలగించండినీరు వేడెక్కి నభముపై చేరుకొనుచు
జలధరములయి నేలపై చల్లుచుండ
చల్లగాలి వీచ జనులు సంతసింత్రు!
నేల పైనఁ బారు నీరుఁ గైకొననెంచి
రిప్లయితొలగించండినింగి సూర్య రశ్మి నిప్పు బెట్టి
గాలి మైత్రి తోడ గగనమ్ము కురియును
ప్రాణ ధార మహికిఁ బంచి పెట్ట!
శ్రీకందిశంకరయ్యగురువుగారికివందనములతోవిన్నపము
రిప్లయితొలగించండిపొరపాటునదత్తపదిని సమస్యాపూరణంలోవుంచాను
మన్నించండి
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చక్రబంధు’ అన్నారు. డు లేదా వు ప్రత్యయాలు చేర్చాలి. అక్కడ ‘చండకరుడు లేదా చండభుక్కు’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిస్సన్న గారు!
రిప్లయితొలగించండిఅంబరమణి లాగా వెలుగుతున్నాయి మీ పద్యాలు. ధన్యవాదాలు.
Sumalata gaaroo dhanyavaadaalu.
రిప్లయితొలగించండిగురువు గారు సూచించిన సవరణతో.......
రిప్లయితొలగించండిచండ్ర నిప్పులు చెరగగ చండకరుడు
నీరు వేడెక్కి నభముపై చేరుకొనుచు
జలధరములయి నేలపై చల్లుచుండ
చల్లగాలి వీచ జనులు సంతసింత్రు!